Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అక్కడ ఫుట్‌బాల్ ఆట మొదలైంది

German football is the first in Europe to return to the pitch

బెర్లిన్‌: దాదాపు రెండు నెలల విరామం అనంతరం యూరప్‌లో తిరిగి ఫుట్‌బాల్‌ ఆట మొదలైంది. కరోనా వైరస్‌తో సహజీవనం తప్పదని గ్రహించిన ప్రపంచం సాధారణజీవితానికి అలవాటు పడుతోంది. క్రీడాలోకం కూడా అందుకు సిద్ధమైంది. అందులో భాగంగా పోటీలకు తెరలేస్తోంది. ఫుట్‌బాల్‌ ఈ జాబితాలో ముందువరుసలో నిలిచింది. కరోనా వైరస్ విజృంభణతో జర్మనీలో ఆగిపోయిన బుండెస్‌లిగా 2019-2020 సీజన్‌ శనివారం ప్రారంభమైంది.

దాంతో యూరప్‌లో ఆరంభమైన తొలి మేజర్‌ టోర్నీగా బుండెస్‌లిగా నిలిచింది. కరోనా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా ఆటగాళ్లను, సిబ్బందిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటామని జర్మనీ ఫుట్‌బాల్‌లీగ్‌ ప్రభుత్వానికి తెలిపింది. దీంతో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో బొరూసియా డార్ట్‌మండ్‌ 4-0తో షాల్క్‌ జట్టును చిత్తు చేసింది.

ఆ అరుపులు.. సంబరాల్లేవ్..

ఆ అరుపులు.. సంబరాల్లేవ్..

వేలాదిమంది ఫ్యాన్స్‌తో కిక్కిరిసే స్టేడియం. రకరకాల వాయిద్యాలతో హోరు. అభిమానుల అరుపులతో దద్దరిల్లే పరిసరాలు. వాటికి తోడుగా రెఫరీ విజిల్‌ చప్పుళ్లు. బంతికోసం ఆటగాళ్లు చేసే విన్యాసాలు. గోల్‌ కొట్టగానే ఒకరిపై ఒకరు పడుతూ చేసుకొనే సంబరాలు. సాకర్‌ మ్యాచ్‌ల్లో ఉండే మజాయే వేరు. కానీ ఇదంతా గతం.

శనివారంనాటి మ్యాచ్‌ ఫుట్‌బాల్‌ చరిత్రలోనే కొత్త అంకానికి నాంది పలికింది. సాధారణంగా అయితే బుండెస్లిగా పోరుకు 80 వేలమంది హాజరవుతారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా ఖాళీ స్టేడియం.. నిశ్శబ్ద వాతావరణం.. ఆటగాళ్ల అరుపులు, రెఫరీల విజిల్‌ కూతలు తప్ప మరేమీ వినిపించకుండా తాజా మ్యాచ్‌ సాగింది.

నిబంధనలు పాటిస్తూ..

నిబంధనలు పాటిస్తూ..

వైరస్‌ వ్యాప్తికి తావు లేకుండా నిర్వాహకులు పూర్తి జాగ్రత్త చర్యలు తీరసుకున్నారు. భౌతిక దూరం పాటిస్తూ మామూలుగా ఒక్క బస్సులోనే వచ్చే ఆటగాళ్లు వివిధ బస్సుల్లో స్టేడియానికి చేరుకున్నారు. గోల్‌ చేసిన అనంతరం ఒకరికొకరు హత్తుకోవడాన్ని నిషేధించారు. సబ్‌స్టిట్యూట్‌లు, కోచ్‌లు మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేశారు. మ్యాచ్‌లకు ముందు ప్రతి జట్టుకు వారం రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి చేశారు.

రూ. 2458 కోట్లే లక్ష్యం..

రూ. 2458 కోట్లే లక్ష్యం..

లీగ్‌ మొత్తాన్ని జూన్‌ 30నాటికి పూర్తి చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. తద్వారా రూ. 2458 కోట్ల టెలివిజన్‌ ప్రసార హక్కుల సొమ్మును రాబట్టాలని యోచిస్తున్నారు. లీగ్‌ ఆగిపోవడంవల్ల పలు క్లబ్బులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రసార హక్కుల డబ్బు అందితే క్లబ్బులు ఆర్థిక ఇక్కట్లనుంచి బయటపడే అవకాశముంది.

రోహిత్ భాయ్.. తిట్టని తిట్టూ తిట్టారు: బంగ్లాదేశ్ క్రికెటర్

Story first published: Sunday, May 17, 2020, 10:58 [IST]
Other articles published on May 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+