Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కశ్మీర్ ఎప్పటికీ మాదే.. అఫ్రిదికి యూవీ, ధావన్ కౌంటర్!

Yuvraj Singh, Shikhar Dhawan Condemn Shahid Afridis Remarks on PM Modi

న్యూఢిల్లీ: కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన అనుచిత వ్యాఖ్యలను భారత క్రికెటర్లు తిప్పికొడుతున్నారు. ఇప్పటికే టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్, సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ గట్టి కౌంటర్ ఇవ్వగా.. తాజాగా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, ఓపెనర్ శిఖర్ ధావన్ అఫ్రిది వ్యాఖ్యలపై మండిపడ్డారు. అఫ్రిది కామెంట్స్ చాలా బాధించాయని యూవీ ట్వీట్ చేయగా.. కశ్మీర్ ఎప్పటికీ మాదేనని గబ్బర్ స్పష్టం చేశాడు.

కరోనా బాధితులకు తన స్వచ్చంద సంస్థ ద్వారా సాయం చేస్తున్న అఫ్రిది ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటించాడు. అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాకిస్థాన్ సైన్య బలగం ఎంత ఉందో.. అంతమంది భారత సైనికులను మోదీ కశ్మీర్‌లో మోహరించారని, అతని మనసులో కరోనాను మించిన వ్యాధి ఉందని విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేయడంతో అఫ్రిదిపై భారత్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

అఫ్రిది.. అంగీకరంచను..

అఫ్రిది.. అంగీకరంచను..

‘గౌవరనీయులైన మన ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై అఫ్రిది చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా బాధించాయి. బాధ్యాతాయుతమైన భారతీయుడిగా.. దేశం తరఫున ఆడిన ఆటగాడిగా అఫ్రిది.. ఇలాంటి వ్యాఖ్యలు ఏమాత్రం అంగీకరించను. మానవత్వం కోసం నీవు అడగ్గానే నా వంతు సాయం చేశా. కానీ మరోసారి చేయను'అని యూవీ ట్వీట్ చేశాడు.

 లక్షమందితో సమానం..

లక్షమందితో సమానం..

అఫ్రిది వ్యాఖ్యలపై ధావన్ ఘాటుగా స్పందించాడు. ‘ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఈ సమయంలో కూడా కశ్మీర్ సమస్యను లేవనెత్తినందుకు సిగ్గుండాలి. కశ్మీర్ ఒకప్పుడు మాదే. ఇప్పుడూ మాదే. భవిష్యత్తులోనూ మాదే. 22కోట్ల మంది సైన్యాన్ని తీసుకొచ్చినా సరే. మా వాళ్లు ఒక్కొక్కరు లక్షమంది సైన్యంతో సమానం. మిగతా లెక్కలు మీరే చేసుకోండి'అని ధావన్ ట్వీట్ చేశాడు.

అఫ్రిదితో కటీఫ్..

అఫ్రిదితో కటీఫ్..

అఫ్రిది చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని, అవి ఏమాత్రం ఆహ్వానించదగినవు కావని హర్భజన్ ఇండియా టూడేతో మాట్లాడుతూ అన్నాడు. ‘మా దేశం గురించి, ప్రధాని గురించి అఫ్రిది చేసిన వ్యాఖ్యలు బాధించాయి. అతని కామెంట్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నా. అవి ఏమాత్రం ఆహ్వానించదగినవు కావు. అతను మా సహాయం కోరినప్పుడు మేము ఏదీ ఆలోచించకుండా ముందుకు వచ్చాము. మానవత్వంతో స్పందించాం. కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతున్నవారికి సాయం చేయాలని అలా చేశాం.

మా ప్రధాని కూడా కరోనా వైరస్‌కి దేశం, కులం, మతం ఏదీ లేదని చెప్పారు. కాబట్టి మేము సంక్షోభాన్ని అధిగమించేందుకే అఫ్రిదికి సాయంగా నిలిచాం. ఈ సంక్షోభంలో మా వంతు సహాయాన్ని మేము అందించాం. కానీ ఈ మనిషి(అఫ్రిది) మా దేశం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడే చెబుతున్నా.. అతనితో మాకెలాంటి సంబంధం లేదు. మా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు అతనికి ఏ మాత్రం లేదు. అతను తన హద్దుల్లో తన దేశంలో ఉంటే బాగుంటుంది' అని భజ్జీ ఫైర్ అయ్యాడు. ఇక అఫ్రిది ఫౌండేషన్‌కు విరాళాలు ఇవ్వాలని హర్భజన్, యువరాజ్ సింగ్ భారత అభిమానులను కోరి విమర్శలపాలయ్యారు. అఫ్రిది తాజా వ్యాఖ్యలతో భారత నెటిజన్లు వీరిపై మరోసారి మండిపడుతున్నారు. మన డబ్బుతో మనకే ఎసరు పెడుతున్నాడని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు.

 అఫ్రిది, ఇమ్రాన్, బాజ్వా జోకర్లు..

అఫ్రిది, ఇమ్రాన్, బాజ్వా జోకర్లు..

అఫ్రిది అనుచిత వ్యాఖ్యలపై గంభీర్ ట్విటర్ వేదికగా మండిపడ్డాడు. అఫ్రిది, ఇమ్రాన్ ఖాన్, బాజ్వా లాంటి జోకర్లు భారత్‌కు, మోదీకి వ్యతిరేకంగా విషం చిమ్ముతున్నారని గంభీర్ వ్యాఖ్యానించాడు. ‘పాకిస్థాన్‌కు 7 లక్షల సైన్యం, 20 కోట్ల జనాభా ఉందని అఫ్రిది 16 ఏళ్ల పిల్లాడిలా మాట్లాడుతున్నాడు. ఆ దేశం గత 70 ఏళ్లుగా కశ్మీర్‌ కోసం బిచ్చమెత్తుకుంటోంది. అఫ్రిది, ఇమ్రాన్ ఖాన్, బాజ్వా లాంటి జోకర్లు భారత్‌కు, మోదీకి వ్యతిరేకంగా విషం చిమ్ముతూ పాక్ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు. కానీ జడ్జ్‌మెంట్ డే వరకూ కశ్మీర్ పాక్‌కు దక్కదు. బంగ్లాదేశ్ గుర్తుంది కదా?' అని 1971 యుద్దాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ గంభీర్ ఘాటుగా ట్వీట్ చేశాడు.

కోహ్లీ పద్దతి మార్చుకో.. అతనేం వాటర్ బాయ్ కాదు: కైఫ్

Story first published: Monday, May 18, 2020, 9:36 [IST]
Other articles published on May 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+