నేనే RCB లక్కీ చార్మ్.. కాస్త లెక్కలేసుకోండి: పీవీ సింధు
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది కూడా విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్స, రెండు సార్లు ఒలింపిక్ మెడల్ సాధించిన పీవీ సింధు సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీ జట్టుకు ఆసక్తికరంగా, కాస్త ఫన్నీగా శుభాకాంక్షలు తెలిపారు.
గత కొన్నేళ్లుగా పీవీ సింధు బెంగళూరులోని నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పీవీ సింధు తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఓ ఫన్నీ కామెంట్ చేసింది. "ఆర్సీబీ అభిమానులారా.. నేనే మీ లక్కీ చార్మ్ అని చెప్పడం లేదు.. కానీ నేను బెంగళూరుకు వచ్చినప్పటి నుంచి మీరు ప్రతి ఏడాది ట్రోఫీని గెలుస్తూనే ఉన్నారు. కాస్త మీరే లెక్కలు వేసుకోండి!" అంటూ నవ్వుతున్న ఎమోజీలకో పోస్ట్ చేశారు.

"అద్భుతమైన ఆర్సీబీ జట్టుకు, ఆటగాళ్లకు, స్టాఫ్, మేనేజ్మెంట్, అభిమానులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ ఫ్రాంచైదీ ఇన్నేళ్లుగా ఎన్నో ఎమోషన్స్, గుండెకోతలు, నమ్మకం, ప్రేమను చూసింది. అలాంటి జట్టు వరుసగా రెండు సార్లు ఛాంపియన్ గా నిలవడం చూడటం నిజంగా చాలా ప్రత్యేకం" అని పీవీ సింధు కొనియాడారు.
హైదరాబాద్‌కు చెందిన పీవీ సింధు నిజానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కూడా పెద్ద అభిమాని. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ జట్ల మధ్య జరిగి ఉంటే బాగుండేదని ఆమె తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. " సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగడం అనేది ఒక డ్రీమ్ మ్యాచ్‌లా ఉండేది. ఈ రెండు జట్ల మధ్య పోరు మనల్ని ఎమోషనల్‌గా ఎక్కడికో తీసుకెళ్లేది" అని పేర్కొన్నారు.
చివరగా ఆర్సీబీ సహ-యజమాని, తన ఆప్తమిత్రురాలైన అనన్య బిర్లాకు కూడా సింధు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. "నా ప్రియమైన స్నేహితురాలు అనన్య బిర్లా, ఆమె కుటుంబానికి అభినందనలు. జట్టు యాజమాన్యాన్ని చేజిక్కించుకున్న వెంటనే ఇలా ఛాంపియన్‌షిప్ గెలవడం అనేది నిజంగా ఒక 'మెయిన్ క్యారెక్టర్' రేంజ్ సక్సెస్" అంటూ పీవీ సింధు ప్రశంసల జల్లు కురిపించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications