PKL 2019: పుణెరి పల్టన్‌పై బెంగళూరు బుల్స్ ప్రతీకారం తీర్చుకునేనా?

హైదరాబాద్: ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో భాగంగా ప్రస్తుతం మ్యాచ్‌లు చెన్నై అంచెలో జరుగుతున్నాయి. జూలై 20న ఆరంభమైన ఈ సీజన్‌లో మొత్తం 12 జట్లు పోటీపడుతున్నాయి. ఇప్పటికే టోర్నీలో 50 మ్యాచ్‌లు ముగిశాయి. దబాంగ్ ఢిల్లీ మినహా అన్ని జట్లూ కనీసం ఏడేసి మ్యాచ్‌లు ఆడాయి.
ఆరు విజయాలతో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. లీగ్‌లో భాగంగా బుధవారం పుణెరి పల్టన్, బెంగళూరు బుల్స్ జట్లు తలపడుతున్నాయి. చివరగా ఈ రెండు జట్ల తలపడినప్పుడు బెంగళూరు బుల్స్‌పై పుణెరి పల్టన్ జట్టు 2 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో బుధవారం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనున్న మ్యాచ్‌లో పుణెరి పల్టన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని బెంగళూరు బుల్స్ భావిస్తోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌లో తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం...

ఢిఫెన్స్ అదుర్స్
తమిళ తలైవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో పుణెరి పల్టన్ ఢిఫెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సుర్జీత్ సింగ్, గిరిష్ మారుతి ఎర్నాక్, హాది తైజక్, సాగర్ కృష్ణలతో కూడి డిఫెన్స్ ప్రత్యర్ధి జట్టు రైడర్లను అలవోకగా పట్టేయడంతో పాటు 12 ట్యాకిల్ పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక, రైడింగ్ డిపార్ట్‌మెంట్‌లో నితిన్ తోమర్, మన్జీత్ చిల్లర్, పంకజ్ మోహితే ఎలాగూ ఉన్నారు. వీరు సమిష్ఠిగా రాణిస్తే బెంగళూరు బుల్స్‌పై పుణెరి పల్టన్ మరోసారి విజయం సాధించడం ఖాయం.
అతడి బౌలింగ్‌లో పేస్‌తో పాటు కచ్చితత్వం ఉంది: ఆర్చర్‌కు మెక్‌గ్రాత్ ప్రశంస

పుణెరి పల్టన్
ఆడినవి: 8
గెలిచినవి: 2
టై: 1
ఓడినవి: 5
విన్ రేట్: 25%
బెస్ట్ రైడర్: పంకజ్ మోహితే
బెస్ట్ డిఫెండర్: సుర్జిత్ సింగ్

మళ్లీ రేసులోకి
గత మ్యాచ్‌లో తమిళ తలైవాస్‌పై విజయం సాధించి మళ్లీ రేసులోకి వచ్చారు. స్టార్ రైడర్ పవన్ షెరావత్ ఆకట్టుకుంటుండగా... రోహిత్ కుమార్ అతడికి మద్దతుగా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇక, థర్డ్ రైడర్‌గా బంటీ ఎలాగూ ఉన్నాడు. బెంగళూరు ఢిఫెన్స్‌లో అమిత్ షెరాన్, సౌరభ్ నందలాల్, అజయ్, అంకిత్‌లు కీలకంగా వ్యవహారిస్తున్నారు.
స్మిత్‌ను ఉద్దేశిస్తూ ఆర్చర్ ట్వీట్.. నెటిజన్ పంచ్!!

బెంగళూరు బుల్స్
ఆడినవి: 8
గెలిచినవి: 5
టై: 0
ఓడినవి: 3
విన్ రేట్: 62.5%
బెస్ట్ రైడర్: పవన్ షెరావత్
బెస్ట్ ఢిపెండర్: మహేందర్ సింగ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications