Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అధికారుల అలసత్యం.. పీవీ సింధుతో సహా బ్యాడ్మింటన్ స్టార్లకు తప్పని తిప్పలు!

భారత బ్యాడ్మింటన్ స్టార్లకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) నిధుల విడుదల చేయకపోవడంతో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుతో సహా పలువురు బ్యాడ్మింటన్ స్టార్లు సొంత డబ్బులతో టోర్నీలు ఆడారు.

యూరప్ పర్యటనలో పీవీ సింధు,లక్ష్య సేన్‌తో పాటు పలువురు భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ పర్యటనలోని నాలుగు టోర్నీలను సొంత ఖర్చులతో ఆడారు.

అందువల్లే ఓటమి.. నిర్వాహకుల తీరుపై మండిపడ్డ పీవీ సింధు!

అందువల్లే ఓటమి.. నిర్వాహకుల తీరుపై మండిపడ్డ పీవీ సింధు!

అసలేం జరిగిందంటే..?

యూరప్ పర్యటనలో భాగంగా ఫిన్లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీలో జరిగిన నాలుగు టోర్నీలకు నిధులు ఇవ్వడానికి సాయ్ నిరాకరించిందని ఇండియన్ ఎక్స్‌పెస్ తమ కథనంలో పేర్కొంది. అక్టోబర్ 6న ఫిన్లాండ్‌లో జరిగిన ఆర్కిటిక్ ఓపెన్‌ ప్రారంభానికి ముందే ఈ విషయం తెలియడంతో భారత ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు కూడా తమకు అవకాశం లేకుండాపోయిందని ఆటగాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు.

PV Sindhu Lakshya Sen and Other Indian Shuttlers Face Funding Crisis SAI Points to BAI s Delay in Releasing Funds

ఈ పరిణామంపై ఒలింపిక్ విజేత పీవీ సింధు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 'సాయ్ నిధులు ఇవ్వలేదని తెలిసినప్పుడు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను. ఇలాంటి పరిస్థితిని నా కెరీర్‌లోనే ఎదుర్కొలేదు. ప్రస్తుతానికి నిధుల కంటే నా ఆటపై ఫోకస్ పెట్టడమే నాకు ముఖ్యం.'అని పీవీ సింధు తెలిపింది. ఆమె తన సొంత నిధులతో పాటు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సపోర్ట్‌తో ఈ పర్యటనను పూర్తి చేసింది.

బాయ్ వల్లే నిధులు ఇవ్వలేదు..

బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్నీత గడువులోగా ప్రతిపాదనలు సమర్పించకపోవడంతోనే నిధుల విడుదల చేయలేదని కేంద్ర క్రీడా శాఖ మంత్రిత్వ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త రూల్స్ ప్రకారం.. టోర్నీ ప్రారంభానికి కనీసం 30 రోజుల ముందే ఆటగాళ్ల పేర్లతో కూడిన ప్రతిపాదనను సమర్పించాలి.

అయితే ఈ కొత్త రూల్‌ గురించి తమకు తెలియదని, ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధికారులు మా మైఖేల్ ప్రతినిధికి తెలిపారు. నిధుల నిలిపివేత తమను ఆశ్చర్యానికి గురిచేసిందని బాయ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై సాయ్ నుంచి స్పష్టత కోరుతామని వెల్లడించాయి.

ట్రెడిషన్ తెలుసుకోరా అయ్యా.. వెండి బతుకమ్మ విమర్శలపై ఇచ్చిపడేసిన పీవీ సింధు!

Also Read

ట్రెడిషన్ తెలుసుకోరా అయ్యా.. వెండి బతుకమ్మ విమర్శలపై ఇచ్చిపడేసిన పీవీ సింధు!

కోచ్‌లు లేకుండానే..

నిధుల కొరత కారణంగా చాలా మంది క్రీడాకారులు కోచ్‌లు లేకుండానే ఈ టోర్నీలు ఆడాల్సి వచ్చింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో అకానే యమగుచితో జరిగిన మ్యాచ్‌లో అశ్విత చాలిహా విజయం సాధించినప్పుడు.. సహా షట్లర్ ఇషారాణి బారువా ఆమెకు కోచ్‌గా వ్యవహరించింది.

డెన్మార్క్ ఓపెన్‌ క్వార్టర్ ఫైనల్లో తన్వి శర్మ కూడా సైడ్ లైన్స్ నుంచి గైడెన్స్ ఇచ్చే కోచ్ లేకుండానే ఆడింది. క్రీడాకారులు మైదానంలో అద్భుత విజయాలు సాధిస్తున్నప్పటికీ.. అధికారుల అలసత్వం కారణంగా వారు ఇబ్బందులు ఎదుర్కోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆసియా గేమ్స్ 2026లో బ్యాడ్మింటన్ విభాగంలో ఒక్క వ్యక్తిగత పతకం గెలవకపోవడంతోనే సాయ్ నిధులు విడుదల చేయలేదనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని సాయ్ ఖండించింది.

Story first published: Tuesday, November 3, 2026, 14:30 [IST]
Other articles published on Nov 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+