Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ విషయంలో దాదా, ధోనీ ఒక్కటే: జహీర్‌ఖాన్

Zaheer Khan Says MS Dhoni was similar to Sourav Ganguly in the way they mentored young players

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్‌లు సౌర‌వ్ గంగూలీ, మ‌హేంద్ర‌సింగ్ ధోనీలో చాలా ద‌గ్గ‌రి పోలిక‌లున్నాయని.. యువ‌కుల‌కు అండ‌గా నిలిచే విష‌యంలో ఈ ఇద్ద‌రూ దాదాపు ఒకే విధంగా ఆలోచిస్తార‌ని టీమిండియా మాజీ పేస‌ర్ జ‌హీర్ ఖాన్ తెలిపాడు. కెరీర్ ఆరంభంలో త‌మ‌కు దాదా నుంచి ఎలాంటి మ‌ద్ద‌తు ల‌భించిందో.. ఆ త‌ర్వాతి త‌రానికి ధోనీ నుంచి అలాంటి స‌హ‌కార‌మే అందింద‌ని ఈ వరల్డ్‌కప్ విన్నింగ్ పేసర్ పేర్కొన్నాడు.

కెరీర్ ప్రారంభంలో..

కెరీర్ ప్రారంభంలో..

ప్ర‌తీ పదేళ్లకు ఒక‌సారి భార‌త క్రికెట్‌లో నాయ‌క‌త్వ మార్పు స‌హ‌జ‌మ‌ని.. జ‌హీర్ నొక్కి చెప్పాడు. ‘ఏ క్రికెటర్‌కైనా కెరీర్ మొదట్లో సీనియర్ల మద్దతు అవసరం. ముఖ్యంగా కెప్టెన్ల సహకారం చాలా ముఖ్యమైనది. వారి మద్దతుతోనే ఏ ఆటగాడైన తన కెరీర్‌ను మలుచుకుంటాడు. సీనియర్ల అండ ఆటగాడి ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది'అని జహీర్ పేర్కొన్నాడు.

ధోనీ కెప్టెన్సీ సూపర్బ్..

ధోనీ కెప్టెన్సీ సూపర్బ్..

‘గంగూలీ, ధోనీ ఇద్దరూ జ‌ట్టుకు చాలాకాలంపాటు భారత జట్టును నడిపించారు. ఇద్ద‌రిలో చాలా సారూప్య‌త‌లు ఉన్నాయి. కెరీర్ తొలినాళ్ల‌లో దాదా ఇచ్చిన మ‌ద్ద‌తు మ‌రువ‌లేను. అయితే ధోనీ చేతికి ప‌గ్గాలు వ‌చ్చిన‌ప్పుడు జ‌ట్టులో అంతా సీనియ‌ర్ ఆట‌గాళ్లు ఉన్నారు. అంత‌ర్జాతీయ స్థాయిలో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభ‌వం ఉన్న‌వాళ్ల‌ను ముందుకు న‌డిపించ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు.

కానీ ఒక్కొక్క‌రుగా సీనియ‌ర్లు త‌ప్పుకుంటుంటే.. అప్పుడు యువ ఆట‌గాళ్ల‌కు మార్గ‌నిర్దేశం చేసుకుంటూ జ‌ట్టును ముందుకు సాగించిన తీరు అద్భుతం. అచ్చం గంగూలీ‌లానే ధోనీ యువ ఆటగాళ్లకు మద్దుతగా నిలిచాడు. భార‌త క్రికెట్‌లో ప్ర‌తి ప‌దేండ్ల‌కు నాయ‌క‌త్వ మార్పు జ‌రుగుతుంది. సారథ్య బాధ్యతలు స్వీకరించిన ఆటగాడు జట్టును మరో స్థాయికి తీసుకెళ్తాడు`అని జ‌హీర్ అన్నాడు.

ఆ మహిళా క్రికెటర్‌తో డిన్నర్ చేయాలనుంది: భారత క్రికెటర్

ధోనీ సారథ్యంలో..

ధోనీ సారథ్యంలో..

ధోనీ సారథ్యంలోనే భారత్ 2011 ప్రపంచకప్ గెలిచి తన చిరకాల స్వప్నాన్ని నేరవేర్చుకుంది. ఇక 2014 ఆస్ట్రేలియా పర్యటనలో సిరీస్ మధ్యలోనే అంతర్జాతీయ టెస్ట్‌ల నుంచి అనూహ్యంగా తప్పుకొన్న ధోనీ.. పరిమిత ఓవర్లలో మాత్రం 2017 వరకు జట్టును నడిపించాడు. అనంతర కోహ్లీ సారథ్యానికి పర్యవేక్షుడిగా వెన్నంటే ఉంటూ అతని విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ అనంతరం ఆటకు దూరమైన మహీ.. ఐపీఎల్‌తో రీ ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. కానీ కరోనా పుణ్యమా ఆ క్యాష్ రిచ్ లీగ్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

Story first published: Thursday, April 16, 2020, 14:14 [IST]
Other articles published on Apr 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+