యూరప్ కంటే భారతే బెటర్: తిరువనంతపురంలో మలేషియా అథ్లెట్ల కఠోర శిక్షణ!
Asian Games 2026: జపాన్‌లోని ఐచి-నగోయాలోని సెప్టెంబర్ 19 నుంచి ఘనంగా ప్రారంభం కానున్న 2026 ఆసియా క్రీడల సన్నాహకాల్లో భాగంగా మలేషియాకు చెందిన అథ్లెట్లు భారత్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. కేరళలోని తిరువనంతపురంలో ఉ్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) LNCPE కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక శిక్షణా శిబిరం సెప్టెంబర్ 10న విజయవంతంగా ముగిసింది. మలేషియాకు చెందిన 800 మీటర్ల రన్నర్ వాన్ ముహమ్మద్ ఫస్రీ, అలాగే 400 మీటర్లు,800 మీటర్ల విభాగాల్లో పోటీపడే ఉమర్ ఉస్మాన్‌లు తమ ప్రధాన కోచ్ మహమ్మద్ అజారుద్దీన్ పర్యవేక్షణలో కఠోరంగా శ్రమించారు.
యూరప్ కంటే భారత్ బెటర్
మలేషియా అథ్లెటిక్స్ జట్టు ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తున్న మహమ్మద్ అజారుద్దీన్ ఒకప్పటి భారతీయ అథ్లెట్ కావడం విశేషం. 2020 నుంచి 2025 వరకు భారత జాతీయ జట్టులో ఉన్న ఆయన, బెంగళూరులోని సాయి(SAI) కేంద్రాన్ని వీడి మలేషియా జట్టు బాధ్యతలు చేపట్టారు. యూరోపియన్ దేశాల్లో కాకుండా భారత్‌లోనే శిక్షణ పొందేందుకు మొగ్గు చూపడంపై ఆయన స్పందిస్తూ.. "మా ప్రధాన టార్గెట్ ఆసియా క్రీడలే. యూరోపియన్ పోటీల కంటే ఆసియాలో గట్టి పోటీనిచ్చే భారత్‌లో శిక్షణ పొందడమే మా రన్నర్లకు సరైన వ్యూహం" అని కోచ్ అజారుద్దీన్ పేర్కొన్నారు.

భారత అథ్లెట్లతో కఠిన పోటీ
మలేషియా క్రీడాకారులను భారత్‌కు తీసుకురావడం వెనుక ముఖ్యంగా రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని అజారుద్దీన్ వెల్లడించారు. మొదటిది భారత్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఉన్నత ప్రమాణాలు కలిగిన సౌకర్యాలను మలేషియా అథ్లెట్లు ప్రత్యక్షంగా అనుభవించడం. రెండోది మైదానంలో పతకాలు సాధించే భారతీయ అథ్లెట్లతో కలిసి పరుగెత్తడం వల్ల మలేషియన్ అథ్లెట్లకు తమ రేసు వ్యూహాలు, మానసిక దృక్పథం మెరుగుపడతాయి. ఆగస్టు 22న భువనేశ్వర్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ పర్యటనలో కూడా ఈ మలేషియన్ రన్నర్లు పాల్గొని ఇక్కడి కఠిన పోటీ వాతావరణాన్ని అనుభూతి చెందారు.
లక్కీ సెంటర్‌గా తిరువనంతపురం సాయి(SAI) కేంద్రం
తిరువనంతపురం సాయి కేంద్రాన్ని మహమ్మద్ అజారుద్దీన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. భారత్ తరఫున ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిన ఎందరో దిగ్గజ క్రీడాకారులు ఈ కేంద్రంలోనే రూపుదిద్దుకున్నారని.. అందువల్ల ఇది ఓ 'లక్కీ శిక్షణా కేంద్రం' అని అభివర్ణించారు. గత ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన అనేక పతకాల్లో కేవలం బెంగళూరు సాయి కేంద్రంలో శిక్షణ పొందిన అథ్లెట్లే 16 పతకాలు గెలుచుకోవడం ఇక్కడి శిక్షణ స్థాయికి నిదర్శనమని గుర్తు చేశారు.
గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా మారుతున్న భారత్
రెండు దేశాల అథ్లెటిక్స్ సమాఖ్యల మధ్య ఉన్న క్రీడా సంస్కృతి, అవగాహన అద్భుతమైనవని, ఇలాంటి స్పోర్ట్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ రెండు దేశాల్లోనూ క్రీడా ప్రమాణాలను మరింత ఎత్తుకు తీసుకెళ్తాయని మహమ్మద్ అజారుద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేవలం మలేషియా అథ్లెట్లే కాకుండా నేపాల్ బాక్సర్లు, ఇరాన్ కబడ్డీ ప్లేయర్లు కూడా గౌహతిలోని సాయి(SAI) కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. ఆసియా క్రీడలు 2026కు సిద్ధమవుతున్న అంతర్జాతీయ అథ్లెట్లకు ఇండియాలోని సాయి కేంద్రాలు గ్లోబల్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్లుగా ఎదుగుతున్నాయని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


