యూవీ పా.. ఈ వివాదస్పద ప్రశ్నలేంది.. నేను చెప్పను పో: బుమ్రా

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌తో తాను చాలా ఇబ్బంది పడ్డానని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. అతని బౌలింగ్ ఆడటం చాలా చాలెంజింగ్‌గా ఉండేదన్నాడు. ఆదివారం బుమ్రాతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్ నిర్వహించిన ఈ సిక్సర్ల సింగ్.. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ పేరుతో బుమ్రాను ఓ ఆట ఆడుకున్నాడు.
క్లిష్టమైన ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెట్టాడు. రోహిత్ శర్మ తరహాలోనే ప్రతీ ప్రశ్నకు ఐదు సెకన్ల సమయం మాత్రమే ఇచ్చి ఇబ్బందికి గురిచేశాడు. రోహిత్‌కు అతని కెరీర్ గురించి మాత్రమే అడిగిన యూవీ.. బుమ్రాకు మాత్రం సమాధానాలు చెప్పలేని ప్రశ్నలు అడిగాడు. యూవీ ప్రశ్నల ధాటికి విలవిలలాడిన బుమ్రా.. ఈ వివాదస్పద ప్రశ్నలేంది బ్రో.. నేను చెప్పలేనంటూ చేతులెత్తేసాడు.

యూవీ-బుమ్రా ర్యాపిడ్ ఫైర్ సాగిందిలా..
యూవీ: విరాట్ కోహ్లి లేక జ్లటాన్ ఇబ్రాహిమోవిక్(స్వీడన్ ఫుట్‌బాల్ ప్లేయర్)లలో నీ ఫిట్‌నెస్ ఐడల్ ఎవరు..?
బుమ్రా: సాధారణంగానే జ్లటాన్ నా ఐడల్.. కాకపోతే అతను నా ఫిట్‌నెస్ ఐడల్ మాత్రం కాదు.
యూవీ: కోహ్లీ- సచిన్‌లలో నీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరు?
బుమ్రా: ఈ ప్రశ్నకు నేను చాలా పెద్ద సమాధానం ఇస్తాను. ఈ ఇద్దరిలో ఎవరు ఉత్తమం అని చెప్పేంత అనుభవం నాకు లేదు. అంత క్రికెట్ నేను ఆడలేదు. వారు నా కంటే ఎక్కువ క్రికెట్ ఆడారు. కేవలం నాలుగేళ్లుగా మాత్రమే నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా.
యూవీ: నేను నీ ఆటోబయోగ్రఫీ అడగడం లేదు. ఈ ర్యాపిడ్ ఫైర్ నిబంధనలను నీకు ముందే చెప్పా. ఐదు సెకండ్లలో సరైన సమాధానం ఇవ్వాలన్నా. ఈ ఇద్దరిలో నీ ఫేవరెట్ ఆటగాడు ఎవరో చెప్పు?
బుమ్రా: ఇది ధోనీ-యూవీల్లో ఎవరు అత్యుత్తమని అడినట్లుంది. నేను అందరినీ ఒకేలా గౌరవిస్తా.
యూవీ: అదంతా తెలియదు.. ఆన్సర్ చెప్పాల్సిందే?
బుమ్రా: సచిన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు కాబట్టి.. సచిన్ పాజీని పిక్ చేయి.

ఇలా అడిగితే కష్టం..
యూవీ: యువరాజ్-ధోనిల్లో నీ ఫేవరెట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఎవరు?
బుమ్రా : యువీ పా.. మీ ఆటను చూస్తూ పెరిగాను. మీరిద్దరూ కలిసి గెలిపించిన ఎన్నో మ్యాచ్‌లను చూశాను. ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావ్. నువ్వు అడుగుతున్న వారందరూ నేను అభిమానించే ఆటగాళ్లే. వారిలో ఒక్కరిని సెలెక్ట్ చేయమంటె ఎలా? మీకు కటక్ వన్డే గుర్తుందా.? అందులో ధోనీ, నీవు నెలకొల్పిన భాగస్వామ్యంతో భారత్ గెలిచింది. ఆ మ్యాచ్ చూసి నేనెంతో సంతోషపడ్డా. నిజాయితీగా చెబుతన్నా మీ ఇద్దరిలో ఒకరిని ఎంపికచేయలేను.
ఆటను అర్థం చేసుకోవడంలో ధోనీని మించినోడు లేడు: ఆర్పీ సింగ్

వివాదస్పద ప్రశ్నలు అడుగుతున్నావ్
యూవీ: మహ్మద్ షమీ, అక్షర్ పటేల్‌లలో ఎవరు ఇంగ్లిష్ బాగా మాట్లాడతారు?
బుమ్రా: ఇది చెప్పడం చాలా కష్టం. కానీ నా ప్రకారం చూస్తే షమీ కంటే అక్షర్ బెటర్.
యూవీ : హర్భజన్ సింగ్-అశ్విన్‌లలో ఎవరు మెరుగైన ఆఫ్ స్పిన్నర్?
బుమ్రా : యూవీ.. నువ్వు వివాదాస్పద ప్రశ్నలు అడుగుతాన్నావు. నేను అశ్విన్‌తో చాలా మ్యాచ్‌లు ఆడాను. హర్భజన్ సింగ్ ఆటను చూస్తూ పెరిగాను. నీ ప్రశ్నకు కచ్చితంగా సమాధానం చెప్పాలంటే మాత్రం భజ్జీనే ఎంచుకుంటా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications