Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 ఫైనల్‌ మ్యాచ్‌ చూసిన అభిమానికి కరోనా వైరస్!!

A Person Who Attended ICC Women’s T20 World Cup Final at The MCG Diagnosed With Coronavirus

మెల్‌బోర్న్: ఇటీవల ఆస్ట్రేలియా ముగిసన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూసిన ఓ అభిమానకి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. మెల్‌బోర్న్ స్టేడియం వేదికగా గత ఆదివారం(మార్చి 8న) భారత్‌-ఆస్ట్రేలియా మధ్య టైటిల్ ఫైట్ జరిగిన విషయం తెలిసిందే.

కరోనా కలకలం..

కరోనా కలకలం..

ఈ మ్యాచ్‌లో 85 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తుచేసిన ఆస్ట్రేలియా.. ఐదోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఇక ఈ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు రికార్డు స్థాయిలో 86,174 మంది అభిమానులు మెల్‌బోర్న్ స్టేడియానికి వచ్చారు. అయితే వీరిలో ఓ వ్యక్తి ప్రస్తుతం కరోనా బారిన పడినట్లు ఆస్ట్రేలియాలోని ఆరోగ్య, మానవ సేవల విభాగం ప్రకటించింది. వైరస్‌ నిర్ధారణ అయిన వ్యక్తి నార్త్‌ స్టాండ్‌లోని లెవల్‌2లో ఎన్‌42 సీట్లో కూర్చున్నట్లు మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌(ఎంసీజీ) గుర్తించింది.

అయితే, అతని వల్ల స్టేడియంలో మిగతావారికి వైరస్‌ సోకే అవకాశం చాలా తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఆ స్టాండ్‌లో కూర్చున్న ప్రేక్షకులు భయపడాల్సిన అవసరం లేదని, కేవలం వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పారు.

కరోనా దెబ్బ : ప్రేక్షకుల్లేకుండానే ఐపీఎల్!!

క్రీడాలోకం అతలాకుతలం..

క్రీడాలోకం అతలాకుతలం..

కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఆ ప్రభావం క్రీడలపై కూడా పడుతుండటంతో.. ఇప్పటికే ఫుట్‌బాల్ టోర్నీలు ప్రేక్షకులు లేకుండానే కొనసాగుతున్నాయి. ఇక భారత్‌లోనూ ఇప్పటికే పాజిటివ్ కేసులు 70కిపైగా చేరగా.. ఐపీఎల్ 2020 సీజన్‌ మ్యాచ్‌లు జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల్లేకుండా క్యాష్ రిచ్ లీగ్‌ను నిర్వహించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అలాగే పర్యాటక వీసాల్ని రద్దు చేయడంతో ఆ ప్రభావం ఐపీఎల్‌పైనా పడనుంది.

సహనం కోల్పోయిన బౌలర్.. మిడిల్ స్టంప్ విరగ్గొట్టాడు!! (వీడియో)

భారత మహిళలకు అవమానం..

భారత మహిళలకు అవమానం..

టీ20 ప్రపచంకప్ ఫైనల్లో ఓడి స్వదేశానికి చేరుకున్న భారత అమ్మాయిల జట్టుకు ఘోర అవమానం జరిగింది. వారికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయంలో ఒక్క బీసీసీఐ అధికారి కూడా రాలేదు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సేనకు ఒక్కరు కూడా స్వాగతం పలకలేదు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తొలిసారి ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరి స్వదేశానికి వచ్చిన జట్టుకు స్వాగతం పలకరా? అంటూ అభిమానులు బీసీసీఐపై మండిపడుతున్నారు. అదే పురుషుల జట్టు అయితే ఇలాగే వ్యవహరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.

Story first published: Thursday, March 12, 2020, 19:03 [IST]
Other articles published on Mar 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+