Alessandra Perilli: మెడల్ కొట్టింది.. 30వేల జనాభా గల తమ చిన్ని దేశానికే గుర్తింపు తెచ్చింది!

టోక్యో: 'సాన్ మరినో' అనే పేరు వినుండరు. కానీ అదో ఐరోపాకు చెందిన దేశం. ఇటలీ మధ్యలో 35వేల జనాభాతో ఉండే చిన్ని దేశం. అంటే మన దగ్గర ఓ డివిజన్ జనాభా కంటే తక్కువే. అలాంటి దేశం నుంచి ఒలింపిక్స్‌కు వెళ్లిన అలెస్సాండ్రా పెరిల్లీ అనే మహిళా అథ్లెట్ షూటింగ్ విభాగంలో బ్రాంజ్ మెడల్ గెలిచింది. దాంతో సాన్ మరినో దేశం ఒలింపిక్స్ పుటలకెక్కింది. జనాభా పరంగా పతకం గెలిచిన అతి చిన్న దేశంగా ఘనత వహించింది. ఎన్నో ఏళ్ల నుంచి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నా... సాన్ మరినోని ప్రపంచానికి గొప్పగా పరిచయం చేసింది మాత్రం 33 ఏళ్ల అలెస్సాండ్రా పెరిల్లీ! ఎక్కడ విశ్వక్రీడలు జరిగినా... కొద్దో గొప్పో వింతలు, విశేషాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఈ సారి మాత్రం ప్రపంచానికి 'సాన్ మరినో'దేశం గురించి తెలిసింది.

కాంస్యమే బంగారం..
ఈ మహిళా షూటర్ సాధించిన కాంస్యమే ఆ దేశానికి ఇప్పుడు బంగారంతో సమానం. మహిళల ట్రాప్ ఈవెంట్‌లో పెరిల్లీ మూడో స్థానంలో నిలిచింది. ఈ వెటరన్ షూటర్ ఒలింపిక్స్‌లో ఆడటం ఇదేం తొలిసారి కాదు. లండన్-2012 ఒలింపిక్స్ నుంచే పతకంపై గురి పెడుతూ వచ్చింది. అక్కడ త్రుటిలో పతకాన్ని కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాత రియో ఒలింపిక్స్ (2016)లోనూ పాల్గొన్నప్పటికీ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగింది. అంత మాత్రాన తన పనైపోయిందని, మూడు పదుల వయసు దాటిందని నిరాశ చెందలేదు. కఠోరంగా ప్రాక్టీస్ చేసి టోక్యోలో కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో పెరిల్లీ 29 పాయింట్లు స్కోరు చేసింది. ఈ ఈవెంట్‌లో స్లొవేకియా అమ్మాయి స్టెఫెస్‌కొవా (43 పాయింట్లు) గోల్డ్ గెలిస్తే... కైల్ బ్రౌనింగ్ (అమెరికా-42 పాయింట్లు) సిల్వర్ నెగ్గింది.
IPL 2021: ఆర్‌సీబీలోకి వరల్డ్ నెంబర్ 2 బౌలర్

61 ఏళ్ల నిరీక్షణ
సాన్ మరినో ఓ యూరోపియన్ యూనియన్ దేశం. సాన్ మరినో చుట్టూ ఇటలీ ఉంటుంది. జనాభా కేవలం 34 వేలు మాత్రమే. మన తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాల్లో నివసించే జనాభా కంటే చాలా తక్కువ. కానీ ఆదేశానికి ఒలింపిక్స్ కొత్తేం కాదు. 60 ఏళ్ల క్రితం నుంచే రోమ్ ఒలింపిక్స్ (1960) నుంచి విశ్వక్రీడలు ఆడటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఓ మెడల్ సాధించింది. పతకం సాధించిన అతి తక్కువ జనాభా గల దేశంగా రికార్డులకెక్కింది.

మా చిన్న దేశానికి ఇదే పెద్ద గర్వకారణం
ఇక బ్రాంజ్ మెడల్ విజయానంతరం పెరిల్లీ మాట్లాడుతూ తమ చిన్న దేశానికి ఇదే పెద్ద గర్వాకారణమని తెలిపింది. 'ఫైనల్లో ఐదో షూటర్ నిష్క్రమించగానే నేను గట్టిగా మనసులో అనుకున్న... మరోసారి నాలుగో స్థానంలో నిలవొద్దని! చివరిదాకా ఏకాగ్రతతో గురిపెట్టాను. చివరకు పోడియంలో నిలిచాను. నాకు, నా దేశానికి ఇదే తొలి పతకం. మా చిన్న దేశానికి ఇదే పెద్ద గర్వకారణం. బహుశా మా వాళ్లంతా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారేమో. 'అని అలెస్సాండ్రా పెరిల్లీ సంతోషం వ్యక్తం చేసింది.

షూటింగ్‌పైనే ఆశలు..
కేవలం మూణ్నాలుగు క్రీడాంశాల్లో పాల్గొనే సాన్ మరినో ఒలింపిక్ కమిటీ ఆశలన్నీ షూటర్లపైనే. పెరిల్లీ కంటే ముందు ఒలింపిక్స్‌లో సాన్ మరినో దేశం అత్యుత్తమ ప్రదర్శన ఐదో స్థానం. అది కూడా షూటింగ్‌లోనే! లాస్ ఏంజిల్స్ (1984)లో ఫ్రాన్సెసొ నని పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. దీన్ని లండన్‌లో పెరిల్లీ నాలుగో స్థానంతో సవరించింది. షూటింగ్‌తో పాటు రెజ్లింగ్, స్విమ్మింగ్, జూడో ఈవెంట్లలో సాన్ మరినో క్రీడాకారులు పాల్గొంటారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications