న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PKL 2019: పట్నా పైరేట్స్ ఈరోజైనా సరైన కూత కూసేనా?

Bengal Warriors look to extend unbeaten streak with a win against Patna Pirates
ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో భాగంగా గురువారం బెంగాల్ వారియర్స్, పట్నా పైరేట్స్ జట్లు తలపడనున్నాయి. చెన్నై అంచెలో భాగంగా జరుగుతున్న ఈ పోరులో ఇరు జట్లు విజయం సాధించాలని తహతహలాడుతున్నాయి.

తొలి టెస్టుకు ముందు విరాట్ కోహ్లీ యాంకర్‌గా మారిన వేళ! (వీడియో)

ఈ సీజన్‌లో ఇప్పటివరకు బెంగాల్ వారియర్స్ నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 28 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా... పట్నా పైరేట్స్ 17 పాయింట్లతో పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.

గత నాలుగు మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్ రెండింట విజయం సాధించి రెండు మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. మరోవైపు పట్నా పైరెట్స్ గత ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో బెంగాల్ వారియర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధించాలని భావిస్తోంది.

బెంగాల్ వారియర్స్
ఆడినవి: 8
గెలిచినవి:4
టై: 2
ఓడనవి: 2
విన్ రేట్: 50%
బెస్ట్ రైడర్: మహేందర్ సింగ్
బెస్ట్ డిఫెండర్: బల్దేవ్ సింగ్

ఈ సీజన్‌లో పట్నా పైరెట్స్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. యు ముంబా, యుపి యోధా జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో ఆ జట్టు 21 పాయింట్ల తేడాతో ఓడిపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మ్యాచ్‌లో జట్టు సమిష్టింగా రాణిస్తేనే తప్ప విజయం సాధించడం కష్టం. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి పైకి ఎగబాకాలని చూస్తోంది.

India vs West Indies: తొలి టెస్టుకు ముందు విండిస్‌కు ఊహించని దెబ్బ!
పట్నా పైరేట్స్:

ఆడినవి: 8
గెలిచినవి:3
టై: 0
ఓడినవి: 5
విన్ రేట్: 37.5%
బెస్ట్ రైడర్: పర్దీప్ నర్వాల్
బెస్ట్ డిఫెండర్: జైదీప్

Story first published: Thursday, August 22, 2019, 15:19 [IST]
Other articles published on Aug 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X