Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ టెండూల్కర్‌ను మోసం చేసిన హైదరాబాద్ రియల్టర్!

Hyderabad realtor cheats Sachin Tendulkar and his wife Anjali, sells lake land

హైదరాబాద్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అతని సతీమణి అంజలిని ఓ హైదరాబాద్ రియల్టర్ మోసం చేసాడనే వార్తలు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సదరు రియల్టర్ సచిన్‌తో పాటు సినీతారలు రమ్యకృష్ణ, నయనతారాలను కూడా చీట్ చేశాడని, వీరికి హైదరాబాద్ శివార్లలోని రావిర్యాల చెరువులోని భూములను కట్టబెట్టాడని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

హైదరాబాద్‌కు చెందిన ఆదిత్యా హోమ్స్‌ ఛైర్మన్ కోటారెడ్డినే భారత రత్న సచిన్ టెండూల్కర్‌ను మోసం చేశాడని, ఆ కంపెనీ డైరెక్టర్, ఆయన బావమరిది సుధీర్ రెడ్డి ఆరోపించారు. అత్యున్నత వ్యక్తి, భారత దిగ్గజమైన సచిన్‌ను మోసం చేయడం దేశాన్ని ఇన్‌సల్ట్ చేయడేమనన్న సుధీర్ రెడ్డి.. ఈ విషయంపై ప్రధానమంత్రికి లేఖ రాస్తానని ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ అన్నారు.

'భారీ ధరకు రావిర్యాల చెరువు భూములను సచిన్ టెండూల్కర్‌కు కట్టబెట్టారు. మా బావ కోటా రెడ్డి మోసం గురించి సచిన్‌కు తెలియదు. ఆరు ఎకరాల భూమిని టెండూల్కర్‌తో పాటు సినీతారలు నయనతార, రమ్యకృష్ణలకు అమ్మాడు. అయితే ఆ భూమి ఎలాంటి నిర్మాణాలకు పనికిరాదు. అది చెరువు ప్రాపర్టని ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఆ భూమి రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుస్తానని మా బావ కోటారెడ్డి సచిన్‌ను నమ్మించాడు. ఇది నమ్మిన సచిన్ మా బావ ఇంటికి లంచ్‌కు కూడా వచ్చాడు.'అని సుధీర్ రెడ్డి తెలిపాడు.

హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఈ రావిర్యాల చెరువు ఉంది. ఆ చుట్టు పక్కల నాలుగు గ్రామాల్లో 3 వేల ఎకరాల సాగుకు ఈ చెరువే ఆధారం. కానీ రియల్ ఎస్టెట్ పుణ్యమా ఈ చెరువు కబ్జా కొరల్లో చిక్కుకుపోయింది.

ఇక ఈ రియల్టర్ల ఇంటి సమస్య తీవ్ర విభేదాలతో రచ్చకెక్కింది. గత రెండు రోజులుగా ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. 100 కోట్ల రూపాయలు విలువచేసే డాక్యుమెంట్ల చోరీతో మొదలైన వివాదం మరింత ముదిరింది. కొడుకుతో తనకు ప్రాణహాని ఉందని సుధీర్‌రెడ్డి తల్లి అజంతా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గొడవ వీధికెక్కింది.

ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన సుధీర్ రెడ్డి తన బావ కోటారెడ్డి తనను జైలుకు పంపేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వ్యాపారం పేరుతో తన కుటుంబాన్ని నిలువునా మోసం చేశారని, కంపెనీ లాభాలు తీసుకుని తమను దోచుకున్నారని వాపోయారు.

Story first published: Friday, July 24, 2020, 13:32 [IST]
Other articles published on Jul 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+