For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేనేం దేశాన్ని అమ్మలేదు.. వారి గురించి మాట్లాడే ధైర్యం ఉందా: కనేరియా

Danish Kaneria and Faisal Iqbal engage in war of words on Twitter

కరాచీ: కరోనా వైరస్‌ కారణంగా క్రికెటర్లంతా ఇళ్లల్లోనే ఉంటూ తమ కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతుంటే.. పాకిస్థాన్ క్రికెటర్లు మాత్రం సోషల్ మీడియా వేదికగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. గతాన్ని తవ్వకుంటూ ఒకరినికొరు విమర్శించుకుంటున్నారు. సంచలన విషయాలను బయటపెడుతూ.. వార్తల్లో నిలుస్తున్నారు.

సంచలన వ్యాఖ్యలతో ఒకరిపై ఒకరు..

సంచలన వ్యాఖ్యలతో ఒకరిపై ఒకరు..

ఇటీవలే పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ తన సహచర ఆటగాళ్లైన ఇమ్రాన్‌ ఖాన్‌, వసీం అక్రమ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జావేద్‌ మియాందాద్‌ను జట్టు నుంచి తొలగించడానికి ఇమ్రాన్‌, అక్రమ్‌లు కుట్ర చేశారంటూ ఈ పాక్ మాజీ క్రికెటర్ ధ్వజమెత్తాడు. అయితే తాజాగా మరో ఇద్దరు పాక్‌ మాజీ క్రికెటర్లు.. డానిష్‌ కనేరియా, ఫైజల్‌ ఇక్బాల్‌లు ట్విటర్ వేదికగా ఒకరినొకరు తిట్టుకున్నారు. అయితే వారి మాటల యుద్దానికి మాజీ క్రికెటర్ ఇంజమామ్ హుల్ హక్ కారణమయ్యాడు.

కనేరియా స్లెడ్జింగ్.. లారా విధ్వంసం..

2006లో ముల్తాన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో బ్రియాన్ లారా.. కనేరియా బౌలింగ్‌లో విరుచుకుపడ్డాడు. దానికి సంబంధించిన వీడియోపై ఇంజమామ్ ఓ యూట్యూబ్ చానె‌ల్‌తో మాట్లాడుతూ.. ఆ మ్యాచ్‌లో కనేరియాపై లారా పూర్తి ఆధిపత్యం చెలాయించాడని చెప్పుకొచ్చాడు. అయితే కనేరియా వేసిన ఓ గూగ్లీని లారా వెనక్కు ఆడాడని, దీనికి అనవసరంగా స్పందిస్తూ కనేరియా.. బాగా ఆడావ్ లారా అంటూ రెచ్చగొట్టాడని తెలిపాడు. దీనికి విండీస్ వీరుడు కూడా ఒకే సర్.. అంటూ మరుసటి మూడు బంతుల్లో వరుస సిక్స్‌లు కొట్టాడని ఇంజమామ్ గుర్తు చేసుకున్నాడు.

ఇంజమామ్ చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించిన కనేరియా.. తాను ఐదుసార్లు లారాను అవుట్‌ చేశానని, పీసీబీ మద్దతుగా నిలిస్తే మరెన్నో రికార్డులు కొల్లగొట్టేవాడినని తెలిపాడు.

కనేరియా అభాసుపాలయ్యాడు..

ఇక ఈ వీడియోను ఓ యూట్యూబర్ ట్వీట్ చేయగా.. ఫైసల్‌ ఇక్బాల్‌ స్పందించాడు. లారాని స్లెడ్జింగ్‌ చేయబోయి కనేరియా అభాసుపాలయ్యాడని కామెంట్ చేశాడు. ‘12వ ఆటగాడిగా ఉన్న ఈ మ్యాచ్ నాకిప్పటికీ గుర్తుంది. లారా బంతులను స్టాండ్స్‌కు పంపిస్తూంటే కనేరియా ప్రేక్షకుడిలా మిగిలిపోయాడు. అతన్ని స్లెడ్జ్ చేయబోయి మూల్యం చెల్లించుకున్నాడు'అని ఫైసల్ నాటి మ్యాచ్ క్షణాలను గుర్తు చేసుకున్నాడు.

నీవు కూడా మాట్లాడుతావా?

ఈ కామెంట్ చూసి చిర్రెత్తుకుపోయిన కనేరియా.. ‘ఫైసల్‌లాంటి క్రికెటర్‌ నాపై వ్యాఖ్యలు చేయడమా.? ముందు నీ గణంకాలు చూసుకో. అలాగే నేను గెలిపించిన మ్యాచ్‌ వివరాలను కూడా తెలియజేయ్. లారా ఓ దిగ్గజ క్రికెటర్. అతని పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది'అని ఘాటుగా బదులిచ్చాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇక్బాల్.. కనేరియా ఫిక్సింగ్ అంశాన్ని ప్రస్తావిస్తూ కౌంటరిచ్చాడు.

‘అబద్దపు లెక్కలు, ఫిక్సర్ల కన్నా నేనెంతో మేలు. అత్యాశ కోసం ఆత్మనే అమ్ముకునే రకమైతే కాదు. పైగా మతాన్ని అడ్డుపెట్టుకొని సానుభూతి పొందాలని అస్సలు ప్రయత్నించలేదు. నీజాయితీగా నెలకొల్పిన నా గణంకాల పట్ల గర్వంగా ఫీలవుతున్నా'అని ఫైసల్ ట్వీట్ చేశాడు.

తబ్లిగీ జమాత్‌పై వివాదాస్పద ట్వీట్.. ట్రెండింగ్‌లో స్టార్ రెజ్లర్ బబితా ఫోగాట్!!

పాకిస్తానీ అనీ గర్వపడుతున్నా

పాకిస్తానీ అనీ గర్వపడుతున్నా

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కనేరియా తానేం దేశాన్ని అమ్మలేదని ఘాటుగా బదులిచ్చాడు. ‘డబ్బుల కోసం నేను ఏనాడు దేశాన్ని అమ్మలేదు. పాకిస్తానీ అనీ గర్వపడుతున్నా. దేశాన్ని అమ్మిన ఆటగాళ్లను కూడా జట్టులోకి సాదరంగా ఆహ్వానించారు. వారి గురించి మాట్లాడే ధైర్యం ఉందా? ఇక నువ్వు ఎలా ఆడావో అందరికి తెలుసు'అని కనేరియా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కౌంటీ క్రికెట్ ఆడుతున్న సమయంలో కనేరియా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన విషయం తెలిసిందే. 2009లో డర్హామ్‌పై ఎసెక్స్ తరఫున ఆడుతున్నప్పుడు సహచర ప్లేయర్ మెర్విన్ వెస్ట్‌ఫీల్డ్‌తో కలిసి కన నేరియా స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. వెస్ట్‌ఫీల్డ్‌ తనను ఓ వన్డే గేమ్‌లో 12 పరుగులు ఇవ్వాలని ఒప్పించాడని కనేరియా అంగీకరించాడు. దీంతో ఈ ఇద్దరిపై జీవిత కాల నిషేధం విధించారు.

Story first published: Friday, April 17, 2020, 17:40 [IST]
Other articles published on Apr 17, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+