మయాంక్‌తో లైవ్ సెషన్..
ఇక శనివారం 28వ పుట్టినరోజు జరుపుకున్న ఈ మిడిలార్డర్ కమ్ టాపార్డర్ కమ్ వికెట్ కీపర్.. ఈ సందర్భంగా తన సహచర ఆటగాడు మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ లైవ్ సెషన్‌లో మయాంక్ అడిగిన పలు ప్రశ్నలకు రాహుల్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. ముఖ్యంగా తన కెరీర్‌లోనే ఓ మాయని మచ్చగా మిగిలిపోయిన కాఫీ విత్ కరణ్ షో వివాదాన్ని గుర్తు చేసుకోని నవ్వులు పూయించాడు.
లైవ్ సెషన్‌లో భాగంగా మయాంక్.. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అని రాహుల్‌కు తెలియజేశాడు. దీనికి రాహుల్..‘ఈ ర్యాపిడ్ ఫైర్ ఎప్పుడూ నా కొంప ముంచుతందని నీకు తెలుసు. ఈ రౌండ్ ఫైర్‌లో నేను కాలిపోతాను'అని కరణ్ జోహర్ షో వివాదాన్ని గుర్తు చేసుకొని ఫన్నీగా బదులిచ్చాడు. ఈ సమాధానం విన్న మయాంక్ పడిపడి నవ్వుకున్నాడు.

బ్రో.. నీ లక్కీ చార్మ్ గురించి చెప్పవా..
రాహుల్ ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ప్రశ్నతో అతన్ని ఇరుకున పడేయాలని మయాంక్ భావించాడు. ‘రాహుల్ .. ఒకసారి ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌కు నీ లక్కీ చార్మ్ వచ్చిందన్నావు.. అసలు ఆ మ్యాటరేంటి?'అని మయాంక్ ప్రశ్నించగా.. అలాంటివి నేనెప్పుడు మాట్లాడ లేదు బ్రో'అని రాహుల్ సమాధానమిచ్చాడు. అయితే అతియా చూసిన మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకొని మయాంక్ ఈ ప్రశ్న అడిగాడు. కానీ రాహుల్ చాలా తెలివిగా సమాధానమిచ్చాడు.

మహిళలను కించపరిచే వ్యాఖ్యలు..
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘కాఫీ విత్ కరణ్' షోకి హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వెళ్లారు. హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ కరణ్ జోహార్ గురించి అడగ్గా.. తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు. రాహుల్ కూడా తన జేబులో కండోమ్ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి ‘ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు' అంటూ ప్రశంసించాడని వివాదాస్పదరీతిలో చెప్పుకొచ్చాడు.
మహిళలను కించపరిచే విధంగా ఉన్న ఈ వ్యాఖ్యల పట్ల అప్పట్లో తీవ్ర దూమారం రేగింది. కుర్రాళ్లకు ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలా వ్యవహరించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో బీసీసీఐ వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు కొన్నాళ్లు నిషేధం కూడా విధించింది

అతియా బర్త్‌డే విషెస్..
కేఎల్ రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా అతని గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి 'హ్యాప్పీ బర్త్‌డే మై డియర్' అని విషెచేసింది. పైగా దీనికి లవ్ ఎమోజీని కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వీరీ లవ్ ఎఫైర్ మరోసారి హాట్ టాపిక్ అయింది. గత సంవత్సరం అతియా శెట్టి బర్త్‌డే సందర్భంగా రాహుల్ ఆమెకు విషెస్ చెప్పడంతో.. వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందనే ప్రచారం ఊపందుకుంది. వీరు కూడా బాహటంగానే చెట్టాపట్టాలేసుకొని తిరగడం ఈ రూమర్స్‌కు బలాన్ని చేకూర్చుంది.


Click it and Unblock the Notifications
