కోహ్లీ భయ్యా.. నేనెక్కడ నీ ప్లేస్ కొట్టేస్తానోనని భయపడతున్నావా: చహల్

బెంగళూరు: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అద్భుత బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఈ బెంగళూరు ఆటగాడు తనదైన ముద్ర వేసాడు. అద్భుత ఆటతీరుతో జట్టులో స్థిరంగా కొనసాగుతున్నాడు. ఆటలో ఎంతో వైవిధ్యం కనబరుస్తాడో.. తన చేష్టలతోను అంతే సరదాగా ఉంటాడు. మైదానంలో తన హడావుడితో సహచర ఆటగాళ్లను ఆటపట్టిస్తుంటాడు.

వదినా నువ్వన్నా చెప్పు..
బౌలర్‌గా ఎన్నో కీలక వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన చహల్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం మాత్రం చాలా తక్కువగా వచ్చింది. 94 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతను కేవలం 13 సార్లు మాత్రమే బ్యాటింగ్ చేశాడు. అయితే గత కొంతకాలంగా సరదాగా తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చలని కోరుతున్నాడు. తనలో గొప్ప బ్యాట్స్‌మన్ ఉన్నాడని, టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు పంపితే దుమ్మురేపుతానని ఫన్నీగా తరచూ చెప్పే చహల్.. ఈ విషయంలో కోహ్లీ సతీమణి అనుష్క శర్మ రికమండేషన్‌కు సైతం ప్రయత్నించాడు. `వదినా నువ్వన్నా చెప్పు.. నీ మాట కోహ్లీ వింటాడు. నా బ్యాటింగ్ ఆర్డర్ ముందుకు మార్చమను'అని కోరాడు.
చహల్ బ్యాటింగ్ కూడా చేయగలడు..
తాజాగా తన ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. చహల్ బ్యాటింగ్ స్కిల్స్ గురించి తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అప్పుడెప్పుడో 2008-09 కూచ్ బెహర్ ట్రోఫీలో చహల్ సెంచరీ చేసిన విషయాన్ని ఆర్సీబీ గుర్తు చేసింది. హిమాచల్ ప్రదేశ్ అండర్-19 జట్టుపై చాహల్ 135, 46 పరుగులు చేశాడని పేర్కొంది. ఆ సీజన్‌లో బ్యాట్‌తో మెరిసిన చహల్.. మొత్తం 281 పరుగులు చేశాడని, అతడి బ్యాటింగ్ ఆర్డర్ ముందుకు జరపాల్సిందేనని పేర్కొంది.

కోహ్లీ చురక..
ఈ పోస్ట్ పై స్పందించిన చహల్ ‘కోహ్లీ భయ్యా.. నేనెక్కడ నీ నెంబర్ 3 ప్లేస్‌ను ఆక్రమిస్తాననో భయడుతున్నావ్ కదా? అని ట్వీట్ చేశాడు. ఇక ఆర్సీబీ పోస్ట్‌కు స్పందించిన కోహ్లీ.. ‘చహల్.. ఆ పరుగులు చేసింది ఎగ్జిబిషన్ మ్యాచ్ అయ్యుంటదని'వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కరోనాతో ఇంటికే పరిమితమైన చహల్.. సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నాడు. తొలుత టిక్‌టాక్ వీడియోలతో టైంపాస్ చేసిన ఈ లెగ్ స్పిన్నర్..ఇప్పుడు సహచర ఆటగాళ్ల లైవ్‌సెషన్స్‌లను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. రోహిత్-బుమ్రా, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ ఇలా చాలా మంది క్రికెటర్ల లైవ్ సెషన్స్ మధ్యల దూరిపోయి చివాట్లు తిన్నాడు.
అప్పులు తీర్చాలంటే ఆటంబాంబు అమ్ముకోవాలి: పాకిస్థాన్ మాజీ క్రికెటర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications