Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యు ముంబాకు షాక్: ఈ సీజన్‌లో నాలుగో ఓటమి!

Pro Kabaddi League 2019 : Baldev Singh Picks Up High 5 As Bengal Warriors Edge Out U Mumba
Pro Kabaddi League 2019: Baldev picks up another High 5 as Bengal Warriors edge out U Mumba

హైదరాబాద్: ఒత్తిడిలో మ్యాచ్ ఎలాగ ఆడాలో మిగతా జట్లకు బెంగాల్‌ వారియర్స్‌ సరిగ్గా ఆడి చూపించింది. ఒక్కసారి కాదు ఏకంగా రెండు సార్లు 5 పాయింట్ల సాధించి విజేతగా నిలిచింది. పీకేఎల్‌లో బెంగాల్‌ వారియర్స్‌తో ఇప్పటిదాకా జరిగిన 11 మ్యాచ్‌ల్లో యు ముంబా ఏకంగా పదిసార్లు గెలిచింది. అయితే ఈసారి బెంగాల్‌ వారియర్స్ లాగా పోరాడింది.

విండీస్‌తో తొలి వన్డే.. మైదానంలోనే కోహ్లీ స్టెప్పులు (వీడియో)

శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 32-30తో యు ముంబాను ఓడించింది. చక్కటి ఆరంభం లభించినప్పటికీ, దానిని సద్వినియోగం చేసుకోలేని యు ముంబా ఈ సీజన్‌లో నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. బల్దేవ్‌ సింగ్‌ హై5 పాయింట్లతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక, ముంబా తరఫున అర్జున్‌ దేశ్వాల్‌ సూపర్‌ 10తో ఆకట్టుకున్నాడు.

మ్యాచ్ తొలి అర్ధ భాగంలో యు ముంబా ఆడిన తీరు చూస్తే ఆ జట్టు ఖాతాలో మరో విజయం ఖాయమన్నట్లు కనిపించింది. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి యు ముంబా 16-11తో ఆధిక్యంలో ఉంది. అయితే రెండో అర్ధ భాగం ఆరంభమైన కాసేపటికే సూపర్‌ రైడ్‌తో చెలరేగిన బెంగాల్ రైడర్‌ ప్రపంజన్‌ కుమార్‌ యు ముంబా ఆధిక్యాన్ని 14-16కు తగ్గించాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్ అసిస్టెంట్‌ కోచ్‌గా బ్రెండన్‌ మెక్‌కల్లమ్!

ఆ తర్వాత మరో నాలుగు పాయింట్లు సాధించిన బెంగాల్‌ జట్టు 18-17తో ముందంజ వేసింది. అనంతరం తేరుకున్న యు ముంబా వరుసగా పాయింట్లు సాధించి 26-21తో మరోసారి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే చివర్లో బెంగాల్ వారియర్స్ డిఫెండర్లు యు ముంబా జట్టును ఆలౌట్‌ చేసి తమ ఆధిక్యాన్ని కాపాడుకున్నారు.

మరో మ్యాచ్‌లో సొంత మైదానంలో పట్నా పైరేట్స్‌ ఎట్టకేలకు విజయం సాధించింది. సొంత వేదికలో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన పట్నా పైరేట్స్‌ ఇక్కడి చివరి అంచె మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించింది. యూపీ యోధాతో జరిగిన మ్యాచ్‌లో 41-20 తేడాతో ఘన విజయం సాధించింది. పట్నా తరపున ప్రదీప్‌ నర్వాల్‌ 12 పాయింట్లతో రాణించాడు.

Story first published: Saturday, August 10, 2019, 7:59 [IST]
Other articles published on Aug 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+