Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇక నుంచి ఇద్దరు... కొత్త సాంప్రదాయానికి తెరదీసిన ఐఓసీ

Countries can have both male & female flag bearers at opening ceremony In Tokyo Olympics 2020

లుసానే: టోక్యో ఒలింపిక్స్‌లో కొత్త సాంప్రదాయానికి అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) తెర తీస్తోంది. మెగా ఈవెంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పతాకధారులుగా (ఫ్లాగ్‌ బేరర్లు) ఇకపై ఒక దేశం నుంచి ఇద్దరిని అనుమతిస్తున్నట్లు ఐఓసీ ప్రకటించింది. 'ఒక పురుష అథ్లెట్, ఒక మహిళా అథ్లెట్‌ను ఆయా దేశాలు తమ ఫ్లాగ్‌ బేరర్లుగా నామినేట్‌ చేయవచ్చు. ఇందు కోసం నిబంధనలు మార్చాం. అన్ని దేశాలు దీని ప్రకారం ఫ్లాగ్‌ బేరర్లను ఎంపిక చేస్తే బాగుంటుంది' అని ఐఓసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

మహిళలకు అధిక ప్రాధాన్యత..

మహిళలకు అధిక ప్రాధాన్యత..

ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్స్‌తో పోలిస్తే 2020 ఒలింపిక్స్‌లో మహిళా సమానత్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నామని, ఇందులో పాల్గొనే అథ్లెట్లలో 48.8 శాతం మహిళలే ఉండటం దీనికి నిదర్శనమని కూడా ఐఓసీ పేర్కొంది. తొలిసారిగా ఒలింపిక్స్‌లో పాల్గొనే ప్రతీ దేశం నుంచి కనీసం ఒక పురుష, ఒక మహిళా అథ్లెట్‌ ఉండేలా చర్యలు తీసుకున్నామని కూడా స్పష్టం చేసింది. జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యోలో ఒలింపిక్స్‌ జరగనున్నాయి.

ఇంగ్లండ్ పాపం పండింది.. భారత్ ఫైనల్ చేరింది..!!

షెడ్యూల్ ప్రకారంమే..

షెడ్యూల్ ప్రకారంమే..

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ వాయిదా అని జరుగుతున్న ప్రచారాన్ని జపాన్‌ ఒలింపిక్‌ మంత్రి సీకో హషిమొటో ఖండించారు. ప్రణాళిక ప్రకారమే టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయన్నారు. పార్లమెంట్ బడ్జెట్ కమిటీ ముందు కూడా ఆయన ఇదే విషయాన్ని తెలిపారు. ‘టోక్యో ఒలింపిక్స్ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్‌ను రద్దు చేయడం లేదా వాయిదా వేయడం అథ్లెట్లకు ఆమోదయోగ్యం కాదు.'అని హషిమొటో పార్లమెంట్ బడ్జెట్ కమిటీ ముందు స్పష్టం చేశారు.

భారత్ ఫైనల్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా.. సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఓటమి

సాధా సీదాగా.. జ్యోతి ప్రజ్వలన..

సాధా సీదాగా.. జ్యోతి ప్రజ్వలన..

ప్రాచీన గ్రీస్ సాంప్రదాయ పద్దతిలో వచ్చే వారం జరిగే టోక్యో 2020 ఒలింపిక్స్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కూడా సాధాసిదాగా జరగనుంది. ఎప్పుడూ అత్యంత వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కరోనా వైరస్ నేపథ్యంలో ప్రేక్షక సమూహం లేకుండానే నిర్వహించనున్నారు. ఇక అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ కూడా షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్ జరుగుతాయని స్పష్టం చేసింది. కరోనా వైరస్ ముప్పు ఉన్నప్పటికీ.. అథ్లెట్లను సంసిధ్దం చేయాలని టోర్నీలో పాల్గొనే ఆయా దేశాలను కోరింది.

Story first published: Friday, March 6, 2020, 9:05 [IST]
Other articles published on Mar 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+