
జీవితాంతం ఆటలుండాలి..
ఈ చాట్ సెషన్‌లో ఆ టీమ్ ప్లేయరైన మురళీ విజయ్ పాల్గొని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. అలాగే ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం చాలా బోరింగ్‌గా ఉందని, కానీ విపత్కర పరిస్థితుల్లో లాక్‌డౌన్ నిబంధనలను పాటించడం తప్పా ఏం చేయలేమన్నాడు. బేసిగ్గా జీవితాంతం ఆటలు ఆడుతుండటమే తనకు కావాలని చెప్పుకొచ్చాడు.
ఈ లాక్‌డౌన్ వేళ క్రికెట్ ఆడటాన్ని మిస్సవుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఈ సమయానికి తాను చెన్నై మైదానంలో ఉండేవాడినని, కానీ పరిస్థితుల కారణంగా ఇంట్లో కూర్చోవాల్సి వచ్చిందన్నాడు. ఈ సంక్షోభం తర్వాత ఎదురయ్యే పరిస్థితులను అధిగమించడానికి సిద్దమవుతున్నట్లు తెలిపాడు.

ఎల్లిస్ పెర్రీ, ధావన్‌తో..
ఇద్దరు క్రికెటర్లతో డిన్నర్ చేయాలంటే ఎవరిని ఎంచుకుంటావని ఓ అభిమాని ప్రశ్నించగా.. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ, తన సహచర ఓపెనర్ శిఖర్ ధావన్ పేర్లను విజయ్ సూచించాడు.
‘ఎల్లిస్ పెర్రీతో డిన్నర్ చేయాలనుంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఇక ఎప్పుడైన శిఖర్ ధావన్‌తో ఒకే. అతను చాలా సరదా మనిషి. సాధారణంగానే అతను హిందీలో మాట్లాడితే.. నేను తమిళంలోకి అనువదిస్తా.'అని విజయ్ పేర్కొన్నాడు.
25 ఏళ్ల క్రితం క్రికెట్ చరిత్రలో ఇదే రోజు అజారుద్దీన్ అదరగొట్టిన వేళ!!

ఫెవరేట్ ఓపెనర్ సెహ్వాగ్..
తనకిష్టమైన పార్ట్‌నర్ మాత్రం మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అని విజయ్ చెప్పుకొచ్చాడు. ‘నా ఫేవరెట్ బ్యాటింగ్ భాగస్వామి వీరేంద్ర సెహ్వాగ్. అతనితో ఆడితే అటోమెటిక్‌గా పరుగులు చేస్తాం. వసీం జాఫర్, గౌతం గంభీర్‌లతో సెహ్వాగ్ నా అభిమాన ఓపెనర్. ఈ ముగ్గురు దిగ్గజాలే. వారిని నేను అనుసరిస్తుంటా. ఇక సెహ్వాగ్‌తో డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకోవడం నాకు దక్కిన గొప్ప అవకాశం.'అని ఈ టీమిండియా టెస్ట్ ఓపెనర్ చెప్పుకొచ్చాడు.

ధోనీతో ఆ అనుభవాన్ని వర్ణించలేం..
మహేంద్ర సింగ్ ధోనీతో ఉన్న బ్యాటింగ్ అనుభవాన్ని మాటల్లో వర్ణించలేమన్నాడు. అతని ప్రశాంత తత్వం తనను ప్రభావితం చేసిందన్నాడు. 2014లో ఇంగ్లండ్ పర్యటనలో ధోనీతో పలు భాగస్వామ్యాలు నెలకొల్పానని విజయ్ గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా ట్రెంట్ బ్రిడ్జ్ టెస్ట్‌లో తాము నెలకొల్పిన 126 పరుగుల భాగస్వామ్యం అద్భుతమన్నాడు.
‘ఇంగ్లండ్‌లో ధోనీతో నేను నెలకొల్పిన భాగస్యామ్యం అసాధరణమైంది. అతను నన్ను కూల్‌గా మార్చాడు. నాలుగు వికెట్లు కోల్పోయిన స్థితిలో కూడా అతను ప్రశాంతంగా ఉన్న విధానం నన్ను మరింతగా ఆడేలా చేసింది. ధోనీ తన సొంత ఆలోచనలతో మైదానంలోకి వస్తాడు. ఆడుతున్నప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడడు. కేవలం కళ్ల సైగలతోనే కాంటాక్ట్ చేస్తాడు.'అని విజయ్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












