ఇదెక్కడి సెలెబ్రేషన్స్ రా అయ్యా.. సునామీ సృష్టించి సుద్దపూసలా కూసున్నావ్!(వీడియో)
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్మురేపాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో పరుగుల సునామీ సృష్టించాడు. అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు.
కేవలం 30 బంతుల్లోనే 10 సిక్స్‌లు, 9 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ.. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడి 14 బంతుల వ్యవధిలోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇందులో 102 రన్స్ కేవలం బౌండరీల ద్వారానే వచ్చాయి. కెరీర్‌లో అభిషేక్ శర్మకు ఇది మూడో టీ20 సెంచరీ కాగా.. ఈ శతకాన్ని వినూత్న రీతిలో సెలెబ్రేట్ చేసుకున్నాడు.

సైలెంట్‌గా బ్యాట్, హెల్మెట్ పైకెత్తిన అభిషేక్ శర్మ.. ఆ తర్వాత మైదానంలో కూర్చొని ప్రాణాయామం చేశాడు. ఓం నమ:శివాయ అని దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాడు. అభిషేక్ వినూత్న సెలెబ్రేషన్స్‌తో అక్కడ నవ్వులు పూసాయి. అతని సెలెబ్రేషన్స్‌ను చూసి టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోని ఆటగాళ్లు నవ్వు ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. 'ఇదెక్కడి సెలెబ్రేషన్స్ రా అయ్యా.. సునామీ సృష్టించి సుద్దపూసలా కూసున్నావ్!'అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఈ సునామీ ఇన్నింగ్స్‌తో అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. టెస్ట్ హోదా కలిగిన దేశాల్లో ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన మూడో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డ్‌ను కూడా అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు. భారత్ తరఫున ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ రికార్డ్ హిట్ మ్యాన్ పేరిట ఉండేది. 2017లో ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై రోహిత్ శర్మ 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో ఈ రికార్డును అభిషేక్ శర్మ అధిగమించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


