Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Aaryavir Sehwag: సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 19 ఫోర్లు, 8 సిక్సర్లతో వీరవిహారం!

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ విధ్వంసకర శతకం సాధించాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ అండర్ 19 టోర్నీ అయిన వినూ మన్కడ్ ట్రోఫీలో ఆర్యవీర్ సెహ్వాగ్ తండ్రి తరహాలోనే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ టోర్నీలో ఢిల్లీ అండర్ 19 టీమ్‌కు సారథ్యం వహిస్తున్న ఆర్యవీర్ సెహ్వాగ్.. చండీగఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 143 బంతుల్లో 19 ఫోర్లు, 8 సిక్సర్లతో 173 పరుగులు చేశాడు. అతని విధ్వంసంతో ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 289 పరుగులు చేసింది.

విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఓపెనర్లు ఆర్యవీర్, అర్నవ్ బుక్కా అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించిన అనంతరం అర్నవ్ ఔటైనా.. వికెట్ కీపర్ అభిరాజ్ సింగ్‌తో కలిసి ఆర్యవీర్ చెలరేగాడు. మూడో వికెట్‌కు 48 పరుగులు.. శాంతను యాదవ్‌తో కలిసి ఐదో వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇన్నింగ్స్ చివర్లో 46వ ఓవర్‌లో శ్రేష్త్ దుగల్ బౌలింగ్‌లో ఆర్యవీర్ ఔటయ్యాడు.

Aaryavir Sehwag smashes 173 With 19 Fours 8 Sixes to Lead Delhi U-19s in Vinoo Mankad Trophy

అంతకుముందు కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ టీమ్ 418 పరుగుల సమర్పించుకొని 220 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ మ్యాచ్‌లో కేవలం 32 పరుగులు మాత్రమే చేసిన ఆర్యవీర్.. తాజా మ్యాచ్‌లో మాత్రం విధ్వంసం సృష్టించాడు. ఇటీవల రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో జరిగిన అనధికారిక వన్డేలో భారత అండర్ 19 తరఫున అరంగేట్రం చేసిన ఆర్యవీర్ 3 మ్యాచ్‌ల్లో 109 పరుగులు చేశాడు. అతను ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఢిల్లీ లయన్స్ తరఫున ఆడుతున్నాడు.

IND vs WI: ఆఖరి టీ20లో భారత్ గెలవాలంటే అతన్ని జట్టులోకి తీసుకోవాలి: మాజీ క్రికెటర్

IND vs WI: ఆఖరి టీ20లో భారత్ గెలవాలంటే అతన్ని జట్టులోకి తీసుకోవాలి: మాజీ క్రికెటర్

విమర్శిస్తారు.. ద్వేషిస్తారు..

ఇటీవల ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరేంద్ర సెహ్వాగ్ తన కొడుకు ప్రదర్శన గురించి మాట్లాడాడు. అతనికి తాను ఇచ్చే సలహాల గురించి కూడా చెప్పుకొచ్చాడు. 'ఆర్యవీర్ సెహ్వాగ్‌ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. ఎల్లప్పుడూ ఒత్తిడి ఉంటుంది. స్వేచ్ఛగా ఆడాలని నా కొడుక్కి సలహా ఇచ్చాను. 'మైదానంలో నిన్ను నువ్వు ఆవిష్కరించుకో. భారీ స్కోర్లు సాధించాలనే ఆలోచన పక్కన పెట్టి ఆటను ఆస్వాదించు.

నువ్వు స్వేచ్ఛగా ఆడితే పరుగులు వాటంతటవే వస్తాయి. ప్రజలు నిన్ను ప్రేమిస్తారు. ఒక్కోసారి ఘాటుగా విమర్శిస్తారు. ఇంకొన్నిసార్లు బాగా ద్వేషిస్తారు. కానీ వీటిలో ఏ ఒక్కదానికి కూడా నువ్వు రియాక్ట్ కావద్దు. ఆటను ఆస్వాదిస్తూ లక్ష్యాలను అందుకోవడమే నీ పని. నువ్వు బాగా ఆడుతున్నావా? విఫలమవుతున్నావా? అనే విషయం నీకే అర్థమవుతుంది.

IND vs WI ఆఖరి టీ20కి భువనేశ్వర్ కుమార్.. గాయంతో అర్ష్‌దీప్ సింగ్ ఔట్!

Also Read

IND vs WI ఆఖరి టీ20కి భువనేశ్వర్ కుమార్.. గాయంతో అర్ష్‌దీప్ సింగ్ ఔట్!

అలాంటి సమయాల్లో నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టు. బయటి వ్యక్తులు ఏమంటున్నారనే దానికంటే ప్రాక్టీస్ చేయడంపైనే నీ ఫోకస్ ఉండాలి. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా కేవలం ఆట మీదనే దృష్టి పెట్టాలి.'అని సలహా ఇచ్చాను.'అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

Story first published: Friday, October 16, 2026, 17:52 [IST]
Other articles published on Oct 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+