న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పర్మీషన్ లేకుండా పాక్‌కు వెళ్లిన భారత కబడ్డీ టీమ్.. ఫైర్ అవుతున్న ఇండియన్ గవర్నమెంట్

They cannot use the word India: IOA chief Narinder Batra on Kabaddi teams visit to Pakistan

న్యూఢిల్లీ: కబడ్డీ సమాఖ్య అనుమతిలేకున్నా.. క్రీడా, విదేశీ, హోం శాఖలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకున్నా.. భారత కబడ్డీ జట్టు పాకిస్థాన్‌ వెళ్లడం తీవ్ర వివాదానికి దారితీసింది. పాకిస్థాన్‌లో సోమవారం ప్రపంచ కబడ్డీ చాంపియన్‌షిప్ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు వాఘా సరిహద్దుద్వారా శనివారం లాహోర్‌ చేరింది. ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరలయ్యే వరకు కూడా జట్టు అక్కడకు వెళ్లిన విషయం ఎవరికి తెలియలేదు. తాము ఏ ఒక్క ఆటగాడికీ అనుమతి ఇవ్వలేదని క్రీడా మంత్రిత్వ శాఖతోపాటు జాతీయ కబడ్డీ సమాఖ్య స్పష్టం చేసింది.

ఏ ఒక్కరికి పర్మిషన్ ఇవ్వలేదు..

ఏ ఒక్కరికి పర్మిషన్ ఇవ్వలేదు..

పాకిస్థాన్‌లో జరిగే ప్రపంచ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి ఏ ఒక్కరికి కూడా అనుమతివ్వలేదని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. క్రీడా వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న ఈ వ్యవహారంపై ఆయన సోమవారం స్పందించారు.

‘పాకిస్థాన్ వెళ్లేందుకు ఏ ఒక్క కబడ్డీ ప్లేయర్‌కు అనుమతివ్వలేదు. వీసా ఇవ్వడం అనేది దేశం యొక్క సార్వభౌమ హక్కు, వీసా మంజూరు విషయంలో మా పాత్ర లేదు. ఈ వ్యవహారంపై కబడ్డీ ఫెడరేషన్‌తో మాట్లాడిన తర్వా పూర్తి వివరాలు వెల్లడిస్తాం.'అని కిరణ్ రిజిజు తెలిపారు.

భారత్ జెండా, పేరు ఉపయోగించొద్దు : ఐఓఏ చీఫ్

భారత్ జెండా, పేరు ఉపయోగించొద్దు : ఐఓఏ చీఫ్

ఎలాంటి అనుమతి లేకుండా పాకిస్థాన్ వెళ్లడంపై భారత ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరిందర్ బత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు భారత జెండా, పేరు ఉపయోగించుకోవడాని వీల్లేదని స్పష్టం చేశారు.

‘ఆ జట్టును ఐఓఏ ఆమోదించలేదు. సమాఖ్య అనుమతివ్వలేదు కాబట్టి ఎవరు వెళ్ళారో కూడా నాకు తెలియదు. 60 మంది వెళ్లారా లేక 100 మంది పోయిండ్రా అనేది నాకు తెలియదు. ఐఓఏ లో సభ్యులైన కబడ్డీ సమాఖ్య ఎవరినీ పంపలేదని ధృవీకరించింది. (క్రీడా) మంత్రిత్వ శాఖ కూడా ఎలాంటి అనుమతివ్వలేదని జారీ చేసిన ప్రకటనలను నేను చూశాను . కాబట్టి వారు ఎవరో, వారి కథ ఏమిటో నాకు తెలియదు. వెళ్లినవారికి భారత క్రీడలతో సంబంధం లేదు.

ప్రభుత్వ, ఐఓఏ అనుమతి లేకుండా వారు ఇండియా అనే పదాన్ని ఉపయోగించలేరు. భారతీయ పాస్‌పోర్ట్ ఉన్న కొంతమంది వ్యక్తులు భారతదేశంగా వెళ్లి అక్కడ ఆడితే ఎలా?'అని బత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా వాళ్లు కొంచెం ఓవర్ చేశారు.. మా జట్టు తరఫున క్షమాపణలు చెబుతున్నా : బంగ్లా అండర్-19 కెప్టెన్

మాకు తెలియదు..

మాకు తెలియదు..

పాకిస్థాన్ వెళ్లిన ఏ కబడ్డీ జట్టు గురించి తమకు సమాచారం లేదని, పాకిస్థాన్‌లో జరిగే కబడ్డీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు తాము ఏ జట్టుకు అనుమతివ్వలేదని భారత అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్(ఏకేఎఫ్ఐ) అడ్మినిస్ట్రేటర్ రిటైర్డ్ జస్టిస్ ఎస్‌పీ గార్గ్ స్పష్టం చేశారు.

మీడియా ద్వారానే తాము ఈ విషయాన్ని తెలుసుకున్నామని, ఇటువంటి చర్యలను కబడ్డీ సమాఖ్య సహించదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసకుంటామన్నారు.

స్వాగతం పలికి పాక్ కబడ్డీ సమాఖ్య..

ప్రపంచ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వాఘా సరిహద్దు దాటిన భారత జట్టుకు పాకిస్థాన్ కబడ్డీ సమాఖ్య అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సెక్యూరిటీ మధ్య భారత ఆటగాళ్లను హోటళ్లకు తీసుకెళ్లారు.

గత టోర్నీలన్నీ భారత్‌లోనే..

2010 నుంచి 2019 మధ్య జరిగిన గత 6 ప్రపంచ కబడ్డీ చాంపియన్‌షిప్‌‌ ఎడిషన్లు భారత్‌లో‌నే జరిగాయి. ఈ 6 టోర్నీల్లో భారతే విజయం సాధించింది. 2010.12,13,14 టోర్నీల్లో పాక్‌ను భారత్ ఓడించింది. ఈ టోర్నీలో గెలిచిన జట్టుకు రూ. కోటీ నగదు, రన్నరప్ జట్టుకు 70 లక్షల యాబైవేల బహుమానం ఇవ్వనున్నారు.

Story first published: Monday, February 10, 2020, 15:19 [IST]
Other articles published on Feb 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X