Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పుట్టపర్తిలో ఎంఎస్ ధోనీ.. సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న మహీ

Legendary Cricketer MS Dhoni Visits Puttaparthi Sri Sathya Sai Baba Temple

హైదరాబాద్ : వన్డే ప్రపంచకప్‌ సెమీస్ అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మైదానానికి దూరమైన విషయం తెలిసిందే. తొలుత భారత సైన్యంలో సేవ చేసేందుకు రెండు నెలలు విశ్రాంతి తీసుకున్న జార్ఖండ్ డైనమైట్.. ఆ తర్వాత జనవరి వరకు క్రికెట్ సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని సూచించాడు. ఆ తర్వాత కూడా ధోని నోరు విప్పకపోవడం.. బీసీసీఐ కాంట్రాక్టుల నుంచి తొలగించడంతో మహీ రిటైర్మెంట్‌పై అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ధోనీ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా త‌న‌కు ల‌భించిన విరామాన్ని ఆస్వాదిస్తున్నాడు.

పుట్టపర్తిలో భారత మాజీ కెప్టెన్

పుట్టపర్తిలో భారత మాజీ కెప్టెన్

ఇక ధోని మంగళవారం పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి ట్రస్ట్‌ సభ్యులు ధోనికి ప్రశాంతి నిలయంలో ఘన స్వాగతం పలికారు. ధోని వ్యక్తిగత డాక్టర్‌ ముత్తు.. పుట్టపర్తి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజిటింగ్‌ వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్‌ ముత్తు కోసం ధోని పుట్టపర్తి వచ్చినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిని పరిశీలించిన ధోనికి బాబా విశిష్టత, సేవా కార్యక్రమాలను ట్రస్ట్‌ సభ్యులు వివరించారు. అనంతరం సత్యసాయి ట్రస్ట్‌ సభ్యులు ధోనిని ఘనంగా సన్మానించారు.

కాంట్రాక్ట్‌ లిస్టులో దక్కని చోటు

కాంట్రాక్ట్‌ లిస్టులో దక్కని చోటు

తాజాగా బీసీసీఐ 2019 అక్టోబర్‌ నుంచి 2020 సెప్టెంబర్‌ వరకూ ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్‌ జాబితాను ప్రకటించగా.. అందులో ధోనీకి కాంట్రాక్ట్‌ ఇవ్వలేదు. దీంతో మహీ మళ్లీ భారత్ జట్టు తరఫున ఆడటం అనుమానమేనంటూ వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ తనను కాంట్రాక్ట్‌ జాబాతా నుంచి తప్పించిన రోజే ధోనీ ఝార్ఖండ్‌ రంజీ జట్టుతో కలిసి మైదానంలో ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. దీంతో ఐపీఎల్‌-2020కి సన్నద్ధం అవుతున్న విషయాన్ని మహీ చెప్పకనే చెప్పేశాడు.

అడ్డొస్తే పరుగెలా తీయాలి..? బౌలర్‌తో రాహుల్ వాగ్వాదం

2021 ఐపీఎల్ ఆడుతాడు..

2021 ఐపీఎల్ ఆడుతాడు..

మహీ టీమిండియాకు ఆడినా ఆడకపోయినా.. ఈ ఏడాడితో పాటు వచ్చే ఏడాది కూడా ఐపీఎల్‌ ఆడనున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ యజమాని ఎన్‌ శ్రీనివాసన్‌ ఇదివరకే స్పష్టం చేసారు. 'ధోనీ 2020 ఐపీఎల్‌ ఆడుతాడు. 2020 ఐపీఎల్‌తో పాటు 20021 ఐపీఎల్‌లో కూడా ధోనీ తమ జట్టు తరఫున బరిలోకి దిగుతాడు. వచ్చే ఏడాది మహీ వేలంలో ఉన్నా.. మేమే తీసుకుంటాం. ధోనీపై నమ్మకం ఉంది, వచ్చే రెండు ఐపీఎల్‌ సీజన్లలో ధోనీ నేతృత్వంలోనే బరిలోకి దిగుతాం' అని శ్రీనివాసన్‌ పేర్కొన్నారు.

రాహుల్ రాకతో సైడ్ ట్రాక్..

రాహుల్ రాకతో సైడ్ ట్రాక్..

టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కీపింగ్ గ్లౌవ్స్ అందుకోవడంతో ధోని భవితవ్యంపై జరిగిన చర్చ సైడ్ ట్రాక్ అయింది. ఆస్ట్రేలియా సిరీస్‌లో పంత్ అనూహ్య గాయంతో కీపింగ్ గ్లౌవ్స్‌ను అందుకున్న రాహుల్.. ఆ సిరీస్‌లో బ్యాట్‌తో పాటు వికెట్ల వెనుకాల అద్భుతంగా రాణించాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో తన పెర్పామెన్స్ మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. వన్డే సిరీస్‌లో కూడా బ్యాటింగ్, కీపింగ్‌లో మెరిసాడు.

Story first published: Tuesday, February 11, 2020, 17:04 [IST]
Other articles published on Feb 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+