
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇన్ని రోజులు వరుస ఇన్‌స్టా లైవ్ సెషన్స్‌లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన కెరీర్‌కు సంబంధించిన మస్త్ ముచ్చట్లు పంచుకొని ప్రతీ రోజు వార్తల్లో నిలిచిన ఈ సిక్సర్ల సింగ్ తాజాగా ఓ సరికొత్త చాలెంజ్‌తో ముందుకొచ్చాడు. 'కీప్ ఇట్ అప్' పేరిట బ్యాట్‌ను అడ్డంగా తిప్పి బంతిని కొడుతూ ఓ కొత్త సవాల్‌కు శ్రీకారం చుట్టాడు. ఇలా బంతిని కింద పడకుండా పలుమార్లు కొట్టిన యూవీ.. ఈ చాలెంజ్‌ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్‌లు స్వీకరించాలని వారి పేర్లను నామినేట్ చేశాడు.
అయితే బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ఇది చాలా సులువని, అలాగే రోహిత్ కూడా ఈజీగానే చేయవచ్చన్నాడు. కానీ భజ్జీకి మాత్రం ఇది చేయడం చాలా కష్టమని, తన వల్ల కాదని ప్రత్యేకంగా చెప్పాడు. 'ఈ చాలెంజింగ్ టైమ్స్‌లో ఇంట్లోనే ఉంటూ.. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని కమిట్ అయ్యాను. దానికి ఈ కీప్ ఇట్ అప్ చాలెంజ్ అవసరమని భావించా. సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, హర్బజన్ సింగ్‌లు ఈ చాలెంజ్ స్వీకరించాలని కోరుతున్నా.' ఆ చాలెంజ్ వీడియోను జత చేశాడు.
ఇటీవల స్పోర్ట్స్ స్క్రీన్ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడిన యూవీ.. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఓటమిని గుర్తు చేసుకుంటూ ఆసమయంతో అందరూ తనను ఓ నేరస్థుడిగా చూశారని పేర్కొన్న విషయం తెలిసిందే. '2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి నేను పూర్తిగా బాధ్యత వహిస్తున్నా. ఆరోజు అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఆ మ్యాచ్ తర్వాత చాలా రోజులు నిద్రలేని రాత్రులు గడిపా.
నేను ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టినప్పుడు మీడియా కళ్లన్నీ నామీదే ఉన్నాయి. వారంతా గట్టిగా అరుస్తున్న సమయంలో.. నా చెవిలో హెడ్‌ఫోన్స్ పెట్టుకుని అక్కడి నుంచి బయటపడ్డా. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అందరూ ఒక నేరస్తుడిలా చూశారు. నా ఇంటి మీద రాళ్లతో కూడా దాడి చేశారు. కానీ వారు చేసిన పని చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఆ క్షణం నాకు నేను అభిమానుల ఆశను మోసం చేసిన నేరస్తుడిలా కనిపించాను.'యూవీ బాధపడ్డాడు.
చహల్.. నా గిటార్ నీ అంత ఉంటుంది: కోహ్లీ