19 నెలల టైటిల్ కరువుకు తెర: చరిత్ర సృష్టించిన పీవీ సింధు!
టోక్యో వేదికగా జరిగిన జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత దిగ్గజ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్ అకానే యమగుచిని ఓడించి పీవీ సింధు తొలిసారిగా జపాన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ చారిత్రాత్మక విజయంతో జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా పీవీ సింధు సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. అంతేకాకుండా గత 19 నెలలుగా సాగుతున్న తన సుదీర్ఘ టైటిల్ నిరీక్షణకు ఈ గెలుపుతో తెరదించింది.
ఈ ఉత్కంఠభరిత టైటిల్ పోరులో మొదటి గేమ్‌లోనే పీవీ సింధు ఆరంభంలో యమగుచి కంటే వెనుకబడింది. కానీ భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు అద్భుతంగా పుంజుకుని మ్యాచ్‌పై పట్టు సాధించింది. జపనీస్ క్రీడాకారిణి యమగుచిని వరుస గేమ్‌లలో 21-17, 21-17 తేడాతో ఓడించింది. డిసెంబర్ 2024లో స్వదేశంలో సయ్యద్ మోడీ అంతర్జాతీయ టైటిల్ గెలిచిన తర్వాత సింధుకు ఇది మొదటి టైటిల్. దీనితో పాటు, 31 ఏళ్ల సింధు కెరీర్‌లో ఇది మొదటి సూపర్ 750 సిరీస్ టైటిల్. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన ఏడేళ్ల తర్వాత పీవీ సింధుకు ఇది మొదటి ప్రధాన టైటిల్ విజయం.

యమగుచిపై రికార్డు ఆధిక్యాన్ని సాధించిన సిందు
ఈ ఇద్దరు క్రీడాకారుల మధ్య కెరీర్లో ఇది 30వ మ్యాచ్ కావడం విశేషం. ఇటీవల కాలంలో వారి మధ్య జరిగిన గత 10 మ్యాచ్‌లలో ఏడింటిలో గెలిచి యమగుచి పైచేయి సాధించినప్పటికీ.. సింధు తన కెరీర్‌లో తొలిసారిగా జపాన్ ఓపెన్ ఫైనల్‌కు చేరడం ద్వారా యమగుచిపై తన మొత్తం ఆధిక్యాన్ని 16-14కు పెంచుకుంది. అంతకుముందు సెమీ-ఫైనల్స్‌లో గాయపడిన చెన్ యుఫెయిని ఓడించి సింధు ఫైనల్‌లో స్థానం సంపాదించింది. ఈ గొప్ప విజయంతో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సర్క్యూట్‌లో అద్భుతమైన రీఎంట్రీ కోసం పీవీ సింధు మరోసారి తన వాణిని వినిపించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

