కంగ్రాట్స్ కాక.. విరాట్ కోహ్లీ-అనుష్క జోడీకి క్రిస్ గేల్ విషెస్!

న్యూఢిల్లీ: తండ్రి కాబోతున్నానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. తన సతీమణి, బాలీవుడ్ హీరోయిన అనుష్క శర్మ గర్భం దాల్చిందని ట్వీట్ చేసిన విరాట్.. ' 2021 జనవరిలో మేం ముగ్గురం కాబోతున్నాం'అనే క్యాప్షన్‌తో అనుష్కశర్మతో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ఈ ట్వీట్ ప్రకారం ప్రస్తుతం అనుష్కకు 5వ నెల అని తెలుస్తోంది. ఈ వార్తతో విరాట్ అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. విరాట్-అనుష్క జోడీకి అభినందనలు తెలుపుతున్నారు.

గేల్ తనదైన శైలిలో..
క్రికెట్ ప్రపంచం కూడా విరుష్క జోడీకి అభినందనలు తెలుపుతుంది. సోషల్ మీడియా వేదికగా మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు విరాట్ కంగ్రాట్స్ చెబుతున్నారు. అలాగే సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా విరుష్క జోడీకి విషెస్ తెలిపారు. అయితే వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ చెప్పిన విషెస్ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇండియన్ స్టైల్లో ‘కంగ్రాట్చ్యూలేషన్స్ కాక'అని సింపుల్ కామెంట్‌తో విరుష్క జోడికి గేల్ అభినందనలు తెలిపారు. ఈ ఇన్‌స్టా కామెంట్ స్క్రీన్ షాట్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది.
అన్నా, వదినమ్మకు..
ఇక బీసీసీఐ, హర్భజన్ సింగ్‌తో భారత ఆటగాళ్లంతా విరాట్‌కు అభినందనలు తెలిపారు. యుజువేంద్ర చహల్ కూడా తనదైన శైలిలో విరాట్ భాయ్, వదినమ్మకు కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశాడు. కోహ్లీకి మరింత పాజిటీవ్ ఎనర్జీ వచ్చిందని, అతన్ని ఐపీఎల్‌లో ఆపడం కష్టమంటూ పియూష్ భగత్ కామెంట్ చేశాడు. శుభవార్తతో చాలా ఉత్సాహంగా ఉన్నామని ఆర్సీబీ ట్వీట్ చేసింది. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మలతో పాటు భారత యువ ఆటగాళ్లంతా విరుష్కకు అభినందనలు తెలిపారు.
ఫన్నీ మీమ్స్..
ఇక అనుష్క శర్మ తల్లి కావడంపై కొందరూ జోకులు పేల్చుతున్నారు. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. అత్యుత్సాహంలో కొన్ని మీడియా చానెళ్లు చేసిన తప్పులను కూడా ప్రస్తావిస్తున్నారు. విరాట్ చెప్పిన శుభవార్తతో భారత ప్రజలంతా ఉత్సవాలు చేసుకోవడానికి సిద్దమవుతున్నారని ఒకరంటే.. జూనియర్ కోహ్లీకి వాళ్ల డాడీ ఐపీఎల్ టైటిల్ గెవలేడని గ్రహిస్తాడని ఇంకొకరు కామెంట్ చేసారు. చోటా కోహ్లీ ఆగయా అని ఇంకొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ రోజు సోషల్ మీడియా కోహ్లీ తండ్రి కావడమే హాట్ టాపిక్‌గా ఉంది.
ఆ స్ట్రాటజీతోనే ధోనీని బోల్తా కొట్టించి.. 2011 ప్రపంచకప్‌లో గెలిచాం: సౌతాఫ్రికా మాజీ అనలిస్ట్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications