Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఛీ ఛీ నాకు బాయ్ ఫ్రెండా?.. అల్లు అర్జున్ నా ఫేవరేట్ హీరో: మహిళా క్రికెటర్

Priya Punia says Allu Arjun is my favourite South Indian actor

న్యూఢిల్లీ: టాలీవుడ్ టాప్ హీరో, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫేవరేట్ సౌతిండియన్ హీరో అని భారత మహిళా క్రికెటర్ ప్రియా పునియా తెలిపింది. స్మృతి మంధాన తరహాలో అభిమానుల ఫాలోయింగ్‌ను అందుకున్న ఈ టాపార్డర్ బ్యాటర్.. ఇటీవల ముగిసిన మహిళల టీ20 చాలెంజ్ టోర్నీలో పాల్గొంది. తన ఆటతీరుతో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. మైదానంలో తన హవాభావాలతో అభిమానుల మనసులను దోచుకుంది. ఇక తన టీమ్ సూపర్ నోవాస్ ఫైనల్లో ఓడినప్పటికీ.. ప్రియా పూనియా సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తూనే ఉంది.

ఛీ ఛీ నాకు బాయ్ ఫ్రెండా?..

ఛీ ఛీ నాకు బాయ్ ఫ్రెండా?..

జైపూర్‌కు చెందిన ప్రియా పూనియా తాజాగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. గురువారం ఇన్‌స్టా వేదికగా ‘Ask Me Anything' సెషన్ నిర్వహించిన ప్రియా.. అభిమానులు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పింది. అయితే ఓ అభిమాని‘నీకు బాయ్ ఫ్రెండ్ ఉండా?'అని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ ప్రశ్నకు ఓ వీడియోను సమాధానంగా ఇచ్చిన ప్రియా.. అందులో ఛీ ఛీ బాయ్ ఫ్రెండా? అనే తరహాలో ఫేస్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

స్టైలిష్ స్టార్ అంటే ఇష్టం..

స్టైలిష్ స్టార్ అంటే ఇష్టం..

ఈ చిట్‌చాట్ సెషన్‌లోనే మరో అభిమాని ‘మీకు నచ్చే సౌత్ హీరో ఎవరో చెప్పండి'అని ప్రశ్నించగా.. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన ఫేవరేట్ అని బదులిచ్చింది. రాజస్థానీ అయిన తనకు రాజస్థాన్ స్పెషల్ అయిన చూర్మా లడ్డూ ఇష్టమైన ఫుడ్ అని పేర్కొంది. ఈ సెషన్‌లో తన సహచర ప్లేయర్ నుజ్‌హత్ పర్వీన్ అడిగిన ప్రశ్నకు కూడా ప్రియా పూనియా సమాధానమిచ్చింది. ప్రస్తుతం తమ హోమ్ టౌన్‌లోనే తదుపరి అసైన్‌మెంట్ కోసం ప్రియా సిద్దమవుతుంది.

 కోహ్లీ కోచ్ పర్యవేక్షణలోనే..

కోహ్లీ కోచ్ పర్యవేక్షణలోనే..

ఢిల్లీ నుంచి క్రికెట్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ప్రియా పూనియా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ శిక్షణలోనే క్రికెట్ ఓనమాలు నేర్చుకుంది. ఏడేళ్లపాటు ఆయన పర్యవేక్షణలోనే కోచింగ్ తీసుకున్న ఆమె.. అనంతరం జైపూర్‌కు వచ్చింది. దాంతో ప్రియా అనేక కష్టాలు ఎదుర్కొంది. కొత్త సిటీలో కనీస సౌకర్యాలు లేక తీవ్రంగా ఇబ్బందిపడింది. జాండీస్‌తో తీవ్ర అనారోగ్యానికి గురైంది. అనంతరం బొటన వేలు విరిగింది. కానీ ఇవేవి ప్రియాను అడకుండా అడ్డుకోలేకపోయాయి. 2018లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు భారత్ తరఫున 5 వన్డేలు, 3 టీ20లు ఆడింది.

నయా చాంపియన్..

నయా చాంపియన్..

మహిళల టీ20 చాలెంజ్‌ టోర్నీలో నయా చాంపియన్ అవతరించింది. స్మృతి మంధాన నేతృత్వంలోని ట్రయల్ బ్లేజర్స్ ఈ మహిళల ఐపీఎల్ 2020 టైటిల్‌ను సొంతం చేసుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్ నోవాస్‌తో జరిగిన టైటిల్ ఫైట్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ట్రయల్ బ్లేజర్స్ 16 పరుగులతో గెలుపొంది తొలిసారి టీ20 చాలెంజ్ టైటిల్ ముద్దాడింది. ఇక హ్యాట్రిక్ టైటిళ్లు అందుకోవాలనుకున్న హర్మన్ సేనకు నిరాశే ఎదురైంది.

సారీ వార్నర్.. నీ రెండో కూతురికి విరాట్ కోహ్లీ అంటేనే ఇష్టం: క్యాండీస్ వార్నర్

Story first published: Thursday, November 19, 2020, 14:46 [IST]
Other articles published on Nov 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+