వరల్డ్ టైటిల్ నెగ్గిన భారత తొలి మహిళ: ఎవరీ ఐశ్వర్య పిస్సే?

హైదరాబాద్: బైక్ రేసింగ్ అంటే చాలా ప్రమాదరమైన ఆట అని అంటుంటారు. అలాంటి బైకే రేసింగ్‌లో పాల్గొనాలంటే పురుషులు సైతం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఇక, మహిళలు బైక్ రేసింగ్‌లో పోటీకి దిగటం అంటే మామాలు విషయం కాదు. అలాంటిది బెంగళూరుకు చెందిన 23 ఏళ్ల ఐశ్వర్య పిస్సే వరల్డ్ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించింది.
తొలి మహిళగా అరుదైన ఘనత
హంగెరీ వేదికగా ముగిసిన ఎఫ్ఐఎమ్ ప్రపంచకప్ మోటార్ రేసింగ్ మహిళ టైటిల్‌ను బెంగళూరుకు చెందిన ఐశ్వర్య పిస్సే సొంతం చేసుకుంది. ఫలితంగా ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళగా అరుదైన ఘనత సృష్టించింది. 18 ఏళ్ల వయసు నుంచే మోటార్ బైక్ నడపడం నేర్చుకున్న ఐశ్వర్య అంతర్జాతీయ బైక్ రేసర్ స్థాయికి ఎదిగింది.

2019 మోటార్ స్పోర్ట్స్ సర్క్యూట్‌లో
దుబాయ్ ఇసుక ఎడారులు, హిమాలయాలలోని మంచుపర్వతాలలో జరిగిన అంతర్జాతీయ బైక్ రేసుల్లో పాల్గొని సత్తా చాటింది. 2019 మోటార్ స్పోర్ట్స్ సర్క్యూట్ మహిళల విభాగంలో సీనియర్, జూనియర్ విభాగాలలో పాల్గొన్న ఐశ్వర్య పిస్సే... సీనియర్ విభాగంలో విశ్వవిజేతగా నిలవగా... జూనియర్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది.
నా నుంచి అద్భుతాలు ఆశించొద్దు: లార్డ్స్‌లో టెస్టు అరంగేట్రంపై జోఫ్రా ఆర్చర్

తొలి అంచె రేసులో విజేతగా నిలిచిన ఐశ్వర్య
దుబాయ్ వేదికగా ముగిసిన తొలి అంచె రేసులో విజేతగా నిలిచిన ఐశ్వర్య.. పోర్చుగల్ రేసులో మూడు, స్పెయిన్ రేసులో ఐదు, హంగెరీ రేసులో నాలుగు స్థానాల్లో నిలవడం ద్వారా మొత్తం 65 పాయింట్లతో వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. పోర్చుగల్‌కు చెందిన రీటా వియారా 61 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది.
రెండున్నర కిలోమీటర్లు వరదల్లో ఈదాడు.. బాక్సింగ్‌లో పతకం గెలిచాడు

46 పాయింట్లతో రెండో స్థానాన్ని
ఇక, జూనియర్ విభాగంలోనూ పోటీకి దిగిన ఐశ్వర్య 46 పాయింట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. చిలీకి చెందిన థామస్ డీ గవాడో 60 పాయింట్లతో జూనియర్ చాంపియన్ ట్రోఫీని నెగ్గింది. మోటార్ స్పోర్ట్‌లో అడుగుపెట్టిన ఐదేళ్ల కాలంలోనే ఐశ్వర్య ఆరు జాతీయ టైటిల్స్‌తో పాటు వరల్డ్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది.

మాటలు రావడం లేదు
వరల్డ్ టైటిల్ అందుకున్న అనంతరం ఐశ్వర్య ఆనందం మాటల్లో చెప్పలేకుంది. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ "సంతోషంగా ఉంది. మాటలు కూడా రావడం లేదు. గతేడాది ఏదైతో జరిగిందో... నా మొదటి అంతర్జాతీయ సీజన్‌లో... నేను స్పెయిన్ బాజాలో క్రాష్ అయి గాయాలతో బాధపడి వాటి నుంచి త్వరగా బయటకు వచ్చి ఛాంపియన్‌షిప్ గెలవడం గొప్ప అనుభూతి" అని తెలిపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications