న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మిత్‌ను ఉద్దేశిస్తూ ఆర్చర్‌ ట్వీట్‌.. నెటిజన్‌ పంచ్‌!!

Jofra Archer Reacts To Fan's Naughty GIF On Steve Smith || Oneindia Telugu
Ashes 2019: Jofra Archer Reacts To Fans Naughty GIF file for Steve Smith

లండన్‌: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో ఆరంగేట్రం చేసిన ఇంగ్లండ్ యువ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. ఆర్చర్‌ బంతులకు ఆసీస్ బ్యాట్స్‌మన్‌ తడబడుతూ పెవిలియన్ చేరారు. ఇక ఆర్చర్‌ వేసిన ఓ షాట్‌పిచ్‌ బంతి మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ మెడకు బలంగా తాకడంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. చికిత్స చేసినా లాభం లేకపోవడంతో ..అతడి స్థానంలో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడిగా మార్నస్‌ లబుషేన్‌ క్రీజులకి వచ్చి ఆసీస్‌ను ఆదుకున్నాడు. ఆర్చర్ దాడికి లబుషేన్‌ కూడా గాయపడిన విషయం తెలిసిందే.

ఒలింపిక్స్‌ హాకీ టెస్టు ఈవెంట్‌.. ఫైనల్లో భారత మహిళా, పురుషుల జట్లు

నిద్ర లేచేసరికి ఇలా ఉంటా:

స్టీవ్ స్మిత్‌ గాయపడిన నేపథ్యంలో ఆర్చర్‌ అతన్ని ఉద్దేశిస్తూ ట్విటర్‌లో ఓ పోస్టు చేసాడు. ఓ పెద్దాయన సోఫా మీద నుంచి కర్ర సహాయంతో పైకి లేవడానికి ప్రయత్నిస్తుండగా.. ఆ కర్ర కిందపడే జిఫ్‌ ఫైల్‌ని జత చేశాడు. 'రేపు ఉదయం బెడ్ మీద నిద్ర లేచేసరికి నేను ఇలా ఉంటా' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన ఓ నెటిజన్‌ 'తలలేని ఓ వ్యక్తి బాల్కనీలో నిలబడే' జిఫ్‌ ఫైల్‌ని జత చేసి రీట్వీట్‌ చేశాడు. 'స్టీవ్ స్మిత్ ఉదయం ఇలా లేచాడు' అని పోస్ట్ పెట్టాడు.

మోస్ట్ డేంజరస్ బౌలర్‌:

నెటిజన్ పెట్టిన పోస్ట్ చూసి ప్రతిస్పందించిన ఆర్చర్‌.. సరదాగా ఉందని మరో ట్వీట్ చేసాడు. ఇంగ్లండ్ స్వింగ్ కింగ్ జేమ్స్ ఆండర్సన్ గాయపడడంతో రెండో టెస్టులో ఆర్చర్‌ ఆరంగేట్రం చేసాడు. అరంగేట్ర టెస్టులో ఐదు వికెట్లు తీసి ఆర్చర్ అటు క్రికెట్ అభిమానులతో పాటు ఇటు మాజీ క్రికెటర్లచే కొనియాడబడుతున్నాడు. ఆర్చర్‌ మోస్ట్ డేంజరస్ బౌలర్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

నేరుగా ప్రపంచకప్‌కు:

నేరుగా ప్రపంచకప్‌కు:

బార్బడోస్‌లో జన్మించిన ఆర్చర్‌ విండీస్ అండర్-19 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడంతో ఇంగ్లాండ్‌కు వచ్చి క్లబ్ క్రికెట్ ఆడడంతో వెలుగులోకి వచ్చాడు. అద్భుత ప్రదర్శన చేయడంతో ఎలాంటి అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేకపోయినా.. నేరుగా ఇంగ్లాండ్ తరఫున ప్రపంచకప్‌-2019లో ఆడి అత్యధిక వికెట్లు సాధించాడు. ఇప్పటివరకు ఆర్చర్ 14 వన్డేలు, ఒక టెస్టు, ఒక టీ20 ఆడాడు. మూడో టెస్టు ఈనెల 22 నుంచి లీడ్స్‌ వేదికగా జరగనుంది.

Story first published: Wednesday, August 21, 2019, 9:45 [IST]
Other articles published on Aug 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X