న్యూజిలాండ్ సిరీస్‌లోనూ బేబీ బాస్‌కు ఛాన్స్ లేదా? శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే!
వెస్టిండీస్ జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో సమంగా ముగిసిన అనంతరం భారత జట్టు తదుపరి లక్ష్యం న్యూజిలాండ్ పర్యటనపై పడింది. అక్టోబర్ 22 నుంచి క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో భారత్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడనుంది. అయితే వెస్టిండీస్ సిరీస్ అంతటా బెంచ్‌కే పరిమితమై స్టేడియంలో సహచర ఆటగాళ్లకు డ్రింక్స్ అందించడానికే సరిపోయిన యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి న్యూజిలాండ్ పర్యటనలోనైనా తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అనే అంశంపై అభిమానుల్లోనూ, మాజీ దిగ్గజాల్లోనూ చర్చ నడుస్తోంది.
వెస్టిండీస్ జట్టుతో జరిగిన ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీకి అవకాశం రాకపోవడంపై స్పష్టత ఇచ్చాడు. వైభవ్ సూర్యవంశీకి ఎందుకు అవకాశం లభించడం లేదో, అతనితో ఏం మాట్లాడాడో శ్రేయస్ అయ్యర్ బహిరంగంగా వెల్లడించాడు. జట్టులో ఇప్పటికే ఇద్దరు అద్భుతమైన ఓపెనర్లు ఉండటం వల్ల వైభవ్ సూర్యవంశీ తన అవకాశం కోసం కొంతకాలం ఓపికగా నిరీక్షించాల్సి వస్తోందని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయాన్ని వివరించాడు.

వైభవ్ సూర్యవంశీతో జరిగన సంభాషణ గురించి శ్రేయస్ అయ్యర్ చెబుతూ.. "నేను వైభవ్‌తో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను. నీకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది.. కానీ అప్పటివరకు నీ ప్రాసెస్‌పై శ్రద్ధ చూపుతూ నిలకడగా ఉండాలని చెబుతుంటాను. కొన్నిసార్లు అవకాశం కోసం కొంచెం ఎక్కువ కాలం వేచి చూడక తప్పదు. ప్రస్తుతం మన దగ్గర సెట్ అయిన ఓపెనింగ్ జోడీ ఉంది. ఇదే విషయాన్ని మేము వైభవ్ సూర్యవంశీకి స్పష్టంగా వివరించాం" అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.
జట్టు బ్యాలెన్స్, ఓపెనర్ల ఫామ్ దృష్ట్యా వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వలేకపోతున్నామని కెప్టెన్ చెప్పనప్పటికీ.. రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌లోనైనా ఈ యువ బ్యాటర్‌కు తుది జట్టులో స్థానం లభిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


