Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ట్రెడిషన్ తెలుసుకోరా అయ్యా.. వెండి బతుకమ్మ విమర్శలపై ఇచ్చిపడేసిన పీవీ సింధు!

సోషల్ మీడియాలో ఈ మధ్య కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం ఎక్కువైంది. ప్రతీ విషయాన్ని వివాదం చేస్తూ పబ్బం గడిపే గబ్బుగాళ్లు చాలా మంది ఉన్నారు. తాజాగా మాజీ వరల్డ్ ఛాంపియన్, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు‌పై ట్రోలింగ్‌ చేయబోయి నవ్వుల పాలయ్యారు. వెండి బతుకమ్మతో పీవీ సింధు ఉన్న ఫొటోలను తప్పుబడుతూ ఘాటైన విమర్శలు చేశారు.

'పూలు పేర్చితే బతుకమ్మ అంటారు. మీ పైత్యం పండుగ మీద రుద్దకండి'అని ట్రోలింగ్‌కు దిగారు. అయితే ఈ విమర్శలకు పీవీ సింధు తనదైన శైలిలో బదులిచ్చారు. కరీం నగర్ కోడలిగా తాను తొలిసారి బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నానని, సంప్రదాయంగా తన అత్తగారు వెండి బతుకమ్మ వాయినంగా ఇచ్చారని స్పష్టం చేశారు. విమర్శలు చేసే ముందు సంప్రదాయాలను తెలుసుకోవాలని హితవు పలికారు.

19 నెలల టైటిల్ కరువుకు తెర: చరిత్ర సృష్టించిన పీవీ సింధు!

19 నెలల టైటిల్ కరువుకు తెర: చరిత్ర సృష్టించిన పీవీ సింధు!

ట్రెడిషన్ తెలుసుకోరా అయ్యా..

'ఓ తీర్పు ఇచ్చే ముందు దయచేసి సంప్రదాయాలను అర్థం చేసుకోండి. మా కుటుంబంలో మేం సంప్రదాయబద్దంగా బతుకమ్మను జరుపుకోం. కాబట్టి ఇదే నాకు మొట్టమొదటి బతుకమ్మ పండుగ. తెలంగాణ నడిబొడ్డున ఉన్న కరీంనగర్ కుట్టుంబంలోకి కోడలిగా అడుగుపెట్టాను. ఫొటోలో కనిపిస్తున్న ఆ పెద్ద పూల బతుకమ్మను చూశారా? దాన్ని అలంకరించడానికి నేను దాదాపు రోజంతా గడిపాను.

PV Sindhu Hits Back at Silver Bathukamma Trolls Says People Should Understand the Tradition First

దాంతో మేము పండుగ చేసుకున్నాం. తన హృదయానికి ఎంతో దగ్గరైన ఈ సంప్రదాయంలోకి నన్ను సాదరంగా ఆహ్వానించడానికి మా అత్తగారు ఇచ్చిన మార్గమే ఆ వెండి బతుకమ్మ. సంప్రదాయాలతో పాటే తల్లి ప్రేమకు కూడా కచ్చితంగా చోటు ఉంటుంది.'అని పీవీ సింధు హుందాగా బదులిచ్చారు.

కొత్త పెళ్లి కూతురికి వెండి బతుకమ్మ..

వెండి వస్తువులు, కళాకృతల తయారీకి కరీం నగర్ ఫేమస్. పైగా తొలి బతుకమ్మ పండుగకు కొత్తగా పెళ్లయిన కూతురికి వెండి బతుకమ్మ వాయినం ఇవ్వడం తెలంగాణ సంసృతిలో భాగమే. ఈ విషయం తెలియని కొందరు ఆకతాయిలు పీవీ సింధుపై విమర్శలు చేయబోయి నవ్వుల పాలయ్యారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వెంకట దత్త సాయిని పీవీ సింధు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

అందువల్లే ఓటమి.. నిర్వాహకుల తీరుపై మండిపడ్డ పీవీ సింధు!

Also Read

అందువల్లే ఓటమి.. నిర్వాహకుల తీరుపై మండిపడ్డ పీవీ సింధు!

పీవీ సింధుపై ట్రోలింగ్ దిగిన వారిపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఆంధ్ర అమ్మాయి అయినా.. తెలంగాణ కోడలిగా ఇక్కడి సంప్రదాయాలను పాటిస్తుందని, ఆమెను ఎక్కిరిస్తే మనల్ని మనం విమర్శించుకున్నట్లేనని మండిపడుతున్నారు. పీవీ సింధు హైదరాబాద్ సంస్కృతిని గౌరవిస్తుందని, ఆమె బోనం ఎత్తుతుందని, బతుకమ్మ ఆడుతుందని గుర్తు చేస్తున్నారు. దాండియాల్ని, గార్బాల్ని తెలంగాణపై రుద్దుతున్న ఈ రోజుల్లో పీవీ సింధు తన అత్తింటి సంస్కృతిని తలకెత్తుకుందని కొనియాడుతున్నారు. ఆమెను వెక్కిరించవద్దని, గౌరవించాలని పిలుపునిస్తున్నారు.

Story first published: Monday, October 19, 2026, 16:21 [IST]
Other articles published on Oct 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+