న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Open 2020: ప్రీ క్వార్టర్స్‌లో సెరెనా.. క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న జంట!

US Open 2020: Serena Williams passes the Stephens test

న్యూయార్క్‌: అరుదైన రికార్డుపై కన్నేసిన మాజీ నెంబర్‌వన్‌ సెరెనా విలియమ్స్‌ యూఎస్‌ ఓపెన్‌లో అంచనాలకు తగ్గట్టు రాణిస్తోంది. ఆల్‌టైమ్‌ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారిణిగా మార్గరెట్‌ కోర్ట్‌ (24 టైటిల్స్‌) పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు... గతంలో వచ్చిన నాలుగు అవకాశాలను వృథా చేసుకున్న ఈ అమెరికా టెన్నిస్‌ స్టార్‌.. ఈసారి మాత్రం ఎలాగైనా తన లక్ష్యాన్ని అందుకునే దిశగా పట్టుదలతో ముందుకు సాగుతోంది.

తనకెంతో కలిసొచ్చిన యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన సెరెనా 20వ సారి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌ మ్యాచ్‌లో మూడో సీడ్‌ సెరెనా 2-6, 6-2, 6-2తో 26వ సీడ్, 2017 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా)పై కష్టపడి విజయం సాధించింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 15వ సీడ్‌ మరియా సాకరి (గ్రీస్‌)తో సెరెనా తలపడుతుంది.

ఇతర మ్యాచ్‌ల్లో..

ఇతర మ్యాచ్‌ల్లో..

అజరెంకా 6-4, 6-2తో ఇగా షియాటెక్‌ (పోలాండ్‌)పై, పిరన్‌కోవా 6-4, 6-1తో 18వ సీడ్‌ డోనా వెకిచ్‌ (క్రొయేషియా)పై, అలీజి కార్నె 7-6 (7/4), 6-2తో ఏడో సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా)పై, సోఫియా కెనిన్‌ 7-6 (7/4), 6-3తో ఆన్స్‌ జెబుర్‌ (ట్యూనిషియా)పై, మెర్‌టెన్స్‌ 7-5, 6-1తో కేథరిన్‌ మెక్‌నాలీ (అమెరికా)పై, ముకోవా 6-4, 2-6, 7-6 (9/7)తో సొరానా క్రిస్టియా (రొమేనియా)పై గెలిచారు.

సీడెడ్ ఆటగాళ్ల ఇంటిముఖం

సీడెడ్ ఆటగాళ్ల ఇంటిముఖం

పురుషుల సింగిల్స్‌లో సీడెడ్‌ ప్లేయర్ల నిష్క్రమణ కొనసాగుతోంది. 8వ సీడ్‌ బాటిస్టా అగుట్‌ (స్పెయిన్‌), 11వ సీడ్‌ ఖచనోవ్‌ (రష్యా) మూడో రౌండ్‌లోనే వెనుదిరిగారు. 94వ ర్యాంకర్‌ వాసెక్‌ పోస్పిసిల్‌ (కెనడా) 7-5, 2-6, 4-6, 6-3, 6-2తో బాటిస్టా అగుట్‌ను... 28వ ర్యాంకర్‌ అలెక్స్‌ డి మినార్‌ (ఆస్ట్రేలియా) 6-4, 0-6, 4-6, 6-3, 6-1తో ఖచనోవ్‌ను ఓడించారు.

క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న జంట...

క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న జంట...

పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత్ టెన్నిస్ ప్లేయర్ రోహన్‌ బోపన్న -డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా) జంట క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్‌ మ్యాచ్‌లో బోపన్న-షపోవలోవ్‌ ద్వయం 4-6, 6-4, 6-3తో ఆరో సీడ్‌ కెవిన్‌ క్రావిట్జ్‌-ఆండ్రీస్‌ మీస్‌ (జర్మనీ) జోడీని ఓడించింది. మహిళల డబుల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్‌ మ్లాడెనోవిచ్‌ (ఫ్రాన్స్‌)-తిమియా బాబోస్‌ (హంగేరి) జంట టోర్నీ మధ్యలో వైదొలిగింది. టోర్నీ ప్రారంభానికి ముందు కరోనా సోకిన పెయిర్‌ (ఫ్రాన్స్‌) ప్రైమరీ కాంటాక్ట్‌ జాబితాలో మ్లాడెనోవిచ్‌ ఉండటమే దీనికి కారణం. పెయిర్‌తో కాంటాక్ట్‌ ఉన్న వాళ్లందరికీ న్యూయార్క్‌ సిటీ ఆరోగ్య విభాగం ఐసోలేషన్‌లోకి వెళ్లాలని నోటీసులు జారీ చేసింది.

క్వార్టర్‌ ఫైనల్లో జెనిఫర్‌ బ్రేడీ

క్వార్టర్‌ ఫైనల్లో జెనిఫర్‌ బ్రేడీ

మహిళల సింగిల్స్‌లో అమెరికాకు చెందిన 28వ సీడ్‌ క్రీడాకారిణి జెనిఫర్‌ బ్రేడీ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బ్రేడీ 6-1, 6-4తో 2016 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ)పై సంచలన విజయం సాధించింది. తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో బ్రేడీ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది.

ధోనీ తర్వాత సీఎస్‌కే కెప్టెన్ అతనే: డ్వేన్ బ్రావో

Story first published: Monday, September 7, 2020, 7:29 [IST]
Other articles published on Sep 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X