For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ISL 2020-21: దేశంలో ఆటలు షురూ.. నేటి నుంచే ఐఎస్‌ఎల్ ఏడో సీజన్.. హైదరాబాద్ ఈసారైనా!

ISL 2020-21: Kerala Blasters, ATK Mohun Bagan kick off a season
ISL 2020-21 : Kerala Blasters vs ATK Mohun Bagan | ISL season 7 Starts Today

పనాజీ: కరోనా దెబ్బకు అతలాకుతలమైన క్రీడాప్రపంచం నెమ్మదిగా గాడిలో పడుతోంది. వివిధ దేశాల్లో పలు క్రీడా ఈవెంట్లు పట్టాలెక్కుతున్నాయి. యూఏఈ వేదికగా ఇటీవలే ఐపీఎల్ 2020 సీజన్ సక్సెస్ ఫుల్‌గా పూర్తవ్వగా.. లాక్‌డౌన్ తర్వాత భారత్‌లో ఫస్ట్ మేజర్ టోర్నీకి రంగం సిద్దమైంది. ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) ఏడో సీజన్ షురూ అవుతోంది. కళ్లు చెదిరే ఫ్రీ కిక్‌లు... కళాత్మకమైన పాస్‌లు... మతి పోగొట్టే హెడర్స్‌... ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే డిఫెండర్ల విన్యాసాలతో అలరించేందుకు ఈ భారత ఫుట్‌బాల్ లీగ్ సిద్దమైంది. కరోనా నేపథ్యంలో కట్టు బాట్ల నడుమ బుడగలో కాలికి, బంతికి జరిగే ఈ పోరాటంలో గెలిచేందుకు 11 జట్లు రె'ఢీ' అయ్యాయి.

హైదరాబాద్ రాత మారెనా..?

హైదరాబాద్ రాత మారెనా..?

గోవాలోని మూడు మైదానాల్లో నాలుగు నెలల పాటు సాగే ఈ మెగా టోర్నీలో నేడు కేరళ బ్లాస్టర్స్, ఏటీకే మోహన్‌ బగాన్‌ మధ్య ఫస్ట్ మ్యాచ్‌ జరగనుంది. రాత్రి గం. 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌-1లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక టైటిల్‌ కోసం పోటీ పడే జట్ల సంఖ్య ఈ సారి పెరిగింది. లీగ్‌లోకి కొత్తగా స్పోర్టింగ్‌ క్లబ్‌ ఈస్ట్‌ బెంగాల్‌ వచ్చి చేరడంతో... జట్ల సంఖ్య 11కు చేరింది. టైటిల్‌ ఫేవరెట్లుగా డిఫెండింగ్‌ చాంపియన్‌ ఏటీకే మోహన్‌ బగాన్, మాజీ చాంపియన్‌ బెంగళూరు ఎఫ్‌సీ కనిపిస్తున్నాయి. తమ తొలి సీజన్‌ (2019-20)లో అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన కనబరచని హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ)... ఈ సారి మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదలతో ఉంది.

కొత్త కోచ్ పర్యవేక్షణలో..

కొత్త కోచ్ పర్యవేక్షణలో..

స్పెయిన్‌కు చెందిన మాన్యుయెల్‌ మార్కజ్‌ను తమ హెడ్‌ కోచ్‌గా కూడా నియమించింది. గత సీజన్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీ... రెండు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మే నెలలో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంఘాల సమాఖ్య (ఫిఫా) ప్రతిపాదించిన ‘ఐదుగురు సబ్‌స్టిట్యూట్‌' నిబంధన ఐఎస్‌ఎల్‌లో కొనసాగనుంది. దాంతో మ్యాచ్‌ మధ్యలో ఒక జట్టు గరిష్టంగా ఐదుగురు సబ్‌స్టిట్యూట్‌లను ఆడించవచ్చు. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో మూడు సందర్భాల్లో మాత్రమే వీరిని బరిలోకి దించాలి. అంతేకాకుండా సబ్‌స్టిట్యూట్‌ బెంచ్‌ను ఏడుగురి నుంచి తొమ్మిదికి పెంచారు.

హైదరాబాద్‌ ఎఫ్‌సీ జట్టు

హైదరాబాద్‌ ఎఫ్‌సీ జట్టు

గోల్‌ కీపర్లు: లాల్బియాక్లువా జోంగ్టే, లక్ష్మీకాంత్, మానస్‌ దూబే, సుబ్రతా పాల్‌.

డిఫెండర్లు: ఆకాశ్‌ మిశ్రా, ఆశిష్‌ రాయ్, చింగ్లెన్‌సనా సింగ్, డింపిల్‌ భగత్, కిన్‌సైలాంగ్‌ ఖోంగ్సిట్, నిఖిల్‌ ప్రభు, ఒడి ఒనైందియా, సాహిల్‌ పన్వార్‌.

మిడ్‌ ఫీల్డర్లు: అభిషేక్‌ హల్దార్, ఆదిల్‌ ఖాన్, సాహిల్‌ తవోరా, హలిచరన్‌ నర్జారీ, హితేశ్‌ శర్మ, జావో విక్టోర్, లల్దాన్‌మవియా రాల్టే, లూయిస్‌ సస్ట్రే, మార్క్‌ జొతాన్‌పుయా, మొహమ్మద్‌ యాసిర్, నిఖిల్‌ పూజారి, సౌవిక్‌ చక్రవర్తి, స్వీడెన్‌ ఫెర్నాండెస్‌.

ఫార్వర్డ్స్‌: సాంటాన, సాండ్రెజ్, ఇషాన్‌ డే, జోల్‌ చియానీస్, లాలాంపుయా, లిస్టన్‌ కొలాకో, రోహిత్‌ దను,

హెడ్‌ కోచ్‌: మాన్యుయెల్‌ మార్కజ్‌.

ఛీ ఛీ నాకు బాయ్ ఫ్రెండా?.. అల్లు అర్జున్ నా ఫేవరేట్ హీరో: మహిళా క్రికెటర్

Story first published: Friday, November 20, 2020, 8:02 [IST]
Other articles published on Nov 20, 2020
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+