Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓపెనర్ల వైఫల్యం.. కోహ్లీ, బుమ్రా ఫ్లాప్ షోనే టీమిండియా కొంపముంచిందా?

3 reasons why India lost 3-match ODI series against New Zealand

హైదరాబాద్: వరల్డ్‌కప్ సెమీస్ ఓటమి అనంతరం వరుస విజయాలతో దూసుకుపోయిన భారత్‌కు న్యూజిలాండ్ గట్టిషాక్ ఇచ్చింది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా జైత్రయాత్ర కొనసాగిస్తున్న కోహ్లీసేన జోరుకు కివీస్ కళ్లెం వేసింది. మంగళవారం జరిగిన మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలిచి భారత్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

ఫలితంగా 31 ఏళ్ల తర్వాత క్లీన్ స్వీప్ అయిన జట్టుగా కోహ్లీ సేన అప్రతిష్టను మూటగట్టుకుంది. వన్డే ప్రపంచకప్‌లో ఇదే న్యూజిలాండ్ ఖంగుతున్ని భారత్.. ఐదు టీ20ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి బదులు తీర్చుకుంది. కానీ మూడు వన్డేల వన్డే సిరీ‌స్‌లో మాత్రం ఆ జోరును కొనసాగించలేకపోయింది.

ఓటమెరుగని కోహ్లీసేనకు..

ఓటమెరుగని కోహ్లీసేనకు..

వరల్డ్‌కప్ అనంతరం న్యూజిలాండ్‌తో తాజా సిరీస్‌ను కలుపుకొని భారత్ మొత్తం నాలుగు వన్డే సిరీస్‌లు ఆడింది. 2019లో వెస్టిండీస్ పర్యటలనో మూడు వన్డేల సిరీస్ 2-0తో చేజిక్కించుకున్న భారత్.. అనంతరం స్వదేశంలో జరిగిన మరో సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. తర్వాత పటిష్ట ఆస్ట్రేలియాను 2-1తో ఓడించి సత్తాచాటింది. కానీ కివీస్‌తో మాత్రం పూర్తిగా తేలిపోయింది.

పుట్టపర్తిలో ఎంఎస్ ధోనీ.. సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న మహీ

అయితే భారత ఓటమికి ఓపెనర్ల వైఫల్యం.. కెప్టెన్ కోహ్లీ, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఫ్లాప్ షోనే కారణమని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

దారుణంగా విఫలమైన కోహ్లీ..

దారుణంగా విఫలమైన కోహ్లీ..

రికార్డుల రారాజు, నిలకడకు మారుపేరైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. మైదానంలో అడుగుపెడితే బౌలర్లపై విరుచుకుపడుతూ సెంచరీల మోత మోగించే కోహ్లి.. ఈ సిరీస్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు.

అడ్డొస్తే పరుగెలా తీయాలి..? బౌలర్‌తో రాహుల్ వాగ్వాదం

తొలి వన్డే హాఫ్ సెంచరీ మినహా వరుసగా రెండు వన్డేల్లోను విఫలమయ్యాడు. దీంతో భారత్ కూడా ఓటమిపాలై సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ సిరీస్‌లో కోహ్లీ 55,15,19 పరుగులతో మొత్తం 75 పరుగులు చేశాడు. యావరేజ్‌గా 25 పరుగులు చేశాడు. కోహ్లీ ఇంత దారుణంగా విఫలమవ్వడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి. 2015లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఈ రన్ మెషిన్ 16.33 సగటుతో ఘోరంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత ఎప్పుడూ ఇంత దారుణ ప్రదర్శన కనబర్చలేదు.

బుమ్రా చెత్త రికార్డు..

బుమ్రా చెత్త రికార్డు..

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ మూడు వన్డేల సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఎన్నడూ లేని విధంగా పరుగులు సమర్పించుకున్న ఈ యార్కర్ల్ కింగ్.. ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయకుండా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌లో బుమ్రా వికెట్ తీయకపోవడం ఇదే తొలి సారి. తొలి వన్డేలో 10 ఓవర్లు వేసి 53 పరుగులిచ్చిన బుమ్రా ఇందులో 13 వైడ్లు వేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.

రెండో వన్డేలో 10 ఓవర్లకు 64 పరుగులిచ్చి వికెట్ పడగొట్టకుండా నిరాశపరిచాడు. మూడో వన్డేలో కూడా 10 ఓవర్లకు 50 పరుగులే ఇచ్చి కట్టడి చేసినా ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఈ సిరీస్ అతని యావరేజ్‌ ఇంపాక్ట్ 11.6 కాగా... అతనికిది ఏ సిరీస్‌లోనైనా ఇదే అత్యంత చెత్త యావరేజ్ కావడం గమనార్హం.

ఓపెనర్ల వైఫల్యం..

ఓపెనర్ల వైఫల్యం..

రెగ్యూలర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ గాయాలతో జట్టుకు దూరమవడంతో వారి స్థానాల్లో అవకాశం దక్కించుకున్న మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. వీరి కోసం కేఎల్ రాహుల్‌ను మిడిలార్డ్‌కు పంపి టీమ్‌మేనేజ్‌మెంట్ ఇచ్చిన చక్కని అవకాశాన్ని చేజార్చుకున్నారు.

పవర్ ప్లే ముగిసేలోపే వికెట్ పారేసుకొని భారత ఓటమికి కారణమయ్యారు. తొలి వన్డేలో పర్వాలేదనిపించి ఈ జోడీ రెండు, మూడో వన్డేలో మాత్రం దారుణంగా విఫలమయ్యారు. పృథ్వీ షా 20, 24, 40 కాస్త పోరాడినా.. మయాంక్ మాత్రం పూర్తిగా విఫలమై నిరాశపరిచాడు. 32,3,1తో తన వన్డే కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. వీరి వైఫల్యం కూడా భారత ఓటమికి ఒక కారణమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Tuesday, February 11, 2020, 18:13 [IST]
Other articles published on Feb 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+