ట్రక్ డ్రైవర్ కూతురి సంచలనం: పీటీ ఉష 42 ఏళ్ల రికార్డు బ్రేక్!
Asian Games 2026: ఆసియా క్రీడలు 2026లో మహిళల 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి విద్యా రామ్‌రాజ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఆమె ఈ రేసును 54.75 సెకన్లలో పూర్తి చేసి దేశానికి పతకాన్ని అందించారు. 28 ఏళ్ల విద్యా యూఏఈకి చెందిన మరియం కరీం, కజకిస్తాన్‌కు చెందిన అడెలినా జేమ్స్‌ల తర్వాత మూడో స్థానంలో నిలిచారు. మరియం 54.31 సెకన్ల గేమ్స్ రికార్డు సమయంతో స్వర్ణం గెలుచుకోగా, అడెలినా 54.58 సెకన్ల సమయంతో రజతం గెలుచుకున్నారు.
1984లో నెలకొల్పిన జాతీయ రికార్డును బద్దలు కొట్టిన విద్య
విద్యా రామరాజ్ 400 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డును కూడా బద్దలు కొట్టారు. ఈ రికార్డు గతంలో 42 ఏళ్ల క్రితం పీటీ ఉష పేరిట ఉండేది. 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో ఉష 55.42 సెకన్లలో సాధించిన సమయమే జాతీయ రికార్డుగా ఉండేది. పీటీ ఉష ప్రస్తుతం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆసియా క్రీడల కోసం జపాన్‌లో ఉన్నారు.

ఈ ఆసియా క్రీడల టోర్నీలో విద్యా రామ్‌రాజ్‌కు ఇది రెండో పతకం కావడం గమనార్హం. అంతకు ముందు జరిగిన 4x400 మీటర్ల మిక్స్‌డ్ రిలే ఈవెంట్లో రజత పతకం సాధించిన భారత జట్టులో ఆమె కీలక పాత్ర పోషించారు. గతాన్ని పరిశీలిస్తే 2022 ఆసియా క్రీడల్లో కూడా ఆమె 400 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్యం, మహిళల, మిక్స్‌డ్ 4x400 మీటర్ల రిలే ఈవెంట్లలో రజత పతకాలు సాధించి మొత్తంగా ఐదు ఆసియా గేమ్స్ పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు.
తమిళనాడులోని కోయంబత్తురుకు చెందిన విద్యా రామ్‌రాజ్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. ఓ సాధారణ ట్రక్ డ్రైవర్ కూతురు అయిన విద్యా రామ్‌రాజ్.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను దాటుకుని ఈ స్థాయికి ఎదిగారు. ఆమె కవల సోదరి నిత్య కూడా క్రీడాకారిణి కాగా.. ప్రస్తుతం విద్యా రామ్‌రాజ్ ఇండియన్ రైల్వేస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. 2017 వరకు 100 మీటర్లు, 200 మీటర్ల షార్ట్ స్ప్రింట్ ఈవెంట్లలో పాల్గొన్న విద్యా రామ్‌రాజ్.. ఆ తర్వాత 400 మీటర్ల హర్డిల్స్‌కు మారి భారత్‌కు మరొక పీటీ ఉషలా నిలిచారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


