ఒరేయ్ ఆజామూ.. మనల్ని చూసి ప్రపంచం నవ్వుతుంది రా!
బాబర్ ఆజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ టెస్ట్ టీమ్‌పై ఆ జట్టు చీఫ్ సెలెక్టర్ ఆఖిబ్ జావేద్ విమర్శలు గుప్పించాడు. పాకిస్థాన్ ఆట తీరును చూసి యావత్ క్రికెట్ ప్రపంచం నవ్వుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. కెప్టెన్ బాబర్ ఆజామ్, హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ అనాలోచిత కారణల వల్లే పాకిస్థాన్ జట్టుకు ఈ గతి పట్టిందని మండిపడ్డాడు.
మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడింది. ఇంగ్లండ్‌కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఈ వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌పై వేటు వేసింది. ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించి సంచలన నిర్ణయం తీసుకుంది.
బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే ఆఖరి టెస్టుకు కొత్త ఆటగాళ్లను చేర్చడంతోపాటు నయా కోచ్‌లను నియమించింది. ఈ మార్పులకు కెప్టెన్ బాబర్ ఆజామ్, కోచ్ సర్ఫరాజ్ అహ్మదే కారణమని ఆఖిబ్ జావేద్ వివరణ ఇచ్చాడు. తొలి టెస్ట్ పరాజయం అనంతరమే
కెప్టెన్, కోచ్ కఠిన నిర్ణయాలు తీసుకోలేదని, దాంతోనే బోర్డు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.

నేను చెప్పినా వినలేదు..
ముఖ్యంగా ఉబైద్ షాను తుది జట్టులోకి తీసుకోవాలని తాము సూచించినా.. కోచ్, కెప్టెన్ పట్టించుకోలేదని ఆరోపించాడు. జట్టు కూడా కనీస పోటీ ఇవ్వలేకపోవడం పరిస్థితిని దిగజార్చిందన్నాడు.
'తొలి టెస్ట్ పరాజయం తర్వాత నేనే స్వయంగా కోచ్, కెప్టెన్ ఇద్దరితోనూ మాట్లాడాను. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే ఉబైద్ షాను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాను. కానీ వారు పట్టించుకోలేదు. సల్మాన్ ఆఘాకు విశ్రాంతి ఇచ్చారు. జట్టులోనే ఉన్న ఘాజీ ఘోరీని రిజ్వాన్‌కు బదులుగా ఆడించాల్సింది.'అని ఆఖిబ్ జావేద్ చెప్పుకొచ్చాడు.
ఏడుగురిపై వేటు..
లార్డ్స్ టెస్టు ముగిసిన తర్వాత పాకిస్థాన్ ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసింది. మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, మహమ్మద్ అవైస్ జఫర్, ఖుర్రమ్ షహ్‌జాద్ ఈ జాబితాలో ఉన్నారు. వారి స్థానాల్లో సైమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్, అరాఫత్ మిన్హాస్ తదితరులు జట్టులోకి వచ్చారు.
అదే సమయంలో టెస్ట్ టీమ్ హెడ్ కోచ్‌గా మైక్ హెస్సెన్, బౌలింగ్ కోచ్‌గా యాష్లే నోఫ్‌కేలను నియమించారు. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఓడిన పాకిస్థాన్.. టెస్ట్‌లో 194 పరుగుల తేడాతో చిత్తయ్యింది. దాంతో ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ బర్మింగ్‌హామ్ వేదికగా సెప్టెంబర్ 9-13 మధ్య జరగనుంది. 018 నుంచి సెనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో పాకిస్థాన్ టెస్ట్‌ల్లో విజయం సాధించలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

