న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పుడు ఫోన్‌లో అన్నీ డిలీట్ చేశా: మారియా షరపోవా

Maria Sharpova Says I deleted all social media to stop myself going crazy

న్యూఢిల్లీ: తనపై నిషేధం విధించినప్పుడు ఫోన్‌లో ఉన్న అన్నీ సోషల్ మీడియా యాప్స్‌ను తొలగించానని టెన్నిస్ బ్యూటీ, రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా తెలిపింది. 16 ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించిన ఈ రష్యన్‌ బ్యూటీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆటకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఐదు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గినా... వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ సాధించినా... తన అందంతోనే ఎక్కువగా ఆకర్షించిన ఈ బుట్టబొమ్మ.. పునరాగమనంలో అరకొర మ్యాచ్‌లు ఆడినా గాయాల కారణంగా రాణించలేకపోయింది.

ఎంతో వేదనకు గురయ్యా..

ఎంతో వేదనకు గురయ్యా..

2016 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సందర్భంగా డోపింగ్ పాల్పడిందనే కారణంతో షరపోవాపై నిషేధం విధించారు. మెల్డోనియం అనే ఉత్త్రేరకాన్ని వాడినట్టు తేలడంతో ఆమెను తొలుత రెండేళ్లు బహిష్కరించారు. కానీ షరపోవా ఉద్దేశపూర్వకంగా ఆ డ్రగ్‌ తీసుకోలేదని తేలడంతో నిషేధాన్ని 15 నెలలకు పరిమితం చేశారు. ఈ నిషేద ఉదంతంపై మారియా ‘ద పాయింట్‌'అనే డాక్యుమెంటరీలో మాట్లాడింది. ‘ఆరోజు (మార్చి 7, 2016) మ్యాచ్‌కోసం సిద్ధంకావాలనుకుంటూ ఉదయం నిద్రలేచా. కానీ నాపై నిషేధం విధించారని తెలిసి తీవ్ర ఆందోళనకు, అసహనానికి లోనయ్యా. మరెంతో వేదన చెందా. ఆ వార్త నన్నెంతో కలిచివేసింది' అని 33 ఏళ్ల మరియా తెలిపింది.

 నా తల్లి ఓదార్చింది..

నా తల్లి ఓదార్చింది..

‘ఆటపట్ల నా చిత్తశుద్ధి ఎలాంటిదో నాకు తెలుసు. నన్ను నేను రక్షించుకొనేందుకు, నాపై ఎవరెవరో వ్యక్తం చేసే అభిప్రాయాలు, ఇచ్చే తీర్పులకు దూరంగా ఉండేందుకు ఆనాడు విలేకరుల సమావేశం అనంతరం నా మొబైల్‌లో సామాజిక మాధ్యమాల నెట్‌వర్క్‌లన్నింటినీ తీసేశా' అని వెల్లడించింది. నిషేధకాలంలో తల్లిదండ్రులు తనకు ఎంతో అండగా నిలిచారని తెలిపింది. ముఖ్యంగా.. టెన్నిస్‌ ఆడకపోతే జీవితమే లేదనుకోవడం సరికాదంటూ తల్లి తనను ఓదార్చిందని షరపోవా పేర్కొంది.

ప్రైజ్‌మనీ రూ. 277 కోట్ల 76 లక్షలు

ప్రైజ్‌మనీ రూ. 277 కోట్ల 76 లక్షలు

తన 16 ఏళ్ల సుదీర్ఘకెరీర్‌లో 645 మ్యాచ్‌లు గెలిచిన షరపోవా..171 మ్యాచ్‌లో ఓడింది. ఓవరాల్ కెరీర్‌లో 3,87,77,962 డాలర్లు (రూ. 277 కోట్ల 76 లక్షలు) ప్రైజ్‌మనీ రూపంలో అందుకుంది. 2004-వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌-2006, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌-2008, ఫ్రెంచ్‌ ఓపెన్‌-2012, 2014లతో మొత్తం ఐదు గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ గెలుచుకుంది. ఓవరాల్‌గా 36 సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గింది. 2005 (ఆగస్టు 22)లో వరల్డ్‌నెంబర్ వన్ ర్యాంక్ అందుకుంది. 21 వారాల పాటు అగ్రస్థానంలోనే కొనసాగింది.

సచిన్ టెండూల్కర్‌ను మోసం చేసిన హైదరాబాద్ రియల్టర్!

Story first published: Sunday, July 26, 2020, 10:36 [IST]
Other articles published on Jul 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X