For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రైనా అంటే ధోనీకి ఇష్టం.. ఆ టైమ్‌లో నన్ను అనుమానించారు: యూవీ

Yuvraj Singh Says Every captain has a favourite player, MS Dhoni really backed Suresh Raina
Yuvaraj Singh-They Checked My Bat And Insulted Me During World Cup 2007

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సురేశ్ రైనా అంటే చాలా ఇష్టమని సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. ప్రతీ కెప్టెన్‌కు జట్టులో ఓ అభిమాన ఆటగాడు ఉంటారని ఈ సిక్సర్ల సింగ్ చెప్పుకొచ్చాడు. దీంతోనే 2011 ప్రపంచకప్ సమయంలో రైనాను తుది జట్టులోకి తీసుకోవడానికి ధోనీ ఇబ్బంది పడ్డాడని గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూవీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2007 ప్రపంచకప్ సమయంలో తన బ్యాట్‌పై అందరూ అనుమానం వ్యక్తం చేశారన్నాడు.

బ్యాట్‌పై అనుమానం..

బ్యాట్‌పై అనుమానం..

2007 టీ20 ప్రపంచకప్‌ లీగ్ దశలో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఫలితంగా 12 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ నమోదైంది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో యూవీ 30 బంతుల్లో 70 పరుగులు చేసి భారత ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ సమయంలో తన బ్యాట్‌పై నాటి ఆస్ట్రేలియా కోచ్‌, ప్లేయర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అనుమానం వ్యక్తం చేశారని యూవీ గుర్తు చేసుకున్నాడు.

ఆ రెండు బ్యాట్లు ప్రత్యేకం..

ఆ రెండు బ్యాట్లు ప్రత్యేకం..

‘నాటి ఆస్ట్రేలియా కోచ్ నా దగ్గరకు వచ్చి బ్యాట్‌లో ఏమైనా ఫైబర్ ఉందా? అది లీగలేనా? మ్యాచ్ రిఫరీ పరిశీలించవచ్చా ? అని ప్రశ్నించాడు. నేను కూడా అనుమానం ఉంటే చెక్‌చేసుకొండి అని చెప్పా. ఆఖరికి గిల్‌క్రిస్ట్ కూడా మా బ్యాట్లు ఎవరు తయారు చేస్తారని ప్రశ్నించాడు. మ్యాచ్ రిఫరీ కూడా నా బ్యాట్ పరీక్షించాడు. వాస్తవానికి ఆ బ్యాట్ నాకెంతో ప్రత్యేకం. నేనెప్పుడూ అలాంటి బ్యాట్‌తో ఆడలేదు. అది, 2011 ప్రపంచకప్ బ్యాట్ నాకు చాలా ప్రత్యేకమైనవి'అని యూవీ చెప్పుకొచ్చాడు.

రైనా కోసం ఇబ్బంది పడ్డ ధోనీ..

రైనా కోసం ఇబ్బంది పడ్డ ధోనీ..

ఇక 2011 ప్రపంకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్.. ఆ సమయంలో తుది జట్టును ఎంపిక చేయడానికి ధోనీ తెగ ఇబ్బంది పడ్డాడని గుర్తు చేసుకున్నాడు.

‘ప్రతీ కెప్టెన్‌కు జట్టులో అభిమాన ఆటగాడు అంటూ ఒకరుంటాడు. ప్రపంచకప్‌-2011 సమయంలో ధోని మద్దతు అందరికన్నా రైనాకు ఎక్కువగా ఉంది. యూసఫ్‌ పఠాన్‌ నిలకడగా రాణిస్తుండటం, ఆల్‌రౌండర్‌ కోటాలో నేను ఫామ్‌లో ఉండటం, అదే సమయంలో రైనా ఫామ్‌లో లేకపోవడంతో తుదిజట్టును ఎంపిక చేయడం ధోనికి తలకుమించిన భారం అయింది. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ జట్టులో లేకపోవడంతో నన్ను జట్టులోకి తీసుకోవడం అనివార్యం అయింది. ఇక పఠాన్‌ను లీగ్‌ మ్యాచ్‌ల్లో ఆడించినా అంతగా ఆకట్టుకోకపోవడంతో అతడిని తప్పించి రైనాకు అవకాశం కల్పించారు.' యూవీ గుర్తు చేసుకున్నాడు.

వామ్మో ర్యాపిడ్ ఫైరా?.. అదెప్పుడు నా కొంపముంచుతుంది : కేఎల్ రాహుల్

నాకిష్టమైన కెప్టెన్ గంగూలీనే..

నాకిష్టమైన కెప్టెన్ గంగూలీనే..

ఇక ఎప్పటికీ తనకు ఇష్టమైన సారథి సౌరవ్ గంగూలీనేనని యువరాజ్ మరోసారి స్పష్టం చేశాడు. జట్టులో ఇతర క్రికెటర్ల కన్నా ఎక్కువగా దాదా తనకు మద్దతు ఇచ్చేవాడని తెలిపాడు. ‘సౌరవ్ గంగూలీ నా అభిమాన కెప్టెన్. భారత సారథుల అందరిలో అతను నాకు చాలా మద్దతు ఇచ్చాడు. దాదా యువ ప్రతిభను ప్రోత్సహించాడు. జట్టును బలోపేతం చేయడానికి టాలెంట్ కలిగిన నలుగరైదుగురిని జట్టులోకి తీసుకొచ్చాడు.'అని యూవీ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, April 19, 2020, 15:52 [IST]
Other articles published on Apr 19, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+