Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువరాజ్‌‌కు ఇచ్చిన ఎన్ఓసీనే ఆఖరిది: ఆటగాళ్ల ఆశలపై నీళ్లు!

 Yuvraj Singhs Case An Aberration, No NOCs For Indians To Play T20 Leagues

హైదరాబాద్: విదేశాల్లో జరిగే టీ20 లీగ్‌లలో ఆడేందుకు భారత క్రికెటర్లకు ఇకపై నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ (ఎన్ఓసీ) ఇవ్వబోమని సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ(సీఓఏ) తెలిపింది. ఈ విషయంపై సీఓఏలో చర్చ జరిగిందని, అయితే కెనడా గ్లోబల్‌ టీ20 లీగ్‌లో పాల్గొన్న యువరాజ్‌ సింగ్‌కు ఇచ్చిన ఎన్ఓసీనే ఇక ఆఖరిదని తేల్చి చెప్పింది.

బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ

బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ

దీనిపై బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ "యువీకి ఎన్‌ఓసీ ఇచ్చాం. ఇక్కడితోనే సరిపెట్టాలనుకుంటున్నాం. ఇకపై ఏ భారత క్రికెటర్‌ విదేశీ లీగ్‌లో ఆడేందుకు ఎన్‌ఓసీ ఇవ్వబోం" అని అన్నారు. సీఓఏ నిర్ణయంపై బసీసీఐ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయంపై నిలకడతత్వం ఉండాలని వ్యాఖ్యానించారు.

ఇంటర్వ్యూకు హాజరైన సింగ్, హెసన్‌: టీమిండియా కోచ్ ఎవరో తెలిసేది అప్పుడే!

ఆటగాళ్ల రిటైర్మెంట్‌పై ఏకపక్ష నిర్ణయాలు

ఆటగాళ్ల రిటైర్మెంట్‌పై ఏకపక్ష నిర్ణయాలు

ఆటగాళ్ల రిటైర్మెంట్‌పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. టీమిండియాలో రిటైర్మెంట్ దశలో ఉన్న పలువురు క్రికెటర్లు టీ20లీగ్‌లలో ఆడాలనుకుంటున్నారని, మరికొందరు మాజీలు కూడా అందుకు సిద్ధమయ్యారని ఇలాంటి సమయంలో సీఓఏ నిర్ణయం వారి ఆశలపై నీళ్లు చల్లిందని తెలిపారు.

బోర్డులో సరైన పాలక వ్యవస్థ లేకపోతే

బోర్డులో సరైన పాలక వ్యవస్థ లేకపోతే

బోర్డులో సరైన పాలక వ్యవస్థ లేకపోతే ఇలాంటి అనుచిత నిర్ణయాలే వస్తాయని తెలిపారు. ఇంకో అధికారి మాట్లాడుతూ "రిటైర్మెంట్‌ అనేది ప్రపంచవ్యాప్తంగా జరగేది. ఒక దేశానికి రిటైర్‌ అయినంత మాత్రాన మొత్తం భౌగోళిక ప్రాంతానికి రిటైర్మెంట్‌ ప్రకటించినట్లు కాదు. రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్లను అనుమతించాలా వద్దా అనేది నిర్వాహకుల ఇష్టం" అని అన్నారు.

ఏంటా షాట్ సెలక్షన్? పంత్ ఓవర్‌రేటెడ్ ప్లేయర్: నెటిజన్ల ఆగ్రహం

ఏమైన సమస్య ఉంటే

ఏమైన సమస్య ఉంటే

"ఇందులో ఏమైన సమస్య ఉంటే ఐసీసీ చూసుకుంటుంది. కానీ మనమే ఆడించకుండా నిర్ణయం తీసుకోవడం అవివేకం" అని అన్నారు. అయితే ఒక ఆటగాడికి అనుమతులు ఇచ్చి తర్వాత మిగతావాళ్లకి ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కచ్చితంగా తప్పు అవుతుందంని ఆయన అన్నారు. యువీ విషయంలో మాత్రం సీఓఏ మినహాయింపు ఇచ్చిందని, అలా ఎందుకు చేశారో కచ్చితంగా విచారించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Story first published: Friday, August 16, 2019, 15:16 [IST]
Other articles published on Aug 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+