ధోనీ తర్వాత సీఎస్‌కే కెప్టెన్ అతనే: డ్వేన్ బ్రావో

న్యూఢిల్లీ: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెబితే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టును ఎవరు నడిపిస్తారనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ అంశంపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. అయితే మహీ ఎప్పుడు ఐపీఎల్‌ను వీడుతాడనేదానిపై స్పష్టత లేనప్పటికీ.. సీఎస్‌కే తదుపరి కెప్టెన్ ఎవరనేదానిపై అతను తీవ్రంగా ఆలోచిస్తున్నాడని ఆ జట్టు ఆల్‌రౌండర్, వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో అన్నాడు.

రైనా లేకుంటే..
తాజాగా ఏబీపీ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘తన తర్వాత సీఎస్‌కే కెప్టెన్ ఎవరు ఉండాలనే విషయంపై కొద్ది రోజుల నుంచి ధోనీ ఆలోచిస్తున్నాడని తెలుసు. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రోజు ఆట నుంచి తప్పుకోవాలి. అయితే, ఎప్పుడు తప్పుకోవాలనేదే ముఖ్యమైన విషయం. తన తర్వాత కెప్టెన్సీ పగ్గాలను రైనాకు లేదా మరో యువ ఆటగాడికిచ్చే అవకాశం ఉంది' అని బ్రావో పేర్కొన్నాడు.

ధోనీలో మార్పు ఉండదు..
ఇక ఆగస్టు 15న ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయ ప్రభావం ఐపీఎల్‌లో అతడి కెప్టెన్సీపై పడదని బ్రావో చెప్పుకొచ్చాడు. ‘ఇతరుల గురించి ధోనీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం సీఎస్‌కే గురించి ఆలోచిస్తే సరిపోతుంది. నాకు తెలిసి మహీ వ్యవహార శైలిలో ఎటువంటి మార్పులు ఉండవు. అతని సారథ్యం కూడా మారదు. ఖచ్చితంగా అతను మునపటిలానే ఉంటాడు'అని ప్రస్తుతం కరీబియన్ లీగ్‌లో అదరగొడుతున్న బ్రావో తెలిపాడు. అయితే ప్రేక్షకుల్లేకుండా ఐపీఎల్ ఆడటం బాధగా ఉన్నప్పటికీ.. కనీసం ఈ అవకాశం దక్కినందుకైనా సంతోషించాలన్నాడు.

చెన్నైకి కష్టాలు తప్పవు..
ఇక ధోనీ లేకుంటే చెన్నై పరిస్థితి ఏందనే విషయాన్ని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా విశ్లేషించాడు. ధోనీ తప్పుకుంటే సీఎస్కేకు కష్టాలు తప్పవన్నాడు. ఎందుకంటే అన్నితానై నడిపించిన ధోనీ లాంటి ఆటగాడు మరొకడు దొరకండం కష్టమన్నాడు. ‘ధోనీ లేకుంటే చెన్నై సూపర్ కింగ్స్ సగం శక్తిని కోల్పోయినట్టే. ఆ జట్టు తరఫున ధోనీ ఎలాంటి సేవలందించకుంటే ఇంకా తీవ్రంగా నష్టపోతుంది. ఎందుకంటే జట్టును ధోనీ అలా నడిపించాడు. అలా మరెవరూ చేయలేరు.

ధోనీ వీడడు..
నా అంచనా ప్రకారం చెన్నై జట్టుకు సారథ్యం వహించే ఏ ఆటగాడికైనా ధోనీ ఆశీర్వాదం ఉండాలి. ఆ కెప్టెన్‌కు అతని రక్షణ అవసరం కూడా. ఎందుకంటే ధోనీ, చెన్నైల బంధం స్వర్గంలో నిర్ణయించబడింది. వారిది తరతరాలుగా చెరగని బంధం. అతను తప్పుకున్నా.. ఏదో రూపంలో జట్టుతోనే ఉంటాడు. అంబాసిడర్‌గానో.. మెంటార్‌గానో.. సీఎస్‌కే డగౌట్స్‌లో కచ్చితంగా కూర్చుంటాడని నా అభిప్రాయం. సీఎస్కేకు కూడా అతని అవసరం ఉంది.'అని చోప్రా చెప్పుకొచ్చాడు.
ఇక చెన్నై జట్టు ఇటీవలే క్వారంటైన్‌ను పూర్తి చేసుకొని ప్రాక్టీస్ షురూ చేసిన సంగతి తెలిసిందే. ఆ జట్టులో కరోనా బారిన ఆటగాళ్లు మినహా మిగతా అందరూ మైదానంలో తీవ్రంగా కష్టపడుతున్నారు. ధోనీ సైతం ప్రాక్టీస్ సెషన్‌లో సిక్సులతో అలరిస్తున్నాడు. దీంతో రాబోయే సీజన్‌లో అతడి నుంచి మంచి వినోదం ఆశించే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications