Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీలంక, ఉగాండా చిత్తు.. భారత్ డబుల్ ధమాకా!

కామన్వెల్త్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ 2026 ఫైనల్లో భారత పురుషుల జట్టు శ్రీలంకను 54-20 తేడాతో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు ఫైనల్లో భారత మహిళల జట్టు ఉగాండాను 35-15 తేడాతో ఓడించి ఈ టోర్నీలో భారత్ డబుల్ టైటిల్ విజయాన్ని పూర్తి చేసింది. భారత్ తరఫున ఆదిత్య షిండే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆదిత్య షిండే 14 రైడ్‌లలో నాలుగు బోనస్ పాయింట్లతో సహా 10 రైడ్ పాయింట్లు సాధించాడు. భరత్ హూడా 8 రైడ్ పాయింట్లను జోడించాడు. అవన్నీ సెకండాఫ్‌లోనే వచ్చాయి. భరత్ హుడా ఏడు రైడ్‌లు చేసి ఒక్కసారి కూడా టాకిల్ కాలేదు.

IND vs NZ: వ్యూహాత్మక మార్పు.. న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs NZ: వ్యూహాత్మక మార్పు.. న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

శ్రీలంకకు ఏమాత్రం అవకాశం ఇవ్వని భారత్
పంకజ్ మోహితే 6 పాయింట్లు అందించగా.. వైస్ కెప్టెన్ నవీన్ కుమార్ 5 పాయింట్లు జోడించాడు. యోగేష్ దహియా డిఫెన్స్ విభాగానికి నాయకత్వం వహించి అద్భుతంగా రాణించాడు. యోగేష్ దహియా ఫస్టాఫ్‌లో 5 సక్సెస్‌ఫుల్ టాకిల్స్ చేశాడు. శ్రీలంక రైడర్లు మ్యాచ్ అంతటా ఇబ్బంది పడ్డారు. ఫస్టాఫ్ ముగిసేందుకు 10 నిమిషాలు మిగిలి ఉండగా.. భారత్ 15-8 ఆధిక్యంలో ఉంది. అప్పటికే శ్రీలంకను ఒకసారి ఆలౌట్ చేసింది. ఆ తర్వాత శ్రీలంకపై 15-2 స్కోరు చేసి.. విరామ సమయానికి 30-10 ఆధిక్యం సాధించింది. హాఫ్ టైమ్ చివరి 5 నిమిషాల్లో శ్రీలంకను రెండోసారి ఆలౌట్ చేసింది.

India Wins Double Gold at Commonwealth Kabaddi Championship 2026 With Both Mens and Womens

భారత పురుషుల జట్టు ఆడిన 8 మ్యాచ్‌లలోనూ విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. గ్రూప్ ఏలో ఇంగ్లాండ్‌ను 46-26, ఉగాండాను 44-30, మలేషియాను 37-23, నైజీరియాను 50-23, టాంజానియాను 48-20, శ్రీలంకను 45-24 తేడాతో ఓడించి ఆరు విజయాలు సాధించింది. దీని తర్వాత సెమీఫైనల్స్‌ లో బంగ్లాదేశ్‌ను 56-27 తేడాతో, ఫైనల్‌లో శ్రీలంకను 54-20 తేడాతో ఓడించింది.

IND vs NZ: వైభవ్‌ సూర్యవంశీని తప్పించడం సరైన నిర్ణయమే: స్టీఫెన్ ఫ్లేమింగ్

Also Read

IND vs NZ: వైభవ్‌ సూర్యవంశీని తప్పించడం సరైన నిర్ణయమే: స్టీఫెన్ ఫ్లేమింగ్

టైటిల్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు
ఇదిలా ఉండగా.. మహిళల పోటీలో భారత మహిళల కబడ్డీ జట్టు ఉగాండాపై 35-15 తేడాతో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. టోర్నీ అంతటా భారత మహిళల జట్టు అజేయంగా నిలిచింది. ఫైనల్‌లో సాక్షి భారత్ తరపున అత్యంత విజయవంతమైన రైడర్‌గా నిలిచింది. ఆమె 10 రైడ్‌లలో 2 బోనస్ పాయింట్లతో సహా మొత్తం 9 పాయింట్లు సాధించింది.

Story first published: Sunday, November 1, 2026, 10:51 [IST]
Other articles published on Nov 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+