భయమెంటో తెలియని దిగ్గజ బ్యాట్స్‌మన్‌తో ఇంటర్య్వూ: యాంకర్‌గా కోహ్లీ (వీడియో)

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ యాంకర్‌గా మారాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-విండిస్ జట్ల మధ్య తొలి టెస్టు ఆంటిగ్వా వేదికగా గురువారం ఆరంభం కానుంది. తొలి టెస్టు ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ క్రికెట్ లెజెండ్ సర్ వివ్ రిచర్డ్స్‌ని బీసీసీఐ టీవీ కోసం ఇంటర్య్వూ చేశాడు.
విరాట్ కోహ్లీ తన ఇంటర్య్వూలో వివ్ రిచర్డ్స్‌ను అతను బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి బయల్దేరినప్పుడు తన తరంలో అత్యంత వేగవంతమైన బౌలర్లను ఎలా ధీటుగా ఎదుర్కొన్నాడనే ప్రశ్నలను ఎక్కువగా అడిగాడు. అప్పట్లో వివ్ రిచర్డ్స్‌కు భయం లేని బ్యాట్స్ మన్‌గా పేరుండేది. ఆయన గార్డులు లేకుండానే, ఆరోజుల్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
1991లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వివ్ రిచర్డ్స్ టెస్టులు, వన్డేలు కలిపి మొత్తం 15,000కు పైగా పరుగులు చేశాడు. కోహ్లీ-రిచర్డ్స్ మధ్య సంభాషణ సాగిందిలా:

మీరే గొప్ప స్ఫూర్తి
విరాట్ కోహ్లీ: ప్రస్తుతం మాలాంటి యువ బ్యాట్స్‌మెన్ అందరికీ మీరే గొప్ప స్ఫూర్తి.
వివ్‌రిచర్డ్స్: పోటీకి నేనెప్పుడూ సిద్ధమే అనుకొనేవాడిని. నా సామర్థ్యం మేరకు నన్ను నేను అత్యుత్తమంగా బయట పెట్టుకుంటాను. ఆ అభిరుచి, ఆ సారూపత్యను నీలో చూస్తున్నాను. కొన్నిసార్లు కొందరు మనల్ని భిన్నంగా చూస్తారు. ఎందుకంత కోపంగా ఉన్నావని అంటారు.

బౌన్సర్ ఎక్కడ గాయపరుస్తుందోనని
విరాట్ కోహ్లీ: బౌన్సర్ ఎక్కడ గాయపరుస్తుందోనని భయపడే కన్నా ముందే దెబ్బ తగిలించుకోవడం మంచిదని అనుకుంటాను. మరోసారి అలా జరగకుండా ఇది నాకు ప్రేరణనిస్తుంది. శరీరమంతా ఆ నొప్పితో విల్లవిల్లాడుతున్నప్పుడు మళ్లీ ఇది చోటుచేసుకోదని భావిస్తానని కోహ్లీ చెప్పారు.
వివ్‌రిచర్డ్స్: ఇదంతా ఆటలో ఒక భాగం. ఇలాంటి గాయాల తర్వాత మనమెలా తిరిగొస్తామన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. గతంలో ఛాతీ భాగంలో చిన్న గార్డ్స్ మాత్రమే ఉండేవి. బంతులు తగిలి బాధపడేవాళ్లం. కానీ తప్పదు. ఇదంతా ఆటలో భాగమే' అని రిచర్డ్స్ వెల్లడించారు.
మీ బ్యాటింగ్ వీడియోలను చూసినప్పుడు
విరాట్ కోహ్లీ: నేను మీ బ్యాటింగ్ వీడియోలను చూసినప్పుడు మీకు టోపీ మాత్రమే ఉంది, అత్యంత నాణ్యమైన బౌలింగ్ ఉన్నప్పటి శకంలో మీరెందుకు హెల్మెట్ ధరించలేదు.
వివ్ రిచర్డ్స్: నేను గొప్పవాడినని నమ్మేవాడిని. మీకు పొగరులా అనిపించొచ్చు. కానీ, నాకు తెలిసిన క్రీడలో భాగమయ్యానని ఫీలయ్యేవాడిని. ప్రతిసారీ నన్ను నేను ప్రోత్సహించుకొనేవాడిని. అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఆడాలని భావించినప్పుడు దెబ్బలు తినడానికీ సిద్ధంగా ఉండేవాడిని. హెల్మెట్ ప్రయత్నించినప్పుడు అసౌకర్యంగా అనిపించింది. నాకిచ్చిన మెరూన్ టోపీ ధరిచినప్పుడు గర్వంగా భావించేవాడిని. ఆడేందుకు నేను సరిపోతానన్న ఆలోచన ధోరణితో ఉండేవాడిని. ఒక వేళ నేను గాయపడితే అది దేవుడి దయతో క్షేమంగా బయటపడేవాడిని.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications