బాబర్ ఆజామ్ చెత్త రికార్డ్.. బౌలర్లతో పోటీపడుతున్న పాకిస్థాన్ కింగ్!
పాకిస్థాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజామ్ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం పాటు సెంచరీ చేయని బ్యాటర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. పాకిస్థాన్ బ్యాటింగ్ కింగ్‌గా గుర్తింపు పొందిన బాబర్ ఆజామ్.. సెంచరీల నిరీక్షణలో బౌలర్లతో పోటీపడుతున్నాడు.
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో బాబర్ ఆజామ్ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. 10 బంతుల్లో 8 పరుగులే చేసి జోష్ టంగ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులకే కుప్పకూలింది. బాబర్ ఆజామ్ 2023 నుంచి ఒక్క సెంచరీ చేయలేదు. ఈ మధ్య కాలంలో అతను 36 ఇన్నింగ్స్‌లు ఆడాడు. దాంతో 2023 నుంచి టెస్ట్‌ల్లో సెంచరీ చేయకుండా అత్యధిక ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ ఆజామ్ బౌలర్లతో పోటీపడుతున్నాడు.

బౌలర్ల జాబితాలో బాబర్ ఆజామ్..
ఈ జాబితాలో మిచెల్ స్టార్క్(50), పాట్ కమిన్స్(47), మహమ్మద్ సిరాజ్(44), నాథన్ లయన్(41) వంటి ప్రముఖ బౌలర్లు బాబర్ ఆజామ్ కంటే ముందున్నారు. ప్రభాత్ జయసూర్య, తైజూల్ ఇస్లామ్‌తో కలిసి బాబర్ ఆజామ్ ఈ జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన బాబర్ ఆజామ్.. బౌలర్లతో పోటీపడటంపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్థాన్ బ్యాటింగ్ కింగ్ బౌలర్లతో పోటీపడుతున్నాడని ఎగతాళి చేస్తున్నారు.
ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం..
పాకిస్థాన్ ఇన్నింగ్స్ అజాన్ అవైస్(102 బంతుల్లో 7 ఫోర్లతో 46), సౌద్ షకీల్(16) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్(4/11) నాలుగు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్(3/26) మూడు వికెట్లు పడగొట్టాడు. జోష్ టంగ్(2/27) రెండు వికెట్లు తీసాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. జోర్డాన్ కాక్స్(55), జేమీ స్మిత్(61) హాఫ్ సెంచరీతో రాణించగా.. గస్ అట్కిన్సన్(45), జోష్ టంగ్(30 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ అబ్బాస్(4/73) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ అలీ(3/86) మూడు వికెట్లు పడగొట్టాడు. ఖుర్రమ్ షెహ్‌జాద్, అలీ ఉస్మాన్ తలో వికెట్ తీసారు.
180 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 81 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 261 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ పాకిస్థాన్‌కు ఘోర పరాజయం తప్పేలా లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

