న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రికార్డుల రారాజు కోహ్లీకి ఏమైంది? గత 22 ఇన్నింగ్స్‌లుగా ఒక్క సెంచరీ లేదు!

Zero A Whole Bunch In 22 Innings Virat Kohli Enduring Worst Batting Run

హైదరాబాద్: రికార్డుల రారాజు, నిలకడకు మారుపేరైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. గత కొంత కాలంగా దారుణంగా విఫలమవుతున్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా చెలరేగే కోహ్లీ గత 22 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ తన మార్క్ పెర్ఫామెన్స్‌ను కనబర్చకపోయిన ఈ రన్ మెషిన్ తాజా ఆస్ట్రేలియా పర్యటనలో శుక్రవారం జరిగిన ఫస్ట్ వన్డేలోనూ నిరాశపరిచాడు. 21 పరుగులు మాత్రమే చేసి హజల్ వుడ్ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్ చేరాడు.

మైదానంలో అడుగుపెడితే బౌలర్లపై విరుచుకుపడుతూ సెంచరీల మోత మోగించే కోహ్లీ.. మూడు ఫార్మాట్లలో కలిపి గత 22 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సెంచరీ చేయలేదంటే ప్రతీ ఒక్కరిని ఆశ్యర్యానికి గురిచేస్తోంది. కరోనా బ్రేక్ ముందు భారత్ చివరిసారిగా ఆడిన న్యూజిలాండ్ పర్యటనలో విఫలమైన కోహ్లీ.. ఆసీస్ టూర్‌లోనూ ఆశించిన ఆరంభాన్ని అందుకోలేకపోయాడు.

 బంగ్లాపై చివరిసారిగా..

బంగ్లాపై చివరిసారిగా..

గతేడాది నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో కోల్‌కతా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డేనైట్ టెస్ట్‌లో చివరిసారిగా సెంచరీ సాధించిన ఈ రన్ మెషిన్.. ఆపై ఇప్పటివరకూ మరో శతకం సాధించలేదు. ఇక గత 11 ఇన్నింగ్స్‌ల్లో ఒకే హాఫ్ సెంచరీ సాధించిన విరాట్.. పరుగులు చేయడానికి అపోసోపాలు పడుతున్నాడు. ఇక కోహ్లీ గత 22 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో ఆరు హాఫ్‌ సెంచరీలు సాధించినా వాటిని సెంచరీలుగా మలచుకోలేకపోయాడు.

మూడోసారి మాత్రమే..

మూడోసారి మాత్రమే..

ఇలా 22 ఇన్నింగ్స్‌లకు పైగా మూడంకెల స్కోరు అందుకోకపోవడం కోహ్లీ కెరీర్‌లో ఇది మూడోసారి. 11 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ తొలిసారి 2011లో ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్‌ వరకు వరుసగా 24 ఇన్నింగ్స్‌ల్లో శతకం బాదలేదు. రెండోసారి 2014లో ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌ వరకు వరుసగా 25 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేయలేదు. ఈ క్రమంలోనే 2014లో ఇంగ్లండ్‌ పర్యటనలోనూ కోహ్లీ విఫలమయ్యాడు. అప్పుడు 5 టెస్టుల్లో మొత్తం 134 పరుగులే చేసి తన కెరీర్‌లో చేదు జ్ఞాపకాన్ని మూటగట్టుకున్నాడు.

మరో విషయం ఏంటంటే.. కోహ్లీ శతకం బాదలేక విఫలమైన ఈ మూడు సార్లు అతడి అర్ధ శతకాలు కూడా తక్కువే నమోదయ్యాయి. ప్రస్తుత సీజన్‌లో 19 ఇన్నింగ్స్‌ల్లో ఆరు అర్ధ శతకాలు సాధించిన అతడు 2014లోనూ అన్నే బాదాడు. ఇక 2011లో అయితే నాలుగు అర్ధ శతకాలతో సరిపెట్టుకున్నాడు.

వెస్టిండీస్ గడ్డపై చివరిసారిగా..!

వెస్టిండీస్ గడ్డపై చివరిసారిగా..!

ఇక అంతర్జాతీయ వన్డేల్లో ఇప్పటి వరకు 43 సెంచరీలు సాధించిన విరాట్ గత ఏడాదిన్నరగా ఒక్క శతకాన్ని కూడా నమోదు చేయలేకపోయాడు. చివరిసారిగా గతేడాది ఆగస్టులో తన 43వ వన్డే సెంచరీ నమోదు చేశాడు. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో విరాట్ కోహ్లీ (114; 99 బంతుల్లో 14×4) సెంచరీతో రాణించి భారత్ 2-0తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో ఆడిన విరాట్ మరో శతకాన్ని అందుకోలేకపోయాడు. న్యూజిలాండ్ పర్యటనలోనూ దారుణంగా విఫలమయ్యాడు. ప్రస్తుత ఆసీస్ పర్యటనలోనూ అదే తడబాటును కొనసాగిస్తున్నాడు.

చెలరేగిన స్మిత్, ఫించ్..

చెలరేగిన స్మిత్, ఫించ్..

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీసేన 66 పరుగులతో చిత్తుగా ఓడింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆరోన్‌ ఫించ్‌ ( 124 బంతుల్లో 9 ఫోర్లు, 2సిక్స్‌లతో 114), స్టీవ్ స్మిత్‌ (66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగగా.. డేవిడ్‌ వార్నర్‌ (76 బంతుల్లో 6ఫోర్లతో 69), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించారు. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ (3/59) మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, సైనీ, చాహల్ తలో వికెట్ తీశారు.

అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. హార్దిక్ పాండ్యా( 76 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 90), శిఖర్ ధావన్(86 బంతుల్లో 10 ఫోర్లతో 74) రాణించినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లలో జంపా నాలుగు, హజల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. స్టార్క్ ఓ వికెట్ తీశాడు.

India vs Australia: ప్చ్.. ఫస్ట్ వన్డేలో భారత్‌కు చుక్కెదురు.. ఆల్‌రౌండ్ షోతో ఆసీస్ ఘన విజయం!

Story first published: Friday, November 27, 2020, 19:38 [IST]
Other articles published on Nov 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X