Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోల్‌కతా నైట్‌రైడర్స్ అసిస్టెంట్‌ కోచ్‌గా బ్రెండన్‌ మెక్‌కల్లమ్!

Brendon McCullum set to become Kolkata Knight Riders assistant coach

హైదరాబాద్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ జతకట్టనున్నాడు. అయితే, ఈసారి ఆటగాడిగా కాకుండా క్రికెటర్లకు మార్గనిర్దేశం చేసేందుకు కొత్త అవతారం ఎత్తనున్నాడు. కోల్‌కతాకు అసిస్టెంట్‌ కోచ్‌గా బ్రెండన్‌ను నియమించినట్లు తెలుస్తోంది.

2016లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మెకల్లమ్.. ఇటీవలే అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు సోమవారం తన ట్విట్టర్ వేదికగా తెలిపాడు. 'అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి వైదొలగడం గౌరవంగా ఉంది. నా ప్రదర్శన పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నా. యూరో టీ20 స్లామ్‌లో నేను తిరిగి ఆడను. నా నిర్ణయాన్ని గౌరవించిన నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు' అని మెకల్లమ్ ట్వీట్ చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత బ్రెండన్ మెక్‌కల్లమ్ కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు మెక్‌కలమ్‌ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ జట్టుకు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ ఓనర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ప్రస్తుతం కోల్‌కతా సహాయక కోచ్‌గా కొనసాగుతున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ సైమన్‌ కాటిచ్‌ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ జట్టుకు కూడా సహాయక కోచ్‌గా ఉన్నారు. దీంతో సీపీఎల్‌తో పాటు ఐపీఎల్‌లోనూ సైమన్ కాటిచ్ స్థానాన్ని బ్రెండన్ మెక్‌కల్లమ్‌తో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను ఆరంభ సీజన్‌లో కేకేఆర్ వేలంలో సొంతం చేసుకుంది. దీంతో కేకేఆర్ ఆడిన తొలి మ్యాచ్‌లో మెక్‌కల్లమ్ 158 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఐదు సీజన్ల పాటు కేకేఆర్ జట్టుకే మెక్‌కల్లమ్ ఆడాడు. కాగా, మెక్‌కలమ్‌ 101 టెస్టుల్లో 6,453 పరుగులు చేయగా అత్యధిక స్కోరు 302 కావడం విశేషం. కివీస్ తరుపున మొత్తం 260 వన్డేల్లో 6083 పరుగులు చేశాడు.

Story first published: Friday, August 9, 2019, 19:34 [IST]
Other articles published on Aug 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+