Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌లో ఓ వంచకుడి వలలో చిక్కి.. నరకం అనుభవించా: ఆస్ట్రేలియా క్రీడాకారిణి

Former Australian surfer Carmen Greentree abducted and raped in India at age 22


న్యూఢిల్లీ: భారత్‌లో ఓ వంచకుడి వలలో చిక్కి.. రెండు నెలలపాటు నరకం అనుభవించానని ఆస్ట్రేలియా మాజీ సర్ఫింగ్ క్రీడాకారిణి కార్మెన్‌ గ్రీన్‌ట్రీ తెలిపింది. తనను కిడ్నాప్‌ చేసిన ఆ వ్యక్తి.. కశ్మీర్‌లో అనేకసార్లు తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. వెళ్లిపోతానని అంటే.. దారుణంగా హింసించేవాడని పేర్కొంది. కానీ, నేరస్థుడి అత్యాశ వల్లే ఆ నరకం నుంచి విముక్తి లభించినట్టు వివరించింది. భారత్‌లో తాను అనుభవించిన భయానక రోజులను 'ఎ డేంజర్‌ పర్స్యూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌' పుస్తకంలో రాసుకొచ్చింది.
దలైలామా ఆశ్రమానికని..

దలైలామా ఆశ్రమానికని..

2004లో తన 22 ఏళ్ల వయసులో దలైలామా ఆశ్రమానికి వెళ్లే ప్రయత్నంలో ఈ ఘోరం జరిగిందని తెలిపింది. అయితే, భద్రతా పరమైన సూచనలను పెడచెవిన పెట్టడంతోనే తనకీ దారుణ పరిస్థితులు ఎదురయ్యాయని పుస్తకంలో రాసింది. నయవంచనకు గురైన ఈ ఘటనను గుర్తుకు వస్తేనే ఇప్పటికీ భయంతో వణికిపోతానని తెలిపింది.

మాయ మాటలను నమ్మి..

మాయ మాటలను నమ్మి..

‘ఢిల్లీ విమానాశ్రయంలో దిగినప్పుడు కొందరు వ్యక్తులు వచ్చి కశ్మీర్‌ నుంచి ధర్మశాల వెళ్లడం సులువని చెప్పడంతో వారి మాయ మాటల్లో పడ్డా. రోడ్డు ప్రయాణం ద్వారా ధర్మశాలకు 14 గంటల్లో చేరుకోవచ్చని పుస్తకంలో ఉన్నా.. ఏమాత్రం ఆలోచించలేదు. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో దిగినప్పుడు రఫిక్‌ అహ్మద్‌ డుంగూ అనే వ్యక్తి నన్ను రిసీవ్‌ చేసుకున్నాడు. దాల్‌ సరస్సులోని హౌస్‌ బోట్‌లో ఓ రాత్రి ఉంటే.. తర్వాతి రోజు ధర్మశాలకు ప్రయాణ ఏర్పాటు చేస్తాడని అతడు చెప్పాడు'అని గ్రీన్‌ట్రీ తన బుక్‌లో రాసింది.

అదే శాపమైంది..

అదే శాపమైంది..

అతను చెప్పిన మాటలు నమ్మడమే తనపాలిట శాపమైందని పేర్కొంది. తన పాస్‌పోర్ట్‌, డాక్యుమెంట్‌లను కూడా రఫిక్‌ స్వాధీనం చేసుకున్నాడని తెలిపింది. అప్పటి నుంచి హౌస్‌ బోట్‌లో రెండు నెలలపాటు ప్రతీ రోజూ తనపై రఫిక్‌ అత్యాచారం చేసే వాడని కార్మెట్‌ వాపోయింది. అతడితో పోరాడలేక శరీరాన్ని అప్పగించేశానని తన దీనస్థితిని వివరించింది.

అత్యాశతో..

ఈ మధ్యలో రఫిక్‌ తన వద్దనున్న డబ్బు మొత్తాన్ని తీసుకోవడంతోపాటు అదనంగా మరింత సొమ్ము గుంజేందుకు తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేయించి దొరికిపోయాడని గ్రీన్‌ట్రీ తెలిపింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, సైన్యం వచ్చి తనను రక్షించారని చెప్పింది. ఇప్పుడు కార్మెల్‌కు 37 ఏళ్లు. ముగ్గురు పిల్లలు, భర్తలో సంతోషంగా గడుపుతోంది.

20 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ తరఫున హోల్డర్ అరుదైన ఘనత!

Story first published: Wednesday, July 15, 2020, 8:51 [IST]
Other articles published on Jul 15, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+