Asia Games 2026: భారత్‌కు పతకం.. 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!
ఆసియా గేమ్స్‌లో భారత్ మరో పతకం సాధించింది. టీమ్ ఈవెంట్‌లో పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ బ్రాంజ్ మెడల్ నెగ్గింది. బుధవారం జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 1-3 తేడాతో చైనా చేతిలో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో ఫైనల్ చేరే అవకాశం కోల్పోయిన భారత్.. కాంస్యంతో సరిపెట్టుకుంది. అయితే వరుసగా ఆసియా గేమ్స్‌లో భారత్ రెండోసారి పతకం గెలవడం 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
2023 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో భారత్ రజతం సాధించిన సంగతి తెలిసిందే. అప్పుడూ కూడా ఫైనల్లో చైనా చేతిలోనే భారత్ ఓటమిపాలైంది. 1982, 1986 ఆసియా క్రీడల్లో కాంస్య పతకాలు సాధించిన తర్వాత.. 40 ఏళ్లకు మళ్లీ వరుసగా ఆసియా గేమ్స్‌ల్లో భారత్ పతకాలు సాధించింది.
లక్ష్యసేన్ ఓడినా..
ప్రపంచ 14వ ర్యాంకర్ లక్ష్యసేన్ తొలి సింగిల్స్‌లో చైనా ఆరో ర్యాంకర్ షి యూకీ చేతిలో ఓటమిపాలయ్యాడు. వరుస గేముల్లో 16-21, 18-21తో పరాజయం చెందాడు. దాంతో చైనా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్‌లో ఓడినా.. సాత్విక్-చిరాగ్ జోడీ భారత్‌ను ఆదుకుంది.

పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేతలు, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లు లియాంగ్ వెయ్ కెంగ్-వాంగ్ చాంగ్‌తో తలపడిన భారత జోడీ అద్భుతంగా ఆడింది. 21-11, 22-20తో చైనా డబుల్స్ జోడీని ఓడించి భారత్‌ను 1-1తో సమం చేసింది. దాంతో ఫైనల్ ఆశలు చిగురించాయి. కానీ మూడో మ్యాచ్‌లో 20 ఏళ్ల ఆయుశ్ శెట్టి ఓటమిపాలై తీవ్రంగా నిరాశపర్చాడు. ప్రపంచ 12వ ర్యాంకర్ లీ షి ఫెంగ్ చేతిలో 19-21, 13-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. దాంతో చైనా 2-1 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
రెండో డబుల్స్‌లోనూ చైనాదే పైచేయి
చివరి డబుల్స్ మ్యాచ్‌లోనూ భారత్ ఓడిపోవడంతో ఫైనల్ ఆశలు నీరుగారాయి. ప్రపంచ 25వ ర్యాంకులో ఉన్న ఈ జోడీ.. హీ జీ టింగ్-లియు యీ జోడీ చేతిలో హరిహరన్ అంసకరుణన్-ఎంఆర్ అర్జున్ జోడీ ఓటమిపాలైంది. దాంతో చైనా 3-1తో విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


