అతను ఉండగా సీఎస్‌కేలోకి హార్దిక్ పాండ్యా వెళ్లడు.. ఆ రెండు జట్లు బెస్ట్ ఆప్షన్: మాజీ క్రికెటర్
ఐపీఎల్ 2027 సీజన్ మినీ వేలానికి ముందు హార్దిక్ పాండ్యా భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది. ముంబై ఇండియన్స్ జట్టును వీడేందుకు సిద్దంగా ఉన్న హార్దిక్ పాండ్యా ఏ జట్టులోకి వెళ్తాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ను వీడేందుకు హార్దిక్ పాండ్యా సిద్దమయ్యాడని వార్తలు వచ్చాయి. మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా హార్దిక్‌ను అడ్డుపెట్టుకొని తమకు కావాల్సిన ఆటగాళ్లను జట్టులోకి తెచ్చుకోవాలని ప్రచారం జరుగుతోంది.
ఆటగాళ్ల ట్రేడింగ్‌కు నవంబర్ 15 చివరి గడువు. ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాలను ప్రకటించేందుకు బీసీసీఐ ఇప్పటికే డెడ్ లైన్ విధించింది. ఒకసారి రిటెన్షన్ జాబితాలను ప్రకటించిన తర్వాత వేలం ముగిసే వరకు ట్రేడ్ డీల్స్ చేసుకోవడానికి వీలు లేదు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవితవ్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

జహీర్ ఖాన్ ఉండగా..
సీఎస్‌కే, కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) జట్టులోకి వెళ్లే అవకాశమే లేదన్నాడు. జహీర్ ఖాన్ హెడ్ కోచ్‌గా ఉండటంతో ఈ ట్రేడ్ డీల్ సాధ్యం కాదని అభిప్రాయపడ్డాడు. హార్దిక్ పాండ్యాకు ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్ మంచి ఆప్షన్స్ అని తెలిపాడు.
'హార్దిక్ పాండ్యా సీఎస్‌కేకు ఏ మాత్రం వెళ్లడు. ఎందుకంటే అక్కడ హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ ఉన్నాడు. అతను ఉండగా ఈ ట్రేడ్ డీల్ అవుతుందని నేను అనుకోవడం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అక్షర్ పటేల్‌ను ఇస్తానంటే ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను వదులుకోవచ్చు. ముంబైకి అక్షర్ పటేల్ అవసరం చాలా ఉంది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వారికి భారత స్పిన్నర్ కావాలి.
కేకేఆర్, లక్నో బెస్ట్ ఆప్షన్స్..
హార్దిక్ పాండ్యా మాత్రం కేకేఆర్ మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఆ జట్టులోకి వెళ్తే అతనికి కెప్టెన్సీ లభిస్తుంది. అంతేకాకుండా తనదైనశైలిలో జట్టును నడిపించగల స్వేచ్ఛ ఉంటుంది. కేకేఆర్‌లో అతను బాగా సెట్ అవ్వగలడు. అందుకే కేకేఆర్ అతనికి అత్యంత అనువైన జట్టు అని చెబుతున్నా. హార్దిక్ పాండ్యా కోసం కోల్‌కతా ఎవరిని వదులుకుంటుందనేది వేరే విషయం.
లక్నో సూపర్ జెయింట్స్ కూడా హార్దిక్ పాండ్యాకు మంచి ఆప్షన్. అక్కడ కూడా అతనికి కెప్టెన్సీతో పాటు మిడిలార్డర్‌లో మంచి స్థానం దొరుకుతుంది. ఆ ఫ్రాంచైజీకి ఓ సారథి కావాలి. హార్దిక్ పాండ్యా కేకేఆర్‌తో పాటు ఎల్‌సీజీలోకి వెళ్తే వాటిని మెరుగుపర్చగలడు. నేను అయితే ఈ రెండు జట్లను షార్ట్ లిస్ట్ చేస్తున్నాను. ఈ రెండు మినహా అతను ఏ జట్టులోకి వెళ్లినా కెప్టెన్సీ లభించదు.'అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


