For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాలుగో విజయం: ఉఠ్కంఠ పోరులో పట్నాను ఓడించిన యు ముంబా

Pro Kabaddi League 2019 : U Mumba Down Patna Pirates In A Nail-Biting Finish || Oneindia Telugu
Pro Kabaddi: U Mumba Down Patna Pirates in Nail-biting Finish

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్‌లో యు ముంబా నాలుగో విజయం నమోదు చేసుకుంది. మ్యాచ్‌ ఆఖరి నిమిషంలో రోహిత్‌ బలియన్‌ సూపర్‌ రైడ్‌ సాధించడంతో యు ముంబా.. పట్నా పైరేట్స్‌ను ఓడించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన పోరులో ముంబా 34-30తో పాట్నా పైరేట్స్‌పై గెలుపొందింది.

టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రికే పట్టం కట్టిన బీసీసీఐ

ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి ముంబానే ఆధిపత్యం ప్రదర్శించింది. సందీప్‌ నర్వాల్‌ వరుస పాయింట్లు తీసుకు రావడంతో ముంబా తొలి అర్ధభాగంలో 22-11తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. అయితే, రెండో అర్ధభాగంలో పట్నా అద్భుతంగా పుంజుకుంది. పర్‌దీప్‌ నర్వాల్‌ కూతకు వెళ్లిన ప్రతిసారీ పాయింట్లు సాధించాడు.

ఈ క్రమంలో పర్‌దీప్‌ నర్వాల్ పీకేఎల్‌లో 1600 రైడ్‌ పాయింట్లను అందుకున్నాడు. రోహిత్‌ బలియన్‌ (9 పాయిం ట్లు) విజృంభించడంతో యు ముంబా పుంజుకుంది. రోహిత్‌, సందీప్‌ నర్వాల్‌ (6) వరుస రైడ్లలో పాయింట్లు సాధించి ఆట 34వ నిమిషానికి 29-24తో ముంబాను విజయానికి చేరువ చేశారు.

గుండెపోటు కాదు.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మాజీ క్రికెటర్

చివర్లో రోహిత్‌ బలియన్‌ సూపర్‌ రైడ్‌ చేసి మూడు పాయింట్లు సాధించడంతో ముంబాకు విజయం ఖాయమైంది. సందీప్‌ మూడు ట్యాకిల్స్‌ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముంబై జట్టు తరఫున రోహిత్ బలియాన్ 9, అతుల్ 8, సందీప్ నర్వాల్ 6 పాయింట్లు సాధించగా.. పాట్నా తరఫున ప్రదీప్ (6 పాయింట్లు), ఇస్మాయిల్ (6 పాయింట్లు) ఆకట్టుకున్నారు.

Story first published: Saturday, August 17, 2019, 7:50 [IST]
Other articles published on Aug 17, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+