Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతను లేకపోవడంతోనే భువనేశ్వర్ కుమార్‌కు ఛాన్స్: మాజీ క్రికెటర్

భారత పురుషుల సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ జోక్యం లేకపోవడంతోనే వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు అవకాశం దక్కిందని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. అయితే వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా భువనేశ్వర్ కుమార్‌కు అవకాశం ఇచ్చారా? అని సందేహం వ్యక్తం చేశాడు.

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవి కాలం ముగియడంతో తాత్కలిక చీఫ్ సెలెక్టర్ ప్రజ్ఞాన్ ఓజా ఈ జట్టును ఎంపిక చేశాడు. టీ20 సిరీస్ నుంచి జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు 4 ఏళ్ల తర్వాత భువనేశ్వర్ కుమార్‌‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. 2022లో చివరిసారిగా ఆడిన భువనేశ్వర్ కుమార్ ఆ తర్వాత మళ్లీ భారత్ తరఫున ఆడలేదు.

భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ.. న్యూజిలాండ్‌తో తలపడే భారత టీ20 జట్టు ఇదే!

భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ.. న్యూజిలాండ్‌తో తలపడే భారత టీ20 జట్టు ఇదే!

అజిత్ అగార్కర్ నేపథ్యంలో..

ఐపీఎల్‌లో వరుస సీజన్లలో మెరుగైన ప్రదర్శన చేసినా.. సెలెక్టర్లు పట్టించుకోలేదు. 2027 వన్డే ప్రపంచకప్ సౌతాఫ్రికాలో జరుగుతుండటంతో అక్కడి కండిషన్స్ భువీకి సరిగ్గా సరిపోతాయని, అతనితో పాటు మహమ్మద్ షమీని జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు సూచించారు. ఈ క్రమంలోనే సెలెక్టర్లు అతనికి ముందు టీ20 జట్టులో చోటు కల్పించారు. టీ20ల్లో సత్తా చాటితే వన్డేల్లో కొనసాగించే అవకాశం ఉంది.

Aakash Chopra Reveals Ajit Agarkar Was Not Involved in Bhuvneshwar Kumar s T20I Return Selection

ఈ టీమ్ సెలెక్షన్‌పై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఆకాష్ చోప్రా.. భువీ ఎంపికను కొనియాడాడు. 'ఈ టీమ్ సెలెక్షన్‌లో అజిత్ అగార్కర్ భాగమవ్వలేదు. అతను సెలెక్షన్‌ కమిటీలో ఉన్నప్పటి నుంచి జట్టు ఎంపికకు దూరంగా ఉండటం ఇదే తొలిసారి. మరోవైపు భువనేశ్వర్ కుమార్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఇది ఏదైనా మార్పుకి సూచనా?

IND vs WI: శ్రేయస్ అయ్యర్ శతకం.. విండీస్‌పై భారత్ ఘన విజయం!

Also Read

IND vs WI: శ్రేయస్ అయ్యర్ శతకం.. విండీస్‌పై భారత్ ఘన విజయం!

వన్డేల్లో‌కి ప్రమోషనా..?

ముందు టీ20లు ఆడించి ఆ తర్వాత అతన్ని వన్డేల్లో ప్రయోగిస్తారా? 2027 ప్రపంచకప్‌కు సిద్ధం చేస్తారా? టీమ్ మేనేజ్‌మెంట్ ఆ దిశగానే అడుగులు వేస్తుందా? నాకైతే ప్రస్తుతం అందరి మనసులో ఉన్న అతి పెద్ద ప్రశ్న ఇదే అనిపిస్తోంది. కానీ, టీ20ల్లో భవనేశ్వర్ కుమార్‌కు కచ్చితంగా అవకాశం దక్కాలని మనం చాలా కాలంగా చెప్పుకుంటూనే ఉన్నాం. ఒక ఆటగాడు నిలకడగా రాణిస్తూ ఆడుతున్నప్పుడు ఆ ప్రతిభకు తగిన గుర్తింపు ఇవ్వాలి. చివరికి ఆ గుర్తింపు దొరికింది.'అని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, October 7, 2026, 13:59 [IST]
Other articles published on Oct 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+