Japan Open 2026: చరిత్ర సృష్టించిన పీవీ సింధు!
భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళా షట్లర్‌గా రికార్డ్ సాధించింది. శనివారం ఉదయం జరిగిన సెమీఫైనల్లో మాజీ వరల్డ్ ఛాంపియన్ సింధు 21-19, 15-10 తేడాతో చైనాకు చెందిన చెన్ యుఫీయ్‌ను మట్టికరిపించింది. రెండో సెట్‌లో సింధు ఆధిక్యంలో ఉండగానే యుఫీయ్ గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. దాంతో సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఈ సెమీఫైనల్లో పీవీ సింధు పూర్తి ఆధిపత్యం చెలాయించిది. తొలి సెట్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైనా.. సింధు ఏ మాత్రం తడబడకుండా ఆడి గేమ్‌ను 21-19తో కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఆమెకు ఎదురు లేకుండా పోయింది. రెండో గేమ్‌ను దాదాపుగా ఏకపక్షంగా మార్చేసింది. ఈ సెట్‌లో 15-10 నిలిచిన సమయంలో చెన్ యుఫీయ్ గాయపడటం సింధుకు కలిసొచ్చింది. తొడ కండరాల గాయంతో యూఫీ నిష్క్రమించింది. దాంతో మ్యాచ్ అంపైర్లు పీవీ సింధును విజేతగా ప్రకటించారు.

ఈ చిరస్మరణీయ విజయంతో చైనా క్రీడాకారిణి చెన్ యుఫీపై గతంలో ఉన్న వరుస అయిదు మ్యాచ్‌ల ఓటముల పరంపరకు సింధు తెరదించింది. కొంతకాలంగా యుఫీ చేతిలో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న సింధు.. ఈ కీలక పోరులో మాత్రం మొదటి నిమిషం నుంచే దూకుడుగా ఆడింది. ఎటువంటి ఒత్తిడి లేకుండా గేమ్ ప్లాన్‌ను అమలు చేసింది. లాంగ్ ర్యాలీలు, నెట్ గేమ్, గ్రౌండ్ షాట్స్‌తో సింధు అదరగొట్టింది.
గత కొద్దీ రోజులుగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సింధుకు ఈ విజయం ఊరటనిస్తోంది. గత రెండేళ్లలో సింధు ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఆమె చివరిసారిగా 2024 సయ్యద్ మోదీ ఇంటర్నేషన్ టోర్నీ విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆడిన ఏ టోర్నీలోనూ ఫైనల్ చేరలేదు.
ఆదివారం జరిగే జపాన్ ఓపెన్ 750 ఫైనల్లో లోకల్ ప్లేయర్ అకనె యమగుచితో పీవీ సింధు తలపడనుంది. మరో సెమీస్‌లో యమగుచి 9-21,21-16, 21-4 తేడాతో పుత్రి కుసుమ వర్దానిపై విజయం సాధించింది. ఫైనల్లో సింధు విజయం సాధిస్తే ఈ టోర్నీ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్‌గా చరిత్రకెక్కుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

